యాదగిరిగుట్ట మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం


యాదగిరిగుట్ట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] యాదగిరిగుట్ట, ఈ మండలానికి కేంద్రం. ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలులేవు.మండల ప్రధాన కేంద్రం యాదగిరిగుట్ట. ఇది జనగణన పట్టణం.[2] మండలం కోడ్:04616[3] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.

యాదగిరిగుట్ట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, యాదగిరిగుట్ట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, యాదగిరిగుట్ట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, యాదగిరిగుట్ట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°35′11″N 78°56′46″E / 17.58639°N 78.94611°E / 17.58639; 78.94611
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం యాదగిరిగుట్ట
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,491
 - పురుషులు 27,247
 - స్త్రీలు 27,244
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.79%
 - పురుషులు 74.16%
 - స్త్రీలు 49.52%
పిన్‌కోడ్ 508115

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, యాదగిరిగుట్ట మండల పరిధిలో 1 పట్టణం, 15 గ్రామాలు ఉన్నాయి. మండలంలోని మొత్తం జనాభా 54,491, ఇందులో పట్టణ జనాభా 15,232 కాగా, గ్రామీణ జనాభా 39,259. యాదగిరిగుట్ట మండలం లోని మొత్తం 3,649 కుటుంబాలు నివస్తున్నాయి.[5] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 186 చ.కి.మీ. కాగా, జనాభా 47,211. జనాభాలో పురుషులు 23,569 కాగా, స్త్రీల సంఖ్య 23,642. మండలంలో 11,600 గృహాలున్నాయి.[6]

మండలం లోని పట్టణాలు

మార్చు

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. కాచారం
  2. సాదువెల్లి
  3. గౌరాయిపల్లి
  4. మల్లాపూర్
  5. దాతారంపల్లి
  6. గుండ్లపల్లి
  7. యాదగిరిపల్లి
  8. సైదాపురం
  9. మాసాయిపేట
  10. రామోజీపేట
  11. వంగపల్లి
  12. పెద్దకందుకూరు
  13. చిన్నకందుకూరు
  14. చొల్లేరు
  15. జంగంపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. తాళ్లగూడెం

2.గొల్లగుడెం (గొల్లగుడిసెలు) ఇది దతర్పల్లీ గ్రామంకి చెందినది

మూలాలు

మార్చు
  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Yadadri.pdf
  2. "Villages & Towns in Yadagirigutta Mandal of Nalgonda, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-09-17.
  3. "Yadagirigutta Mandal Villages, Nalgonda, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2021-09-17.
  4. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  5. "Villages and Towns in Yadagirigutta Mandal of Nalgonda, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-09-17. Retrieved 2021-09-17.
  6. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.