బొర్రావారిపాలెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
బొర్రావారిపాలెం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బొర్రావారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°01′N 80°48′E / 15.01°N 80.8°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్ |
పిన్ కోడ్ | 522 268 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కేసన బేబీ సరోజిని, ఎం.ఏ., సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కేసన సోమయ్య ఎన్నికైనారు.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
మార్చుశ్రీ కోదండరామస్వామివారి ఆలయం
మార్చునూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-20వ తేదీ శనివారం నుండి 22వ తేదీ సోమవారం (మాఘశుద్ధ పౌర్ణమి) వరకు నిర్వహించెదరు. శనివారంనాడు మహాగణపతిపూజ, గోపూజ, అంకురార్పణ పూజలు నిర్వహించారు.
ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2017, ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు.
ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్తు, గుంటూరు జిల్లాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో, 2017, మార్చి-22వతేదీ బుధవారం నుండి 24వతేదీ శుక్రవారం వరకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు.
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
మార్చుగ్రామములో నూతనంగా ఈ అమ్మవారి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. వచ్చే వేసవిలో పూర్తి చేసి అమ్మవారి వార్షిక కొలుపులు నిర్వహించడానికి నిర్ణయించారు.
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017, మే-7వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు.
శ్రీ షిర్డీ సాయి మందిరం
మార్చుగ్రామ ప్రముఖులు
మార్చుశ్రీ కేసన శంకరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షులు.
శ్రీ బొర్రా గోవర్ధన్:- వీరు సైన్స్ రచయితగా ప్రసిద్ధులు. 30 కి పైగా సైన్స్ పుస్తకాలు వ్రాసినారు.