యముడు లేదా యమధర్మరాజు (Yama) హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి.

కోరలతో ఉన్న యముని చిత్రం.
యముని ఆస్థానంలో యముడు, యమి, చిత్రగుప్తుడు (17వ శతాబ్దానికి చెందిన పట చిత్రం)
టిబెటన్ సంప్రదాయంలో యముని చిత్రం

సమవర్తి

మార్చు

యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనపుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు. యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీత, విభూతి యోగంలో చెప్పాడు.


పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెఱుపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు (స్కంద పురాణము, కాశీ ఖండము - 8/55,56).


యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).

భూలోకంలో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు.

యముని బంధుగణం

మార్చు

సినిమాలద్వారా యముడు

మార్చు

తెలుగు సినిమాలలో మొదటి నుండి యమునికి పెద్ద పీటనే వేసారు. నలుపు తెలుపు చిత్రాల నుండి ఇప్పటి సరికొత్త చిత్రాలైన యమదొంగ, యమగోల వరకూ యమునిపై అనేక కథనాలతో, రకరకాలుగా వాడుకొన్నారు

వనరులు, మూలాలు

మార్చు
  • శ్రీ మద్భగవద్గీత - తత్వ వివేచనీ వ్యాఖ్య - జయదయాల్ గోయంగ్‌కా వ్యాఖ్యానం (గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ)
"https://te.wikipedia.org/w/index.php?title=యముడు&oldid=3888585" నుండి వెలికితీశారు