బొడ్డా ప్రత్యూష
బొడ్డా ప్రత్యూష భారతీయ చదరంగం క్రీడాకారిణి. అండర్-9 విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-18 విభాగాల్లో కామన్‌వెల్త్ చాంపియన్‌గా నిలిచింది. అలాగే, అండర్-16 ఏషియన్ చాంపియన్‌షిప్‌ను కూడా కైవసం చేసుకుంది.
బొడ్డా ప్రత్యూష | |
---|---|
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | 1997 (age 26–27) తుని, తూర్పు గోదావరి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
టైటిల్ | ఉమెన్ గ్రాండ్ మాస్టర్ (2020) |
ఫిడే రేటింగ్ | 2328 (March 2020) |
అత్యున్నత రేటింగ్ | 2346 (జూన్ 2016) |
ఆమె 2012లో భారతీయ బాలికల అండర్-17 ఛాంపియన్.[1] 2015లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ను ఆమె సంపాదించింది.[2] కోనేరు హంపీ (2001), ద్రోణవల్లి హారిక (2004) తర్వాత ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ తెలుగు మహిళగా 2020లో ప్రత్యూష నిలిచింది. 2020 మార్చి నాటికి ఆమె FIDE స్టాండర్డ్ రేటింగ్ 2328.[3] హైదరాబాదులో తన పేరున ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ ఏర్పాటు చేసారు.
1997 సంవత్సరం బొడ్డా ప్రత్యూష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించారు.[3][4] తండ్రి ప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి సత్యాదేవి గృహిణి. ఆమె అక్కడే శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ పాఠశాలలో విద్యను అభ్యసించింది.
2022 ఏప్రిల్ 14న కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ వంగలపూడి రవితేజను బొడ్డా ప్రత్యూష వివాహం చేసుకోనున్నారు.[5]
మూలాలు
మార్చు- ↑ "Pratyusha feted". The Hindu. 9 August 2012. Retrieved 19 June 2016.
- ↑ "Pratyusha joins the big league of women's chess". The Hindu. 13 May 2015. Retrieved 19 June 2016.
- ↑ 3.0 3.1 "Pratyusha, Bodda". FIDE.com. Retrieved 18 December 2021.
- ↑ "Chess player Pratyusha makes the right moves". DeccanChronicle.com. 13 May 2015. Retrieved 13 May 2015.
- ↑ "ప్రత్యూష పెళ్లికూతురాయెనే". EENADU. Retrieved 2022-04-14.