బెల్లా విస్టా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న రాజభవనం. ఇది హైదరాబాదు రాష్ట్రంలో నిజాం రాజుకు రాజభవనంగా ఉండేది.[1][2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

బెల్లా విస్టా
సాధారణ సమాచారం
రకంరాజభవనం
నిర్మాణ శైలిఫ్రెంచి
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1910
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిఫ్రెంచ్ ఆర్కిటెక్ట్

నిర్మాణం

మార్చు

10 ఎకరాల విస్తీర్ణంలో ఇండో-యూరోపియన్ శైలీలో ఈ బెల్లా విస్టా భవన నిర్మాణం జరిగింది. బెల్లా విస్టా అనగా అందమైన దృశ్యం అని అర్థం. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పద్ధతిలో రూపొందిన ఈ భవనం నుండి హుస్సేన్ సాగర్ చూడవచ్చు.

చరిత్ర

మార్చు

హైదరాబాదు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తైన ముస్లేహుద్దీన్ మహమ్మద్ నివాసంకోసం 1905లో ఈ భవనం నిర్మించబడింది. 1914లో 57 సంవత్సరాల వయసులో ప్లేగు వ్యాధితో ముస్లేహుద్దీన్ మహమ్మద్ మరణించిన తరువాత ఆయన కుటుంబీకులు అమ్మకానికి పెట్టారు. 1917లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఫర్నీచర్ తో సహా రూ. 60,000/- లకు కొన్నాడు.[3]

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడైన ఆజమ్ జా తన భార్య యువరాణి దుర్రూ షెవార్ తో కలిసి ఈ భవనంలో నివసించాడు.[4][5] ఈ భవనానికి ముహమ్మద్ అలీ జిన్నా పర్యాటనకు వచ్చేవాడు. ప్రస్తుతం ఈ భవనం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కళాశాలగా ఉంది.

మూలాలు

మార్చు
  1. "The Prince and The Palace". The Hindu. Archived from the original on 30 మే 2004. Retrieved 2 March 2019.
  2. "Deen Dayal's eyes capture bygone era". Times of India. Archived from the original on 2011-12-04. Retrieved 2 March 2019.
  3. "Hyderabad: 60 royal years in ASCI life". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-12-19. Retrieved 2 March 2019.
  4. "Princess Dürrühsehvar of Berar". The Telegraph. Retrieved 2 March 2019.
  5. Bilquis Jehan Khan. "A Song of Hyderabad". thefridaytimes.com. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 2 March 2019.