బెల్‌గ్రేడ్

సెర్బియా రాజధాని

బెల్‌గ్రేడ్ (Belgrade) అనేది సెర్బియా దేశం యొక్క రాజధాని మరియు అతిపెద్ద నగరం. ఈ నగరం సావా మరియు డానుబే నదుల యొక్క సంగమ ప్రదేశం వద్ద కలదు, ఇక్కడ పానోనియా మైదానం బాల్కన్ ద్వీపకల్పమును కలుస్తుంది. దీని పేరు "వైట్ సిటీ" గా అనువదించబడుతుంది. బెల్గ్రేడ్ నగరం యొక్క నగర ప్రాంతము 1.34 మిలియన్ల జనాభాను కలిగి ఉంది, అయితే 1.65 మిలియన్లకు పైగా ప్రజలు దీని పరిపాలనా పరిధుల్లో నివసిస్తున్నారు.