బొమ్మరిల్లు (పత్రిక)

బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక, సినీ నిర్మాత, దర్శకుడు అయిన, శ్రీ విజయ బాపినీడు 1971లో స్థాపించారు. దాదాపు, చందమామ వరవడిలోనే కథలు ధారావాహికలు వచ్చేవి కాని భాష, కథా కథనం, కథల ఎంపిక చాలా వేరుగా ఉండేది. ఇందులో మొట్టమొదటి ధారావాహిక 'మృత్యులోయ'. బేతాళ కథలలాగున 'కరాళ కథలు' అని ఒక ధారావాహిక కూడా ప్రవేశపెట్టారు. పత్రికతో బాటు ఒక అనుబంధం కూడా ఇచ్చే పద్ధతి ఈ పత్రికే మొదలు పెట్టింది. కొంతకాలం ఒక రిబ్బనులాంటి వెడల్పుగా చాలా బారుగా ఉన్న ఒక ప్రతిని ఇచ్చేవారు. తరువాత, ఒక చిన్న పుస్తకం ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ చిన్న పుస్తకంలో ఓ కథ బొమ్మలతో వేసేవారు. శ్రీమతి గుత్తా విజయలక్ష్మి గారు 'కుందేలు కథలు' అనేకం (ఆంగ్ల కథలకు స్వేఛ్ఛానువాదం) ఈ చిన్న పుస్తకానుబంధం కోసం వ్రాసారు. చందమామకు దీటయిన పోటీనిచ్చింది ఈ పత్రిక.

విజయ బాపినీడు

స్థాపకుడు

మార్చు

ఈ పత్రిక స్థాపకుడు బాపినీడు. అతని అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. తన భార్య విజయ పేరుని ముందు చేర్చుకుని విజయబాపినీడు అయ్యాడు. డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేశాడు. చిన్నప్పటి నుంచీ సాహిత్యం అంటే మక్కువ. ఆ ఇష్టంతో కొన్ని రచనలు చేశాడు. ఆ అభిరుచే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎక్కువగా డిటెక్టివ్‌ నవలలు రాసేవాడు. నవలలకు పెట్టే పేర్లు చిత్ర విచిత్రంగా ఉండేవి. ఆ తరవాత ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ పత్రికల్ని స్థాపించాడు.[1]

మూలాలు

మార్చు
  1. "భార్యపేరు చేర్చి 'విజయ' బాపినీడు అయ్యారు ". సితార. Retrieved 2020-08-25.[permanent dead link]