బొబ్బిలి పురపాలక సంఘం
బొబ్బిలి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గంలోని, బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.[1]
బొబ్బిలి | |
స్థాపన | 1956 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | బొబ్బిలి |
కార్యస్థానం |
|
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుబొబ్బిలి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 500 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1956లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.1980 లో 2వ తరగతి మునిసిపాలిటీగా మార్చబడింది.సముద్ర మట్టానికి 108 మీటర్ల ఎత్తులో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చుబొబ్బిలి పురపాలక సంఘంలో 30 వార్డులుగా విభజించబడింది, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 56,819 జనాభా ఉండగా అందులో పురుషులు 28,285, మహిళలు 28,534 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు 69% ఉండగా అందులో పురుష జనాభాలో 75%, స్త్రీ జనాభాలో 63%అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5,693 ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో మొత్తం 14,584 గృహాలు ఉన్నాయి.
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా తూముల అచ్చుతవల్లి పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా చోడిగంజీ రమేష్ పనిచేస్తున్నాడు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- వేణుగోపాల స్వామి ఆలయం
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-21. Retrieved 2020-06-20.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.