బొరాన్ ట్రైఆక్సైడ్

రసాయన సమ్మేళనం

బోరాన్ ట్రైఆక్సైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్ధం.దీనిని డైబోరాన్ ట్రైఆక్సైడ్ అనికూడా అంటారు.బోరాన్ యొక్క ఆక్సైడ్ సంయోగపదార్థాలలో ఇది యొకటి.బోరాన్, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఈసంయోగ పదార్థం రూపుదిద్దుకున్నది.

బొరాన్ ట్రైఆక్సైడ్
Crystal structure of B2O3
పేర్లు
ఇతర పేర్లు
boron oxide, diboron trioxide, boron sesquioxide, boric oxide, boria
Boric acid anhydride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1303-86-2]
పబ్ కెమ్ 518682
యూరోపియన్ కమిషన్ సంఖ్య 215-125-8
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30163
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య ED7900000
SMILES O=BOB=O
ధర్మములు
B2O3
మోలార్ ద్రవ్యరాశి 69.6182 g/mol
స్వరూపం white, glassy solid
సాంద్రత 2.460 g/cm3, liquid;

2.55 g/cm3, trigonal;
3.11–3.146 g/cm3, monoclinic

ద్రవీభవన స్థానం 450 °C (842 °F; 723 K) (trigonal)
510 °C (tetrahedral)
బాష్పీభవన స్థానం 1,860 °C (3,380 °F; 2,130 K) ,[1] sublimates at 1500 °C
1.1 g/100mL (10 °C)
3.3 g/100mL (20 °C)
15.7 100 g/100mL (100 °C)
ద్రావణీయత partially soluble in methanol
ఆమ్లత్వం (pKa) ~ 4
అయస్కాంత ససెప్టిబిలిటి -39.0·10−6 cm3/mol
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-1254 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
80.8 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 66.9 J/mol K
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Irritant Xi[2]
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
3163 mg/kg (oral, mouse)[3]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 15 mg/m3[2]
REL (Recommended)
TWA 10 mg/m3[2]
IDLH (Immediate danger)
2000 mg/m3[2]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఉత్పత్తి

మార్చు

కరిగించు కొలిమిలో బోరాక్సు, సల్ఫ్యూరిక్ ఆమ్లం మధ్య రసాయనచర్య వలన బోరాన్ ట్రైఆక్సైడ్ ఏర్పడును.750°C వద్ద కరిగిన ,ద్రవస్థితి బోరాన్ ఆక్సైడ్ సోడియం సల్ఫేట్ నుండి వేరు పడును.దీనిని తేర్చి(decanted),చల్లార్చిన 96–97% శుద్ధత కల్గిన బోరాన్ ట్రైఆక్సైడ్ ఉత్పత్తి అగును.

మరొక పద్ధతిలో బోరిక్ ఆమ్లాన్ని ~300 °C లో వేడిచెయ్యడం. మొదట బొరిక్ ఆమ్లం 170 °C వద్ద నీటి ఆవిరి, మెటా బొరిక్ ఆమ్లం(HBO2)గా ఏర్పడును.దీనిని 300 °C వద్ద,లేదా మించి వేడిచెయ్యడం వలన అధిక నీటి ఆవిరిమరియు బోరాన్ ట్రైఆక్సైడ్ ఏర్పడును.

H3BO3 → HBO2 + H2O
2 HBO2 → B2O3 + H2O

డైబోరెన్(B2H6) గాలిలోని ఆక్సిజన్‌తో లేదా లేదా గాలిలోని తేమతో రసాయనచర్య జరుపుట వలన కూడా బోరాన్ ట్రైఆక్సైడ్ ఉత్పత్తి చెయ్యవచ్చును.

2B2H6(g) + 3O2(g) → 2B2O3(s) + 6H2(g)
B2H6(g) + 3H2O(g) → B2O3(s) + 6H2(g)

భౌతిక లక్షణాలు

మార్చు

ఇది తెల్లని గాజువంటి/ తళతళలాడే ఘన పదార్ధం.ఇది ఎక్కువ అనిర్దిష్ట స్ఫటికముగా ఏర్పడని రూపంలో(amorphous)లో లభించును.ఎక్కువసేపు అధికంగా annealing (వేడిచేసి కావలసిన ఆకారం లోకి మార్చి చల్లబరచడం)చెయ్యడం వలన స్పాటికాకృతి వున్న సంయోగ పదార్థ ఏర్పడును.

కొద్దిగా ఘాటైన రుచి కల్గి ఉన్నది.[4]

అణుభారం

మార్చు

బొరాన్ ట్రైఆక్సైడ్ యొక్కఅణుభారం 69.620 గ్రాములు /మోల్[5]

సాంద్రత

మార్చు

బొరాన్ ట్రైఆక్సైడ్ సాంద్రత 2.460 గ్రాములు/సెం,మీ3(ద్రవస్థితిలో)[6],త్రిభుజసౌష్టవ అణునిర్మాణ మున్న సంయోగ పదార్ధం సాంద్రత 2.55గ్రాములు/సెం.మీ3,అలాగే మొనోక్లినిక్ అణునిర్మాణ పదార్థ సాంద్రత 3.11–3.146 గ్రాములు/సెం,మీ3 మధ్య వుండును.

ద్రవీభవన ఉష్ణోగ్రత

మార్చు

త్రికోణాకృతి సౌష్టవమున్న సంయోగ పదార్ధం ద్రవీభవన స్థానం 450°C (842°F;723 K)[4] కాగా చర్భుజాక్రుతి సౌష్టమున్న పదార్ధం ద్రవీభవన స్థానం 510 °C.

మరుగు ఉష్ణోగ్రత

మార్చు

బోరాన్ ట్రైక్లోరైడ్ యొక్క బాష్పీభవన స్థానం/ మరుగు ఉష్ణోగ్రత 1,860°C (3,380 °F; 2,130 K).ఇది1500 °C[3]ఉష్ణోగ్రత వద్ద ఈ సంయోగ పదార్ధం ఉత్పతనం(sublimate)చెందును.[4]

ద్రావణీయత

మార్చు

నీటిలో కరుగుతుంది.మెథానాల్ లో పాక్షికంగా కరుగును. 10°C ఉష్ణోగ్రత వున్న100మీ.లీ నీటిలో1.1 గ్రాములు, 20°C ఉష్ణోగ్రతవున్న 100మీ.లీ నీటిలో3.3గ్రాములు, 100 C ఉష్ణోగ్రత వున్న 100మీ.లీ నీటిలో 15.71 గ్రాముల సంయోగ పదార్ధం కరుగును.

వినియోగం[7]

మార్చు
 • గ్లాసు, ఎనామిల్లు లలో ఫ్లక్సింగు ఏజెంటు(Fluxing agent )గా ఉపయోగిస్తారు.
 • బోరాన్ కార్బైడ్ వంటి బోరాన్ సమ్మేళనాలను తయారు చేయుటకు ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తారు.
 • గ్లాసు ఫైబరులలో(ఆప్టికల్ ఫైబర్సు)లలో అదనపు చేర్పుడు పదార్థంగా ఉపయోగిస్తారు.
 • బోరో సిలికేట్ గ్లాసు ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.
 • సేంద్రియ సంశ్లేషణలో ఆమ్ల ఉత్ర్పేరకంగా ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
 1. High temperature corrosion and materials chemistry: proceedings of the Per Kofstad Memorial Symposium. Proceedings of the Electrochemical Society. The Electrochemical Society. 2000. p. 496. ISBN 1-56677-261-3.
 2. 2.0 2.1 2.2 2.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0060". National Institute for Occupational Safety and Health (NIOSH).
 3. "Boron oxide". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
 4. 4.0 4.1 4.2 "Boric Oxide". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2017-05-03.
 5. "Boron trioxide". chemspider.com. Retrieved 2017-05-03.
 6. "Boric anhydride". sigmaaldrich.com. Retrieved 2017-05-03.
 7. "Boron Oxide". reade.com. Retrieved 2017-05-03.