ద్రోణవల్లి హారిక

చదరంగం క్రీడాకారిణి

ద్రోణవల్లి హారిక ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. జనవరి 12, 1991లో గుంటూరు జిల్లాలో జన్మించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ బిరుదులు పొందినది[1].

ద్రోణవల్లి హారిక
Dronavalli Harika.jpg
పూర్తిపేరుద్రోణవల్లి హారిక
దేశం భారతదేశం
టైటిల్ఇంటర్నేషనల్ మాస్టర్
మహిళా గ్రాండ్ మాస్టర్
FIDE rating2491 (మే 2010)
పీక్‌రేటింగ్2491 (మే 2010)

ఏడు సంవత్సరముల వయసులోనే చదరంగం నేర్చి ఆసియా ఖండపు పది సంవత్సరాలలోపు వయస్సు (U-10), పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు (U-12) పోటీలలో మొదటి స్థానము సంపాదించింది. ముంబై లో 2003లో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో మహిళా విభాగములో రెండవ స్థానము పొందింది.

హారిక మూడు ప్రపంచ యువ చదరంగ బిరుదులు స్వంతము చేసుకున్నది[2].

  • హెరాక్లియో, గ్రీసులో అండర్-14 - 2003
  • బటూమి, జార్గియా, అండర్-18 - 2006
  • గజియాన్ టెప్, టర్కీ, ప్రపంచ యువ చదరంగ పోటీ- 2008

అవార్డులు, పురష్కారాలుసవరించు

  • 2007లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో గౌరవించింది.
  • 2019లో పద్మశ్రీ పురస్కారం.

మూలాలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.