ప్రధాన మెనూను తెరువు

కొమ్మినేని శేషగిరిరావు (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు.

కొమ్మినేని శేషగిరిరావు
Kommineni seshagirirao.jpg
జననంకొమ్మినేని శేషగిరిరావు
1939
మరణం2008, డిసెంబర్ 5
నివాస ప్రాంతంతెనాలి సమీపంలోని పొన్నెకల్లు
ప్రసిద్ధితెలుగు సినిమా దర్శకుడు, నటుడు.

ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పొన్నెకల్లు. ఈయన అనేక సినిమాల్లో నటించాడు. మొదట్లో విలన్‌గా నటించినా, గొప్పవారి గోత్రాలు (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం, తాతామనవడు, సంసారం సాగరం, చిరంజీవి రాంబాబు వంటి యాభైకి పైగా సినిమాలలో నటించాడు.

దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం గిరిబాబు హీరోగా నటించిన దేవతలారా దీవించండి. ఆ చిత్ర విజయం తరువాత సింహగర్జన సినిమాకు, ఆ తరువాత తాయారమ్మ బంగారయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో శివాజీ గణేశన్‌తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. ఈయన కన్నడంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

కొమ్మినేని 2008, డిసెంబరు 5న చెన్నైలో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.

చిత్ర సమాహరంసవరించు

ఇతడు పనిచేసిన చిత్రాల పాక్షిక జాబితా:

నటుడిగాసవరించు