బొమ్మా బొరుసే జీవితం

బొమ్మా బొరుసే జీవితం
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని
తారాగణం చంద్రమోహన్ ,
మాధవి
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ శ్రీసీతారామ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • చంద్రమోహన్
  • మాధవి
  • సత్యనారాయణ
  • అల్లు రామలింగయ్య
  • మాస్టర్ రాజు
  • నిర్మలమ్మ
  • నగేష్
  • జయమాలిని

సాంకేతిక నిపుణులు

మార్చు
  • దర్శకత్వం : కొమ్మినేని శేషగిరిరావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • మాటలు: జంధ్యాల
  • పాటలు: వేటూరి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • నిర్మాత: యు.ఎస్.ఆర్.మోహనరావు

తాతల ఆస్తిని అనుభవిస్తున్న గణపతిరావు తన 12 ఏండ్ల పుత్రరత్నం రాజాకు పేదవారంటే ఆటబొమ్మలని, వారి మీద దయాదాక్షిణ్యాలు చూపడం మంచిది కాదని నూరిపోస్తాడు. పెట్రోలు బంకులో ఉద్యోగం ఊడిపోయిన పన్ను అనే అమ్మాయి, డిగ్రీ చేతబట్టుకుని ఉద్యోగం కోసం బజారులో పడిన హరికృష్ణ అనే అబ్బాయి కలుసుకుంటారు. ఘరానా దొంగతనాలు చేస్తూ పట్టుబడతారు. జైలు నుండి తిరిగివచ్చిన హరి గణపతి బొమ్మల దుకాణంలో ఉద్యోగం సంపాదిస్తాడు. బొమ్మల కోసం వచ్చిన రాజా హరిని చూసి ముచ్చటపడి అతడిని పెట్టెలో పెట్టి ప్యాక్ చేయించి ఇంటికి తీసుకువెళతాడు. కరాటే వీరుడితో హరిని చితక్కొట్టిస్తాడు. కోపంతో తిట్టిన హరికి హనుమంతుడి వేషం వేయించి వీధుల్లో త్రిప్పుతాడు. ఈతకొలనులో త్రోయిస్తాడు. హరి రాజాను నానామాటలు అని పారిపోతాడు. కానీ రాజా ఆ తరువాత హరి కోసం మారాము చేస్తాడు. గణపతి వెళ్లి హరిని అతని స్నేహితురాలు పన్నూను తీసుకువస్తాడు. హరి, పన్ను కలిసి రాజా మెదడుకు పదును పెడతారు[1].

పాటలు

మార్చు
  1. అందాల సృష్టికి మూలం ఆనాటి ఏడమ్ ఆనందం సృష్టిస్తోంది - పి.సుశీల - రచన: వీటూరి
  2. అమ్మ అనేది అచ్చ తెలుగుమాటరా జన్మ జన్మకదే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వేటూరి
  3. లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం గప్ చుప్ గప్ చుప్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సాయిబాబా - రచన: వేటూరి
  4. వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వీటూరి

మూలాలు

మార్చు
  1. వి.ఆర్. (31 July 1979). "చిత్రసమీక్ష బొమ్మా బొరుసే జీవితం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66 సంచిక 120. Retrieved 29 December 2017.[permanent dead link]

బయటి లింకులు

మార్చు