బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]

బీర్ల అయిలయ్య
బీర్ల ఐలయ్య


ప్రభుత్వవిప్‌
పదవీ కాలం
2023 డిసెంబర్ 15 - ప్రస్తుతం

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు గొంగిడి సునీత
నియోజకవర్గం ఆలేరు

వ్యక్తిగత వివరాలు

జననం 06 జూన్ 1975
సైదాపురం, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బీర్ల సామరాజు, బుచ్చమ్మ
జీవిత భాగస్వామి అనిత
నివాసం సైదాపురం

జననం, విద్యాభాస్యం మార్చు

బీర్ల ఐలయ్య 06 జూన్ 1975లో తెలంగాణ రాష్ట్రంయాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, సైదాపురం గ్రామంలో బీర్ల సామరాజు, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1991లో యాదాద్రి భువనగిరిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యను, 1994లో ఆలేరులోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి కళాశాలలో ఇంటర్మీడియట్, భువనగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ డిగ్రీ కళాశాల నుండి 1997లో డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

బీర్ల ఐలయ్య విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) లో చేరి శ్రీ లక్ష్మీ నరసింహ డిగ్రీ కళాశాలలో కాలేజ్ సెక్రటరీ పని చేశాడు. ఆయన 2006లో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సైదాపురం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఐలయ్య ఆ తరువాత 2008లో యాదగిరిగుట్ట మండల అధ్యక్షునిగా, 2013లో యాదగిరిగుట్ట టౌన్ ఎంపీటీసీగా ఎన్నికై, టీపీసీసీ కార్యదర్శిగా, ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

బీర్ల ఐలయ్య 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతపై 49204 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన[4] ఆయనను 2023 డిసెంబర్ 15న ప్ర‌భుత్వ విప్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది.[5][6][7][8]

ఇతర పదవులు మార్చు

బీర్ల ఐలయ్య 1991లో యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం పాలసంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[9]

మూలాలు మార్చు

  1. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 51 మంది.. జాబితా ఇదే!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Namaste Telangana (15 December 2023). "ప్ర‌భుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేలు.. నియమించిన ప్రభుత్వం". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.
  6. Andhrajyothy (16 December 2023). "ప్రభుత్వవిప్‌గా బీర్ల అయిలయ్య". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  7. Sakshi (16 December 2023). "ఉమ్మడి జిల్లాకు మరో కీలక పదవి". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  8. Andhrajyothy (16 December 2023). "ప్రభుత్వ విప్‌లుగా నలుగురు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  9. Andhrajyothy (29 June 2022). "సైదాపురం పాలసంఘం చైర్మన్‌గా బీర్ల ఐలయ్య". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.