బొడ్డు బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు పట్టణానికి చెందిన కవి, రచయిత. ఇతడు 1912లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు బొడ్డు వేంకట వేంకటసుబ్బారాయుడు. ఇతడు గరికపాటి మల్లావధాని వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్యాలు, వ్యాకరణము అభ్యసించాడు[1].

అవధానముసవరించు

ఇతడు 1932, నవంబర్ 18వ తేదీన ఏలూరు ఆదివారపు పేటలో ఒక అష్టావధానాన్ని తన 20వ యేట విజయవంతంగా నిర్వహించాడు[1]. ఈ అవధానంలో వర్ణన, సమస్య, పుష్పగణనము, చతురంగ ఖేలనము, దత్తపది, సంభాషణము, వ్యస్తాక్షరి, ఆకాశపురాణము అనే ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఈ అవధానంలో పృచ్ఛకులుగా శతావధానులు వేలూరి శివరామశాస్త్రి, దోమా వేంకటస్వామిగుప్త, కాకర్ల కొండలరావు, హరి రామలింగశాస్త్రి, అష్టావధానులు గరికపాటి మల్లావధాని, కొత్తపల్లి సుందరరామయ్య పాల్గొన్నారు. ఈ అవధానానికి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అధ్యక్షునిగా వ్యవహరించాడు.

అవధానంలో ఇతడు పూరించిన సమస్య: నువ్వులు నానిపోవుటకు నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్

పూరణ:

పువ్వులఁగోయు నన్నిపుడు పొంతకు రమ్మనఁబేరులేదె? ఓ
నువ్విట కేగుదెమ్ము వడి నువ్వని నువ్వని మాటిమాటికిన్
నవ్వుచుఁ బల్కకుండినను నాతిరొ! నువ్వని పిల్తువింక నీ
నువ్వులు నానిపోవుటకు నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్

రచనలుసవరించు

 1. శ్రీ చందనాలు (ఖండకావ్యము)
 2. కలిక[2] (కథా సంపుటి)
 3. విపంచి (ఖండకావ్యము)
 4. కాత్యాయిని (బాల గేయసంపుటి)
 5. కాక విలాసము (పద్యకృతి)

కథలుసవరించు

 1. ఆదెమ్మపిన్ని గేదె[3]
 2. ఏకోదరులు
 3. కలసిన సంబంధం
 4. గాలివాలు[4]
 5. గురువాక్యము
 6. దయ్యాన్ని...
 7. ధనమూలమ్
 8. పన్నీటి ఊట కన్నీటి బాట[5]
 9. పరిశోధన
 10. ప్రతిజ్ఞా పాలనము
 11. ప్రతిధ్వని
 12. ప్రేమ పవిత్రత
 13. ప్రేమదేవత నవ్వింది[6]
 14. ఫోటో గడిబిడి
 15. రెవికలగుడ్డ
 16. వ్రతం చెడ్డా...[7]
 17. శాస్తి
 18. అతీతం
 19. దొంగదయ్యాలు
 20. విధి
 21. కిటికీ రెక్కలు
 22. పరీక్ష
 23. నిష్కృతి
 24. చిల్లిచెంబు
 25. పుణ్యాత్ములు మొదలైనవి

మరణముసవరించు

ఇతడు 1972లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తనకు జరుగుతున్న ఒక సన్మానసభలో పరవశంతో ప్రసంగిస్తూ అలాగే చనిపోయాడు[1].

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ సంపాదకులు.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 266–268. |access-date= requires |url= (help)
 2. భారతి మాసపత్రిక జనవరి 1938 సంచిక పేజీలు 88-89
 3. బొడ్డు బాపిరాజు (1955-10-05). "ఆదెమ్మ పిన్ని గేదె". ఆంధ్ర వారపత్రిక: 12–17. Retrieved 3 May 2015.
 4. బొడ్డు బాపిరాజు (1953-06-03). "గాలివాలు". ఆంధ్రవార పత్రిక. 45 (40): 10–11, 55–56. Retrieved 3 May 2015.
 5. బొడ్డు బాపిరాజు (1968-04-26). "పన్నీటి ఊట కన్నీటి బాట". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 60 (33): 16–22. Retrieved 3 May 2015.
 6. బొడ్డు బాపిరాజు (1953-07-08). "ప్రేమదేవత నవ్వింది". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 45 (45): 6–8, 53. Retrieved 3 May 2015.
 7. బొడ్డు బాపిరాజు (1955-11-23). "వ్రతం చెడ్డా". ఆంధ్ర వారపత్రిక. 49 (12): 33–39. Retrieved 3 May 2015.