బేతియా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

బేతియా బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారణ్ జిల్లా లోని పట్టణం [3] ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది పాట్నాకు వాయువ్యంగా 225 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బేతియా
పట్టణం
బేతియా is located in Bihar
బేతియా
బేతియా
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°48′05″N 84°30′10″E / 26.80139°N 84.50278°E / 26.80139; 84.50278
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాపశ్చిమ చంపారణ
Founded byగంగేశ్వర్ దేవ్
Elevation
65 మీ (213 అ.)
Population
 (2011)[1]
 • Total1,32,209
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
845438
Area code06254
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-22
లింగనిష్పత్తి53% male : 47% female /

చరిత్ర మార్చు

సా.శ. 1244 లో, జైతారియా వంశీకుడైన గంగేశ్వర్ దేవ్ అనే బ్రాహ్మణుడు చంపారణ్ వద్ద గల జైతార్ వద్ద స్థిరపడ్డాడు.[4] అతని వారసులలో ఒకరైన అగర్ సేన్, జెహంగీర్ పాలనా కాలంలో పెద్ద భూభాగాన్ని సొంతం చేసుకున్నాడు. షాజహాన్ అతడికి 'రాజా' బిరుదును ప్రసాదించాడు. 1659 లో, అతని తరువాత అతని కుమారుడు రాజా గజ్ సింగ్, బేతియా వద్ద కుటుంబ రాజప్రాసాదాన్ని నిర్మించాడు. అతను సా.శ 1694 లో మరణించాడు ప్యాలెస్ నేటికీ నిలిచి ఉంది. ప్రస్తుతమక్కడ మార్కెట్టు పనిచేస్తోంది.

1765 లో ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీని కొనుగోలు చేసినపుడు దాని పరిధిలో బేతియా సంస్థానం, అతిపెద్ద భూభాగం.[5] రామ్ నగర్ సంస్థానం అధీనంలో ఉన్న చిన్న భాగం మినహాయించి మొత్తం చంపారణ్ అంతా ఇందులో ఉండేది.

మహారాజా సర్ హరేంద్ర కిషోర్ సింగ్ బేతియా సంస్థానపు చివరి రాజు.[4] అతను 1854 లో జన్మించాడు. 1883 లో తండ్రి మహారాజా రాజేంద్ర కిషోర్ సింగ్ బహదూర్ దివంగతుడయ్యాక అధికారానికి వచ్చాడు. 1884 లో, అతను మహారాజా బహదూర్ అనే బిరుదును వ్యక్తిగత హోదాగా పొందాడు. బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ అగస్టస్ రివర్స్ థాంప్సన్ నుండి ఖిలాత్, సనద్‌లు పొందాడు. 1889 మార్చి 1 న అతను భారత సామ్రాజ్యపు అత్యంత ప్రసిద్ధ ఆర్డర్ ఆఫ్ నైట్ కమాండరుగా అలంకృతుడయ్యాడు. 1891 జనవరిలో బెంగాల్ శాసనమండలి సభ్యుడిగా నియమితులయ్యాడు. అతను ది ఆసియాటిక్ సొసైటీలో సభ్యుడు కూడా అతను బేతియా సంస్థానపు చివరి పాలకుడు. మహారాజా సర్ హరేంద్ర కిషోర్ సింగ్ బహదూర్ 1893 మార్చి 26 న మహారాణి శివ్ రత్న కున్వర్, మహారాణి జంకీ కున్వర్ అనే ఇద్దరు భార్యలను అనాథలను చేసి, వారసులు లేకుండా మరణించాడు. మహారాణి జంకీ కున్వర్ పేరిట ఎమ్‌జెకె కాలేజ్, ఎమ్‌జెకె హాస్పిటల్ వంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. బేతియా ఘరానా గాత్ర సంగీతపు పురాతన శైలుల్లో ఒకటి.[6] మధుబన్ పూర్వపు 'బేతియా సంస్థానం'లో భాగం. కాలక్రమంలో అంతర్గత వివాదాలు, కుటుంబ కలహాల కారణంగా బేతియా సంస్థానం విభజనకు లోనైంది. పర్యవసానంగా మధుబన్ సంస్థానం ఏర్పడింది.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ దర్బారు నుండి దిల్లీ ఘరానా కు చెందిన ధ్రుపద్ గాయకులలో కొందరు బేతియా సంస్థానపు పోషణ లోకి బేతియాకు వలస వచ్చారు. తద్వారా బేతియా ఘరానాకు మూలపురుషులయ్యారు [6] ప్రఖ్యాత దాగర్ సోదరులు బేతియా ధ్రుపద్ గాయకులను ప్రశంసించారు. వారిలో కొంతమంది 1990 లో ఇతర నిష్ణాత గాయకులతో కలిసి భోపాల్ లోని భారత్ భవన్ లో తమ కళను ప్రదర్శించారు .

వాతావరణం మార్చు

బేతియా వాతావరణం అధిక ఉష్ణోగ్రతలతో, వర్షాకాలంలో అధిక అవపాతంతో కూడుకుని ఉంటుంది. ఈ శీతోష్ణస్థితిని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం)గా వర్ణిస్తారు.

శీతోష్ణస్థితి డేటా - Bettiah
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23.3
(73.9)
26.3
(79.4)
32.4
(90.3)
37.3
(99.1)
38.7
(101.7)
37
(99)
33.5
(92.3)
32.8
(91.1)
33.3
(91.9)
32.3
(90.1)
29.2
(84.6)
24.6
(76.2)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 9.1
(48.3)
11.1
(51.9)
16.1
(60.9)
21.2
(70.2)
24.6
(76.2)
26.2
(79.1)
25.7
(78.3)
25.4
(77.8)
24.6
(76.3)
21.0
(69.8)
14.6
(58.2)
10.2
(50.4)
19.2
(66.5)
సగటు అవపాతం mm (inches) 13
(0.5)
13
(0.5)
10
(0.4)
18
(0.7)
46
(1.8)
200
(7.7)
380
(14.9)
360
(14)
230
(8.9)
66
(2.6)
5.1
(0.2)
5.1
(0.2)
1,330
(52.4)
Mean daily sunshine hours 11.1 11.7 12.4 13.2 13.9 14.2 14.1 13.5 12.7 11.9 11.2 10.9 12.6
Source: Weatherbase[7]

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బేతియా పట్టణ జనాభా 1,32,209. వీరిలో 69,529 మంది పురుషులు, 62,680 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లలు 18,995. బేతియా అక్షరాస్యత 91,298. ఇది జనాభాలో 69.1%, పురుషుల్లో అక్షరాస్యత 72.7%, స్త్రీలలో అక్షరాస్యత 64.9%. బేతియాలో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 80.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 85.0%, స్త్రీల అక్షరాస్యత 75.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8,266, షెడ్యూల్డ్ తెగల జనాభా 828. 2011 లో బేతియాలో 24463 గృహాలు ఉన్నాయి.[1]

బేతియా పట్టణ సముదాయంలో బేతియా, తోలా మన్సారౌత్, కర్గాహియా పురబ్, హాత్ సరయ్యా ఉన్నాయి.[8] తోలా శాన్ సరయన్ కొత్త పట్టణాధార గ్రామం. కొత్త గోపాల్‌గంజ్-బేతియా రహదారి ఈ గ్రామం గుండా వెళ్తుంది. ఈ కొత్త రహదారి ద్వారా గోపాల్‌గంజ్-బేతియాల మధ్య దూరం 60 కి.మీ. తగ్గుతుంది.[9]

పట్టణ ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Census of India: Bettiah". www.censusindia.gov.in. Retrieved 5 December 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 23 March 2019.
  3. "Tirhut Division". tirhut-muzaffarpur.bih.nic.in. Archived from the original on 16 March 2015.
  4. 4.0 4.1 Lethbridge, Sir Roper (2005). The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated of the Indian Empire (in ఇంగ్లీష్). Aakar Books. p. 67. ISBN 978-81-87879-54-1. Retrieved 19 January 2020.
  5. Ram, Bindeshwar (1998). Land and society in India: agrarian relations in colonial North Bihar. Orient Blackswan. ISBN 978-81-250-0643-5.
  6. 6.0 6.1 "Many Bihari artists ignored by SPIC MACAY". The Times of India. 13 October 2001. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 16 March 2009. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "The Times of India" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. "Weatherbase.com". Weatherbase. 2015. Archived from the original on 4 మార్చి 2016. Retrieved on 27 August 2015.
  8. "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 6 March 2016. Retrieved 16 April 2012.
  9. Kumar, Arun. "Need to shun politics for Bihar's growth: Nitish". Hindustan Times.


"https://te.wikipedia.org/w/index.php?title=బేతియా&oldid=3798752" నుండి వెలికితీశారు