బేరియం సల్ఫైడ్
బేరియం సల్ఫైడ్ అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.బేరియం, సల్ఫర్ అను రెండు మూలకాల సమ్మేళనం వలన బేరియం సల్ఫైడ్ ఏర్పడినది.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం. ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా BaS.బేరియం కార్బోనైట్ (BaCO3, వర్ణకం లిథోపోన్, జింకు సల్ఫైడ్ (ZnS) బేరియం సల్ఫేట్ (BaSO4) వంటి పలు బేరియం సంయోగ పదార్థాల ఉత్పత్తికి బేరియం సల్ఫైడ్ పుర్వగామి (precursor) గా పనిచేయును[2]. ఇతర క్షార మృత్తిక లోహాల చాకోజేనైడ్‌లవలె బేరియం సల్ఫైడ్ను, ఎలక్ట్రాన్ డిస్ప్లేలలో తక్కువ పొడవుగల కాంతి తరంగధ్యైర్ఘ్య ఏమిటర్ (wavelength emitters) గా ఉపయోగిస్తారు.
గుర్తింపు విషయాలు | |
---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [21109-95-5] |
పబ్ కెమ్ | 6857597 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 244-214-4 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32590 |
SMILES | [Ba+2].[S-2] |
| |
ధర్మములు | |
BaS | |
మోలార్ ద్రవ్యరాశి | 169.39 g/mol |
సాంద్రత | 4.25 g/cm3 [1] |
ద్రవీభవన స్థానం | 1,200 °C (2,190 °F; 1,470 K) |
బాష్పీభవన స్థానం | decomposes |
2.88 g/100 mL (0 °C) 7.68 g/100 mL (20 °C) 60.3 g/100 mL (100 °C) | |
ద్రావణీయత | insoluble in alcohol |
వక్రీభవన గుణకం (nD) | 2.155 |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Halite (cubic), cF8 |
Fm3m, No. 225 | |
కోఆర్డినేషన్ జ్యామితి
|
Octahedral (Ba2+); octahedral (S2−) |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R20/22, మూస:R31, R50 |
S-పదబంధాలు | (S2), S28, S61 |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Magnesium sulfide Calcium sulfide Strontium sulfide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చుబేరియం సల్ఫైడ్ రంగులేని ఘన స్థితిలో ఉండు ఒక సంయోగపదార్థం.బేరియం సల్ఫైడ్‌యొక్క అణుభారం 169.39 గ్రాములు/మోల్. ఈ సమ్మేళన పదార్థం యొక్క సాంద్రత 4.25 గ్రాములు/సెం.మీ3. బేరియం సల్ఫైడ్ యొక్క ద్రవీభవన స్థానం 1,200 °C (2,190 °F; 1,470K).ఈ రసాయన పదార్థం బాష్పికరణ కన్న ముందే వియోగం చెందును.నీటిలో కరుగుతుంది.నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది, నీటిలో ద్రావణీయత పెరుగుతుంది.ఆల్కహాల్‌లో కరుగదు.
ఆవిష్కరణ-ఉత్పత్తి
మార్చువిన్సేన్టినస్ కాసియోరోలస్ (Vincentinus Casciorolus1571-1624 ) అనునతడు, బారైట్ (barite) అను ఖనిజంగా లభించు బేరియం సల్ఫేట్ (Baso4) ను క్షయికరించడం ద్వారా బేరియం సల్ఫైడ్ ను మొదటి సారి ఉత్పత్తి చేసాడు.[3]. వర్తమాన కాలంలో కాసియోరోలస్ ప్రక్రియలో మార్పు చేసి గతంలో ఉపయోగిస్తున్నపిండి (flour) కి ప్రత్నామ్యాయంగా కోక్ (coke) ను ఉపయోగిస్తున్నారు.ఈ విధానాన్ని కార్బోథేర్మిక్ చర్య అంటారు
- BaSO4 + 2C → BaS + 2CO2
బేరియం సల్ఫేట్ కు ఉన్న ఫాస్పారెసేన్స్ ఈ సమ్మేళనంలో ఉండు స్వాభావిక రాగి మాలిన్యం వలన అని తెలుస్తున్నది.
భద్రత
మార్చుబేరియం సల్ఫైడ్ విషపూరితమైనది.నీటితో సంపర్కం వలన హడ్రోజన్ సల్ఫైడ్ అను విషయుతమైన వాయువును విడుదల చేయును.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Lide, David R., ed. (2006). CRC Handbook of Chemistry and Physics (87th ed.). Boca Raton, FL: CRC Press. ISBN 0-8493-0487-3.
- ↑ Holleman, A. F.; Wiberg, E. "Inorganic Chemistry" Academic Press: San Diego, 2001. ISBN 0-12-352651-5.
- ↑ F. Licetus, Litheosphorus, sive de lapide Bononiensi lucem in se conceptam ab ambiente claro mox in tenebris mire conservante, Utini, ex typ. N. Schiratti, 1640. See http://www.chem.leeds.ac.uk/delights/texts/Demonstration_21.htm Archived 2011-08-13 at the Wayback Machine