బృందా కారత్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికై, ప్రస్తుతం సీపీఐ (మార్కిస్ట్సు) పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా పని చేస్తుంది.[1] బృందా కారత్ రాజకీయాల్లోకి రాకముందు లండ‌న్‌లోని ఏయిర్ ఇండియాలో నాలుగేళ్ల‌పాటు ప‌ని చేసింది.[2]

బృందా కారత్
బృందా కారత్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2005

రాజ్యసభ సభ్యురాలు
పదవీ కాలం
2005-2011
నియోజకవర్గం పశ్చిమ బెంగాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-10-17) 1947 అక్టోబరు 17 (వయసు 77)
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ సీపీఎం
జీవిత భాగస్వామి
(m. invalid year)
సంతకం బృందా కారత్'s signature

రాజకీయ జీవితం

మార్చు

బృందా కారత్ 1971లో క‌ల‌క‌త్తాలో విద్యార్థి ఉద్య‌మాల‌తో ఆమె రాజ‌కీయాల్లోకి వచ్చి 1971 లో సీపీఎం పార్టీలో చేరింది. ఆమె ట్రేడ్ యూనియన్స్ కార్య‌కల‌పాల్లో పాల్గోనేందుకు క‌ల‌క‌త్తా నుండి ఢిల్లీకి మ‌కాం మార్చి, ఉత్త‌ర ఢిల్లీలోని టెక్స్‌టైల్ మిల్లుల యూనియ‌న్ ఆర్గ‌నైజ‌ర్‌గా ప‌ని చేయ‌డం ప్రారంబించింది. బృందా దేశంలో ఉన్న అత్యాచార నిరోధ‌క చ‌ట్టాల‌లో సంస్క‌ర‌ణ‌ల కోసం విస్తృత ప్ర‌చారం చేపట్టింది. ఆమె 1993 నుంచి 2004 వ‌ర‌కు ఆల్ ఇండియా డెమోక్రాటిక్ వుమెన్స్ అసోసియేష‌న్ (ఐద్వా) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసింది.

బృందా కారత్ 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికై, అదే సంవత్సరం సీపీఎం పార్టీలో పొలిట్‌బ్యూరోలో సభ్యురాలిగా నియ‌మితులై, సీపీఎం పార్టీలో పొలిట్‌బ్యూరోలో సభ్యురాలిగా తొలి మ‌హిళగా గుర్తింపు పొందింది.[3][4][5]

మూలాలు

మార్చు
  1. "A BRAND NAMED BRINDA". 2022. Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. "B'day Special: Brinda Karat " from 'air-hostess' to first female member of CPM Polit Bureau". India TV News (in ఇంగ్లీష్). 16 October 2013. Retrieved 9 March 2022.
  3. Sakshi (19 September 2021). "ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్లకు ధారాదత్తం". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  4. Free Press Journal (20 April 2022). "Who is Brinda Karat? All you need to know about CPI (M) leader who blocked bulldozer amid demolition drive in Jahangirpuri" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  5. Prajasakti (20 April 2022). "జహంగీర్‌పూర్‌ కూల్చివేతలపై బుల్డోజర్‌ కు అడ్డుపడ్డ బృందాకరత్". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.

బయటి లింకులు

మార్చు