బొమ్మన విశ్వనాథం

బొమ్మన విశ్వనాథం భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి[1]. ఇతడు 1934, నవంబర్ 7వ తేదీన ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం పట్టణంలో జన్మించాడు. ఇతని మాతృభాష తెలుగు అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా ఇతడు తన పదవయేట కలకత్తా చేరుకున్నాడు. అప్పటి నుండి బెంగాలీ భాషను అభ్యసించాడు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచనలు అధ్యయనం చేయడంతో సారస్వతాభిమానం పెంపొదింది. వంగ సాహిత్యాన్ని అభ్యసించడంతో పాటు ఇతర భారతీయ భాషలలోని సాహిత్యాన్ని చవి చూడాలనే ఆసక్తితో తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు[2].

రచనలు మార్చు

ఇతని మాతృభాష తెలుగు అయినా, ఇతడు చిన్నప్పటి నుండి వంగదేశంలోనే వుండడం వలన ఇతడు బెంగాలీ భాషలోనే మొదట స్వతంత్ర రచనలు చేశాడు.

  1. అజ్ కేర్ డాక్
  2. సూచనా (నాటకాలు)
  3. నాటికా (ఏకాంకిలు)
  4. ఆధునిక్ భారతేర్ గల్ప సంచయన్ - 14 భారతీయ భాషలనుండి బెంగాలీలోనికి అనువదించబడిన 14 కథలు.
  5. కేరళార్ గల్పగుచ్చ - 14 ఉత్తమ మళయాల కథలకు బెంగాలీ అనువాదం
  6. ఆంధ్రేర్ గల్పగుచ్ఛ - 7 ఉత్తమ తెలుగు కథలకు బెంగాలీ అనువాదం
  7. ఆధునిక్ భారతేర్ కబితా సంచయన్ - 19 ఉత్తమ కవితల బెంగాలీ అనువాదం.
  8. భిన్న్ ప్రదేశీ కబితా
  9. భారతీయ గల్ప సంకలన్
  10. నాయికర్ నామ్ రీటా
  11. కృష్ణ చందర్ గల్ప
  12. జిద్
  13. మనాలా
  14. ఏక్తి ప్రేమర్ కాహిని
  15. సురేర్ సానాయ్ బాజుక్ (మూలం: కొడవటిగంటి కుటుంబరావు)
  16. ఆమ్రపాలి (మూలం: రామచంద్ర ఠాకూర్)
  17. కళ్యాణమల్ (మూలం: సర్దార్ కె.ఎం.పణిక్కర్)
  18. కేరళ్ సింహం (మూలం: సర్దార్ కె.ఎం.పణిక్కర్)
  19. సిమిడి (మూలం: తకళి శివశంకర పిళ్ళై నవల చెమ్మీన్)
  20. తుమి అమర్ కమ్యూనిష్ట కరేచ (మూలం: తొప్పిల్ భాసి)

మూలాలు మార్చు

  1. "National Library".
  2. ఎ.ఎస్.రామారావు (15 December 1960). "వంగసాహిత్యంలో వెన్నెలలు వెదజల్లుతున్న ఆంధ్రుడు బొమ్మన విశ్వనాథం". చుక్కాని. Retrieved 7 December 2018.[permanent dead link]