బృహదీశ్వర దేవాలయం (తంజావూరు)
బృహదీశ్వర ఆలయం (తమిళం: பெருவுடையார் கோவில்; పెరువుదైయార్ కోయిల్[1] బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది.ఇది భారతదేశం అతిపెద్ద దేవాలయముగా పరిగణింపబడుతుంది..
బృహదీశ్వర దేవాలయం (తంజావూరు) | |
---|---|
![]() బృహదీశ్వరాలయం | |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | తంజావూరు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | బృహదీశ్వరుడు (శివుడు) |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | క్రీ. శ.11వ శతాబ్దం |
సృష్టికర్త: | రాజ రాజ చోళుడు |
చరిత్రసవరించు
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
నిర్మాణముసవరించు
ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై, మహాబలిపురం వద్ద విశేష నిర్మాణాలు చేసిన వి.గణపతి స్థపతి పూర్వీకులు. గణపతి స్థపతి దక్షిణ భారతదేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందారు. అతని కుటుంబ సభ్యులు యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. అతని వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళం అనే కొలతల ప్రకారం నిర్మితమైంది.
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైంది, 5 సంవత్సరాల (సా.శ. 1004AD – 1009) కాలంలో పూర్తిఅయింది. ఈ దేవాలయ పునాది శివుని నాట్య భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.[2] పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44 కి.మీ ఎత్తుకు చేర్చబడింది.[3] అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.[3] ఈ దేవాలయం లో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.[3] బయటి గోడలపై, అంతస్తుపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన 81 సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్య భంగిమలు) చెక్కబడి ఉంటాయి.[3] దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.[3]
ఆలయ విగ్రహాలుసవరించు
ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి. 6 అడుగుల ఎత్తు ఉన్నాయి.
చిత్ర మాలికసవరించు
ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉంది.
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
బయటి లింకులు,సవరించు
- ఈనాడు, ఏప్రిల్-6, 2010 ఆదివారం నాటి వ్యాసం
- UNESCO's World Heritage Site
- Panoramic 360 degree views of the Temple
- TLC: Mysteries of India: Lost South Indian Temples (via Google Video)
- Photographs of Brehadiswara and other South Indian Temples
- Article on Indian Murals Archived 2009-03-29 at the Wayback Machine
- Brihadeeswarar Temple
- Photos of Thanjavur Periya Kovil