బొల్లి

వేటిలిగో

బొల్లి లేదా బొల్లి మచ్చలు (Vitiligo) ఒక రకమైన చర్మ వ్యాధి.

  • బొల్లి అనేది తన స్వంత కణజాలము మీద ప్రతి ఘాతము చేసే వ్యాధి.
  • బొల్లి చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని వస్తుంది.
  • బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
బొల్లి
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
m:en:OMIM {{{m:en:OMIM}}}
DiseasesDB 13965
m:en:MedlinePlus 000831
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}
ల్యూకోడెర్మా వలన ఏర్పడిన తెల్ల మచ్చలు
విటిలిగో వలన ఏర్పడిన తెల్ల మచ్చలు

తెల్ల మచ్చలు (Depigmentation) మానవులలో ల్యూకోడెర్మా లేదా విటిలిగో వ్యాధుల వలన ఏర్పడతాయి.ఆయుర్వేద పరిభాషలో శ్విత్రం అని పిలిచే ఈ తెల్ల మచ్చల వ్యాధిని ఆధునిక వైద్యులు ల్యూకోడర్మాగానూ విటిలిగో గానూ పిలుస్తారు. ఇది శరీర అంత ర్భాగాల్లో ఏమాత్రం దుష్ప్రభావం చూపకుండా కేవలం చర్మం మీదే వ్యాపించే వ్యాధి. ఇది మెలినోసైడ్స్‌లో ఏర్పడిన కొన్నిలోపాల వల్ల ఏర్పడే సమస్య. మెలినోసైడ్స్ దెబ్బ తినడం వల్ల చర్మానికి ప్రాణమైన మెలినిన్ తయారు కాదు. దాని ఫలితమే తెల్ల మచ్చలు లేదా ల్యూకోడెర్మా/ విటిలిగో సమస్య.

కొన్ని ఇతర సమస్యలు కూడా బొల్లి లాగే కనిపిస్తాయి. ఉదాహరణకి పిల్లలలో ఎదుగుతున్న దశలో ఏర్పడే తెల్ల మచ్చలు, వాటిని పిటీరియాసిస్ అల్బా అంటారు. వీటి పరిమాణం పెరగదు. ఒక్కొక్కసారి జన్యు పరంగా వచ్చే అల్బునిజం అనే వ్యాధి కూడా బొల్లి లాగానే కనిపిస్తుంది. దీనిలో శరీరమంతా తెల్లగా అవుతుంది. జుట్టు, కను రెప్పలు, కనుగుడ్డు కూడా తెల్లగా ఉంటాయి. [1]

వ్యాధి ప్రారంభము

మార్చు

తెల్ల మచ్చల వ్యాధిని విటిలిగో ల్యూకోడర్మా, అని రెండు వేరు వేరు పేర్లతో పిలవడంలో వేరు వేరు కారణాలు కనిపిస్తాయి. విటిలిగో అన్నది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ల్యూకోడర్మా మాత్రం కొన్ని అరుదైన ప్రదేశాల్లో మాత్రమే అంటే పెదాలు, జననాంగాలు, అరిచేతులు, అరిపాదాలు ఇలా చర్మం బాగా పలుచగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే వస్తుంది. వాత, పిత్త, క ఫ దోషాల పాత్రలే ఈ వ్యాధికి మూలం. సాధారణంగా శరీరంలో కొన్ని అరుదైన ప్రదేశాల్లో మాత్రమే ఉండే ఈ మచ్చలు ఒక్కోపారి శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదమైతే ఉంది. చాలా మందికి ఎక్కువ కాలమే పట్టినా కొందరిలో కేవలం ఏడాది కాలంలోనే ఈ వ్యాధి శరీరంలోని అన్ని భాగాలకూ పాకవచ్చు.

వ్యాధి వ్యాప్తి కారణాలు

మార్చు

తెల్లమచ్చల వ్యాధి చర్మానికే పరిమితమైన వ్యాధే అయినా చర్మంలోనే మూడు విభాగాలు ఉంటాయి. అవి ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. ఎపిడెర్మిస్‌ను పరిశీలిస్తే, వాటిలో కెరటోసైట్స్, మెలనో సైట్స్, లాంగర్‌హాండ్స్ అనే వివిధ కణజాలం ఉంటుంది. మెలనోసైట్స్ అనేవి సహజంగా మెలినిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే కొందరిలో ఈ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీనికి కారణాలు అనేకం. చర్మానికి అవసరమైన వర్ణాన్ని, వెలుగునూ ఇచ్చేది పిత్తం ప్రత్యేకించి భ్రాజక పిత్తం ఈ పాత్రను నిర్వహిస్తుంది. భ్రాజకం అంటేనే ప్రకాశం. చర్మానికి అది అందించే అంశం కూడా అదే. ఎప్పుడైతే భ్రాజక పిత్తంలోనే లోపం ఏర్పడుతుందో అది తెల్లమచ్చల వ్యాధి మొదలవుతుంది. శ్విత్రం వ్యాధిలో వచ్చే మచ్చలు అందరిలోనూ తెలుపు రంగులోనే ఉంటాయని కూడా కాదు. కొందరిలో ఇవి ఎరుపు రంగులోనూ ఉండవచ్చు. శరీరంలో సహజంగా ఉండే టైరోసిన్ అనే ఒక ఎంజైము ఇది మెలినోసైట్స్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. టైరోసిన్‌లో లోపాలు ఏర్పడి ఎప్పుడైతే మెలనోసైట్స్ వృద్ధి పూర్తిగా ఆగిపోతుందో అప్పుడే తెల్ల మచ్చలు వస్తాయి. లోపం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎర్రటి మచ్చలు, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తెల్ల మచ్చలు ఏర్పడతాయి.[2]

వ్యాధి నిర్ధారణ

మార్చు

మచ్చల తీరు బట్టిచలవరకు వ్యాధి గుర్తిస్తారు. ఇటీవల డెర్మోస్కోప్ అనే పరికరం తో మచ్చలు స్పష్టంగా కనపడుతాయి. ఇంకా అతినీల లోహిత కిరణాలు వెలువరించే వుడ్స్ లాంప్ తో ఈ మాచాలని పరిశీలిస్తారు. వ్యాధి నిర్ధారణ సంక్లిష్టంగా ఉన్నప్పుడు చర్మం ముక్కను కత్తిరించి కణజాల పరీక్షకు (బయాప్సీ) పంపుతారు. మేలనో సైట్స్ ఉనికిని బట్టి గుర్తిస్తారు.[1]

బొల్లి చికిత్సలు

మార్చు

బొల్లికి శాశ్వత నివారణ లేదు, బొల్లి వ్యాప్తి ఆపడానికి మాత్రమే చికిత్స. బొల్లి చికిత్స ప్రారంభ దశలోనే ప్రారంభమైతే బాగా పనిచేస్తుంది (ప్రారంభించిన 2 లేదా 3 నెలల ముందు). తెల్లని మచ్చలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటే, మనం చాలా వేగంగా చికిత్స చేయవచ్చు, అప్పుడు ఇతర బొల్లి కేసులు. చర్మ భాగాలలో ఎక్కువ వెంట్రుకలు ఉంటే, తక్కువ జుట్టుతో ఉన్న చర్మ భాగాలతో పోల్చినప్పుడు బొల్లి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే జుట్టులోని వర్ణద్రవ్యం చర్మం పైభాగానికి వలసపోయి చర్మాన్ని తిరిగి పుంజుకుంటుంది. ముఖం, ఛాతీ, ఆయుధాలు, కాళ్ళు చాలా త్వరగా కోలుకునే చర్మం యొక్క ఉత్తమ భాగాలు., చేతులు, మణికట్టు, పాదాలు, పండ్లు చికిత్స తర్వాత కోలుకునే అవకాశాలు తక్కువ.

చికిత్సల రకాలు

మార్చు
  • నాన్-కల్చర్డ్ ఎపిడెర్మల్ సెల్యులార్ డ్రాఫ్టింగ్
  • స్టెరాయిడ్ క్రీమ్స్
  • యువి థెరపీ
  • ఎక్సైమర్ లేజర్
  • డిపిగ్మెంటేషన్
  • మైక్రో టాటూ
  • సొరలిన్స్ మలాము (అయింట్మెంట్) కొద్ది మచ్చలున్న వారికి పనిచేస్తోంది. సమస్య ఎక్కువ ఉంటే సొరలిన్ మాత్రలు వాడతారు. గంట తరువాత ఎండ తగలనీయాలి. ఎండ మెలనిన్ ను ప్రేరేపిస్తుంది. [1]
  • జాక్ఇన్హిబిటర్స్ - వర్ణ విచ్ఛిన్నం కాకుండా చూస్తాయి.
  • మినీ పల్స్ థెరపీ లో స్టెరాయిడ్ మాత్రలు ఇస్తారు. మెలనో సైట్స్ మీద దాడిచేసే యాంటిబాడీస్ ను నిలువరిస్తాయి
  • సైక్లో స్పోరిన్ వంటి రోగనిరోధక శక్తిని అణిచే మాత్రలు చివరగా ఫలితాలు మెరుగు పరుస్తాయి.
  • ఏ, డి, ఇ విటమిన్లు మేలు చేస్తాయి.
  • శస్త్ర చికిత్సలు కూడా అనివార్యమవుతాయి. ఒక సంవత్సరం మచ్చలు పెరగకపోతే శస్త్ర చికిత్సలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి - చర్మం మార్పిడి, డిపిగ్మైంటేషన్, నాన్ కల్చర్డ్ మెలనొసైట్ ట్రాన్స్ఫర్. వంటివి.

బొల్లి గలవారికి ఆత్మ విశ్వాసాన్ని కలిగించడం. తగ్గుతుందని భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం [1]

బొల్లి నివారణ

మార్చు
  • ఆకుకూరలు, అరటిపండు, ఆపిల్ వంటి పండ్లు కలిగి ఉండటం వల్ల బొల్లిని నివారించవచ్చు
  • తెల్ల మచ్చలు ఏర్పడకుండా ఉండటానికి ఆల్కహాల్, కాఫీ, చేపలు, ఎర్ర మాంసం వంటివి తినకూడదు
  • విటమిన్ బి, సి, అమైనో ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ తెల్లటి పాచెస్ నివారించవచ్చు.
  • మీ ఆహారంలో రాగి, జింక్, ఇనుము వంటి ఖనిజాలను చేర్చడం కూడా సహాయపడుతుంది.
  • గాయాలు, కాలిన గాయాలు, వడదెబ్బల వల్ల చర్మం ప్రభావితమైనప్పుడు చర్మ వర్ణద్రవ్యం కణాలు నాశనం అవుతాయి. అది బొల్లికి కారణమవుతుంది. లోతైన చర్మం అడవులను, కాలిన గాయాలను నివారించడం బొల్లిని నివారిస్తుంది.[3]

వాస్తవాలు

మార్చు
  • బొల్లి తాకడం వలన మరొకరికి అంటుకోదు. వైవాహిక జీవితానికి ఇబ్బందిలేదు.
  • తల్లి తండ్రుల కు బొల్లి ఉన్నా పిల్లలకు వచ్చే అవకాశము లేదు
  • ఆహారంతో బొల్లి వ్యాధికి సంబంధం లేదు, కానీ సోరలిన్ వంటి మందులు వాడితే పులుపు పదార్థాలు మందులు పనిచేయనీయవు కాబట్టి నిషిద్ధం
  • బొల్లి కి కుష్టు వ్యాధికి తేడా ఉంది. బొల్లి వ్యాధి కుష్టు కాదు. కుష్టు వ్యాధి మైక్రో బాక్టీరియమ్ లేప్రా అనే సూక్ష్మ క్రిముల వలన వస్తుంది. కుష్టు లో స్పర్శ ఉండదు, వెంట్రుకలు రాలుతాయి. చెమట ఉండదు. చర్మం పొడిగా ఉంటుంది. బొల్లిలో ఈ లక్షణాలు ఉండవు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 నరసింహా రావు,జి. (డా.) తెల్ల మచ్చ కు బెదరద్దు! ఈనాడు.25 June 2024
  2. https://www.youtube.com/watch?v=XEENH4dx7e0
  3. https://www.medicoverhospitals.in/te/vitiligo/#symptoms-of-vitiligo[permanent dead link]

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బొల్లి&oldid=4246906" నుండి వెలికితీశారు