పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా 31మంది కంటే ఎక్కువ తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు అనేది క్రింద జాబితాగా పొందుపరచబడింది.
రచయిత పేరు | ప్రస్తుత నివాసం | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు |
---|---|---|---|---|
లంకిపల్లె | నవుడూరు (పెనుమంట్ర మండలం) | |||
చర్ల వెంకట సూర్యనారాయణమూర్తి | కాకరపర్రు (పెరవలి మండలం) | |||
బొడ్డు బాపిరాజు | ఏలూరు | |||
బి.హెచ్. గంగాధరశాస్త్రి | ఏలూరు | |||
శనివారపు వేంకటలక్ష్మీనరసింహమూర్తి | తణుకు | |||
వి. రామజోగయ్య | ||||
వారణాసి గంగాధరశాస్త్రి | హైదరాబాద్ | కొవ్వూరు | ||
పెమ్మరాజు రాజారావు | తణుకు | |||
నల్లా నారాయణరావు | పశ్చిమ గోదావరి | ఏలూరు | ||
సత్తిరాజు లక్ష్మీనారాయణ | ఇతర దేశం | బాపు, రేఖ | 1933 డిసెంబరు 15 | నరసాపురం |
బాలం వెంకటరావు | పశ్చిమ గోదావరి | 1951 డిసెంబరు 15 | వెలగలేరు (పెనుమంట్ర మండలం) | |
మన్ మోహన్ సహాయ్ | విశాఖపట్నం | భైరవయ్య, ధనుస్సు, కైవల్య | 1942 డిసెంబరు 8 | నర్సాపురం |
తాడి బలరామకృష్ణ | హైదరాబాద్ | బలరాం, బమ్ | 1963 ఏప్రిల్ 15 | లక్ష్మిపాలెం |
ముంగండ రామచంద్రరావు | విశాఖపట్నం | బాబ్జీ | 1946 జూన్ 4 | లక్కవరం |
బొల్లాప్రగడ వెంకటపద్మరాజు | కృష్ణ | 1969 జూన్ 10 | కొప్పర్రు | |
హనుమంతు రామచంద్రం | కృష్ణ | అశోక్, చంద్రం, హెచ్. ఆర్. చంద్రం | 1947 సెప్టెంబరు 8 | పశ్చిమగోదావరి జిల్లా |
చిలకమఱ్ఱి ఆనందారామం | హైదరాబాద్ | సి. ఆనందారామం | 1935 ఆగస్టు 20 | ఏలూరు |
చింతపెంట కమల | ఇతర రాష్ట్రం | మారుతి | 1941 ఆగస్టు 1 | తాడిమళ్ళ, (నిడదవోలు మండలం) |
చిత్రపు హనుమంతరావు | ఇతర రాష్ట్రం | 1938 జూలై 28 | భీమవరం | |
చేగొండి రామజోగయ్య | హైదరాబాద్ | 1945 మార్చి 29 | దొడ్డిపట్ల (యలమంచిలి మండలం) | |
డి. రవీంద్ర కుమార్ | పశ్చిమ గోదావరి | డి. ఆర్. ఇంద్ర | 1951 జనవరి 1 | రావులపాలెం, నర్సాపురం |
డోకల సుజాతాదేవి | పశ్చిమ గోదావరి | 1949 ఏప్రిల్ 26 | ఏలూరు | |
దామరాజు వెంకట సత్య భాస్కర రామమూర్తి | గుంటూరు | శివప్రసాద్ | 1957 నవంబరు 25 | పశ్చిమ గోదావరి జిల్లా |
దేవరకొండ బాలగంగాధర తిలక్ | 1 ఆగస్టు19 21 | మండపాక | ||
దేవరకొండ గంగాధర రామారావు | పశ్చిమ గోదావరి | 1930 అక్టోబరు 06 | తణుకు | |
దాసిరెడ్డి వీరవెంకట నాగ విశ్వేశ్వర వర ప్రసాద్ | పశ్చిమ గోదావరి | దాసిరెడ్డి ప్రసాద్ | 1970 అక్టోబరు 13 | ఆచంట |
దివాకర్ల వెంకటేశ్వర్లు | కృష్ణ | 1939 జూలై 29 | యండగండి | |
దేవరకొండ వేంకట రామ భాస్కర శాస్త్రి | హైదరాబాద్ | దేవరకొండ, దే.వేం.రా. భాస్కర శాస్త్రి | 1932 జనవరి 7 | మండపాక |
గోటేటి లలితాశేఖర్ | గుంటూరు | 1958 సెప్టెంబరు 12 | ఉండి, (భీమవరం మండలం) | |
గుత్తుల భాస్కరరావు | తూర్పు గోదావరి | 1949 మార్చి 22 | వేల్పూరు | |
కూచిభొట్ల వాణీప్రభాకరి | పశ్చిమ గోదావరి | కూచిభొట్ల | 1965 జూన్ 05 | తణుకు |
ఇవి కూడా చూడండి
మార్చు- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- కర్నూలు జిల్లా కథా రచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
- కరీంనగర్ జిల్లా కథా రచయితలు
- మెదక్ జిల్లా కథా రచయితలు
- వరంగల్ జిల్లా కథా రచయితలు
- అదిలాబాద్ జిల్లా కథా రచయితలు
- నల్గొండ జిల్లా కథా రచయితలు
- మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు
- కృష్ణా జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- గుంటూరు జిల్లా కథా రచయితలు
- ఖమ్మం జిల్లా కథా రచయితలు
- జాతీయ తెలుగుకథా రచయితలు
మూలాలు
మార్చు- ↑ [1] http://kathanilayam.com కథానిలయం జాలగూడు]