బొడ్డు భాస్కర రామారావు

బొడ్డు భాస్కర రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994 నుంచి 2004 వరకు పెద్దాపురం ఎమ్మెల్యేగా పనిచేశాడు. క‌రోనా బారిన‌ప‌డిన ఆయన విశాఖ‌ప‌ట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ 2021 మే 2న మరణించాడు.[1][2][3] ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బొడ్డు భాస్కర రామారావు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 నుంచి 1999 & 1999 నుంచి 2004
నియోజకవర్గం పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 02 మే 2021
విశాఖ‌ప‌ట్నం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

రాజకీయ జీవితం మార్చు

బొడ్డు భాస్కర రామారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 1971 నుంచి 1981 వరకు పెద్దాడ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యాడు. అనంతరం 1982లో సామర్లకోట సమితి అధ్యక్షునిగా పనిచేశాడు. భాస్కర రామారావు 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశాడు.భాస్కర రామారావు 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవరం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతం పద్మనాభం పై 12458 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతం గాంధీ మోహన్ పై 5306 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. భాస్కర రామారావు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట గోపాలకృష్ణ చేతిలో 10584 ఓట్ల తేడాతో, 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పంతం గాంధీ మోహన్ చేతిలో 3056 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[4][5] ఆయన 2012-2017 వరకు టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేశాడు.

మూలాలు మార్చు

  1. NTV Telugu. "క‌రోనాతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ క‌న్నుమూత‌" (in ఇంగ్లీష్). Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  2. Eenadu (3 May 2021). "మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు మృతి". www.eenadu.net. Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  3. The Hans India (3 May 2021). "Kakinada: Ex-MLC Boddu Bhaskara Rama Rao dies of Covid" (in ఇంగ్లీష్). Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  4. Sakshi (3 May 2021). "ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  5. The Times of India (3 May 2021). "Former MLA succumbs to Covid; first MLA of Rajahmundry passes away | Visakhapatnam News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.