బుసిరెడ్డిపల్లె

బుసిరెడ్డిపల్లె, వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బుసిరెడ్డిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
బుసిరెడ్డిపల్లె is located in Andhra Pradesh
బుసిరెడ్డిపల్లె
బుసిరెడ్డిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°25′58″N 78°46′00″E / 14.432799619140303°N 78.76665115524811°E / 14.432799619140303; 78.76665115524811
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చింతకొమ్మదిన్నె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామస్థులైన శ్రీ కొండయ్య, పురాతన కళారూపమైన "చెక్క భజన"లో దిట్ట. ఈ కళ అంటే ఆయనకు ఆరో ప్రాణం. వీరు సాంప్రదాయ కళ అయిన చెక్కభజనకు జీవంపోసి, ప్రాచుర్యం కల్పించుచున్నారు. దీనిపైన ఉన్న ఆసక్తితో చిన్నతనం నుండి, ఎంతో శ్రద్ధతో అభ్యసించి, ఇందులో మంచి నైపుణ్యం సంపాదించారు. ఎక్కడ జాతరలు జరిగినా, దేవుని కార్యక్రమాలు జరిగినా, వీరు అక్కడ ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను అలరించుచున్నారు. ఒకవైపు రాతినార బండల వ్యాపారం నిర్వహించుచూ, మరోవైపు ఈ కళలో ప్రదర్శనలు ఇచ్చుచున్నారు. ఇంతవరకు కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో బహుమతులు, ఎందరి ప్రశంసలనో అందుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోనూ, దాదాపుగా వీరు చెక్కభజన ప్రదర్శనలు ఇచ్చినారంటే ఆశ్చర్యం లేదు. ఇంతేగాక వీరు ఈ కళలో దాదాపు ఒక వేయిమంది ఔత్సాహికులకు, చిన్నా, పెద్దా తేడాలేకుండా శిక్షణ ఇచ్చారు. వారికి ఈ కళలో ఎన్నో మెళుకువలను నేర్పి వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దినారు. పాతకాలపు ఈ కళారూపాన్ని భవిష్యత్తు తరాలవారు మర్చిపోకుండా వారికి గూడా అందజేయాలని వీరి తాపత్రయం.

వెలుపలి లింకులు

మార్చు