బోనీ కపూర్
బోనీ కపూర్ (జననం 22 ఏప్రిల్ 1955) ప్రముఖ భారతీయ నిర్మాత. బాలీవుడ్ లో ఆయన నిర్మాణంలో చాలా సినిమాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు ఆయన. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ ల పెద్ద అన్నగారు బోనీ. ఈయన కుమారుడు అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ హీరో.
తొలినాళ్ళ జీవితం, వ్యక్తిగత జీవితం
మార్చు22 ఏప్రిల్ 1955న ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురిందర్ కపూర్ పెద్ద కుమారుడు. బోనీ తమ్ముళ్ళు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, కుమారుడు అర్జున్ బాలీవుడ్ లో నటులు. పాకిస్థానీ పంజాబ్ లోని పేష్వార్ వీరి కుటుంబం అసలు ఊరు. వీరి తండ్రి సురిందర్ కుటుంబం భారత విభజన సమయంలో అక్కడి నుంచి భారతదేశం వలస వచ్చారు.
బోనీ కపూర్ ముందు మోనా శౌరీ కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అర్జున్, అన్షులా. 2012లో ఇషాక్ జాదే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి, మంచి విజయం సాధించారు. బర్నార్డ్ కళాశాలలో డిగ్రీ చదివి, ప్రస్తుతం అన్షులా గూగుల్ లో పనిచేస్తున్నారు. మోనాకు విడాకులిచ్చి, బోనీ 1996 జూన్ 2న ప్రముఖ నటి శ్రీదేవి ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జాహ్నవి, ఖుషి.[1][2]
నిర్మాతగా కెరీర్
మార్చుకెరీర్ మొదట్లో కపూర్ ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సమంత వద్ద సహాయకునిగా పనిచేశారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా, బోనీ నిర్మాణంలో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా ఆయన కెరీర్ లో ప్రఖ్యాతమైన సినిమాగా నిలిచింది. 1987లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరానికి రెండో అతిపెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని కొన్ని పాటలు చాలా ప్రఖ్యాతం అయ్యాయి. ఈ సినిమాలో అమ్రీష్ పురి డైలాగులు చాలా ప్రసిద్ధం[3] ఈ సినిమాలో పురి పాత్రను బాలీవుడ్ లో ఉత్తమ విలన్లలో ఒకటిగా భావిస్తారు.
సినిమాలు
మార్చుసంవత్సరం | చిత్రం |
---|---|
1980 | హమ్ పాంచ్ |
1983 | వో 7 దిన్ |
1987 | మిస్టర్.ఇండియా |
1992 | రాత్ |
1992 | అంతం |
1992 | ద్రోహి |
1993 | రూప్ కీ రాణీ చోర్ం కా రాజా |
1995 | ప్రేమ్ |
1996 | లోఫర్ |
1997 | జుదాయీ |
1999 | సిర్ఫ్ తుమ్ |
2000 | పుకార్ |
2000 | హమారా దిల్ ఆప్కే పాస్ హై |
2002 | కోయీ మేరే దిల్ సే పూచే |
2002 | కంపెనీ |
2002 | శక్తి |
2003 | ఖుషి |
2004 | రన్ |
2004 | క్యూ..!హో గయా నా |
2005 | బేవాఫా |
2005 | నో ఎంట్రీ |
2009 | వాంటెడ్ |
2010 | మిలేంగే మిలేంగే |
2012 | ఇట్స్ మై లైఫ్ |
2015 | తేవర్ |
2015 | నో ఎంట్రీ మే నో ఎంట్రీ |
2016 | మిస్టర్.ఇండియా 2 |
పురస్కారాలు
మార్చుసంవత్సరం | పురస్కారం | చిత్రం |
---|---|---|
1988 | స్టార్ & స్టైల్ ఉత్తమ చిత్రం పురస్కారం | మిస్టర్.ఇండియా |
2000 | నర్గిస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ | పుకార్ |
2009 | కైరో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్-జీవిత సాఫల్య పురస్కారం | సినిమా రంగంలోని కృషికి |
2013 | ప్రొడ్యూసర్ ఆఫ్ ది మిలీనియం హానర్ - టి.ఎస్.ఆర్.-టివి9 ఫిలిం అవార్డులు | సినిమా రంగంలోని కృషికి |
References
మార్చు- ↑ "Articles". Sridevi: The Last Empress of Bollywood. Archived from the original on 2015-08-16. Retrieved 2015-09-19.
- ↑ "rediff.com, Movies: Showbuzz! Boney, Sridevi's daughter called Khushi". www.rediff.com. Retrieved 2015-09-19.
- ↑ "Top 20 Villains of Bollywood". Archived from the original on 2017-06-18. Retrieved 2016-07-24.