కోనేరు హంపి

చదరంగం క్రీడాకారిణి

కోనేరు హంపి (Koneru Humpy) భారతదేశపు చదరంగ క్రీడాకారిణి. ఫైడ్ ఎలో రేటింగ్ (FIDE Elo rating) లో మహిళా చదరంగంలో రెండో స్థానంలో నిల్చింది.[1][2]. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందింది.

కోనేరు హంపి
Koneru Humpy.jpg
పూర్తిపేరుకోనేరు హంపి
దేశం భారతదేశం
టైటిల్గ్రాండ్ మాస్టర్
FIDE rating2612
(అక్టోబరు 2007 FIDE రేటింగు ప్రకారం మహిళలలో రెండవ స్థారంలో ఉంది)
పీక్‌రేటింగ్2612
(జనవరి 2008)

జననం.విద్యసవరించు

కోనేరు హంపి 1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించినది. ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకోగానే, అశోక్ తన వృత్తినుండి తొలగి హంపికి పూర్తి స్థాయి శిక్షకుడిగా మారిపోయాడు. ఆ తరువాత 1998లో 10 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి స్వర్ణపతకం సంపాదించి, వివిధ వాణిజ్య సంస్థలనుండి ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకుంది.

క్రీడా విశేషాలుసవరించు

హంపి ప్రపంచ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌ను 2001 లో కైవసం చేసుకుంది.

2007 అక్టోబరు లో ఫైడ్ ఎలో రేటింగ్ (FIDE Elo rating) లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది.[1][2]. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. కేవలం 15 సంవత్సరాల నెలా, 27 రోజుల వయస్సులోనే ఈ స్థానానికి ఎదిగింది [3].

హంపి పేరును ఇంతకు ముందు ఆంగ్లంలో Hampi అని రాసేవారు, తరువాత రష్యను పేరులా కనపడటానికి Humpy గా మార్చారు[4].

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ChessBase.com Retrieved on April 15 2007.
  2. 2.0 2.1 Humpy's rankings from 2001-07. Retrieved on April 15 2007.
  3. ChessBase.com. Retrieved on April 15 2007.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-07. Retrieved 2008-03-14.
  5. http://mha.nic.in/awards.htm Archived 2008-02-25 at the Wayback Machine - ఇప్పటి వరకూ ఇచ్చిన పద్మశ్రీ పురస్కార వివరాలు.
  6. http://yas.nic.in/yasroot/awards/arjuna.htm#Chess Archived 2007-02-25 at the Wayback Machine - ఇప్పటి వరకూ ఇచ్చిన అర్జునా అవార్డు వివరాలు

బయటి లింకులుసవరించు