అర్జున్ కపూర్

భారతదేశ నటుడు

అర్జున్ కపూర్ (జననం 26 జూన్ 1985)  ప్రముఖ బాలీవుడ్ నటుడు. నిర్మాత బోనీ కపూర్, మోనా షౌరేల కుమారుడు ఆయన. కల్ హో నా హో (2003) , వాంటెడ్ (2009) వంటి సినిమాలకు సహాయ దర్శకుడు, సహాయ నిర్మాతగా పనిచేసిన తరువాత హబిబ్ ఫైసల్ దర్శకత్వంలో ఇషాక్ జాదే (2012) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అర్జున్. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డుకు నామినేషన్ కూడా లభిందింది.

అర్జున్ కపూర్
జననం (1985-06-26) 1985 జూన్ 26 (వయసు 39)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
తల్లిదండ్రులుమోనా శౌరీ కపూర్
బోనీ కపూర్

ఆ తరువాత  గుండే (2014) ,  2 స్టేట్స్ (2014) , కి & కా (2016) వంటి సినిమాల్లో ఆయన నటించారు. ఈ మూడు సినిమాలూ ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ పైన వసూళ్ళు సాధించాయి. నటునిగానే కాక అర్జున్ 16వ ఐఫ్ అవార్డులకు, టెలివిజన్ రియాలిటీ షో ఫియర్ ఫాక్టర్:ఖత్రోకీ ఖిలాడిలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వ్యక్తిగత జీవితం, కెరీర్

మార్చు

తొలినాళ్ళ జీవితం, మొదటి సినిమా

మార్చు

26 జూన్ 1985న మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించారు  అర్జున్. తండ్రి బోనీ కపూర్ ప్రముఖ నిర్మాత, తల్లి మోనా శౌరీ కపూర్ వ్యాపారవేత్త.[1][2] నిర్మాత సురిందర్ కపూర్ మనుమడు అర్జున్. నటులు అనిల్ కపూర్సంజయ్ కపూర్, నిర్మాత సందీప్ మర్వా లకు అర్జున్ అన్న కొడుకు. నటి సోనం కపూర్, నటులు మోహిత్ మార్వాహర్షవర్ధన్ కపూర్  లకు కజిన్. అర్జున్ చెల్లెలు అన్షులా గూగుల్ ఉద్యోగిని.[3] 

నటి శ్రీదేవి ఆయనకు సవతి తల్లి. జాహ్నవి, ఖుషి అర్జున్ చెల్లెళ్ళు. ఒక ఇంటర్వ్యూలో తండ్రి రెండో వివాహం గురించి అడిగినప్పుడు "అప్పుడు మేము  చాలా చిన్నపిల్లలం. కొంచెం కష్టంగానే ఉండేది. కానీ ఏం చేయగలం? ఎన్ని రోజులని ఫిర్యాదులు చేస్తూ ఉండగలం? జరిగినదాన్ని అంగీకరించి ముందుకు పోవాలి." అని వివరించారు.

ముంబైలోని ఆర్య విద్యా మందిర్ లో 12 తరగతి వరకు చదువుకున్నారు అర్జున్. 12వ తరగతి ఫెయిల్ కావడంతో చదువును అక్కడితో ఆపేశారు.[1] టీనేజ్ లో 140 కేజీలతో అధిక బరువుతో బాధపడేవారు కపూర్.[4]  సినిమాల్లో రావడానికి ముందు చాలా కేజీలు తగ్గారు ఆయన. సినీ రంగంలో మొదట కల్ హో నా హో సినిమాకు సహాయ దర్శకునిగా అడుగుపెట్టారు.[5] సలామ్-ఇ-ఇష్క్:ఎ ట్రిబ్యూట్ టు లవ్ (2007) సినిమాకు సహాయ దర్శకునిగా వ్యవహరించారు. ఆ తరువాత తన తండ్రి నిర్మాణ సంస్థలో నో ఎంట్రి (2005) , వాంటెడ్ (2009) సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు అర్జున్. ఆ సమయంలోనే యష్ రాజ్ ఫిలింస్ కు 3 సినిమాలు సైన్ చేశారు.[6]

2012లో హబీబ్ ఫైసల్ దర్శకత్వంలో పరిణీతి చోప్రా తో కలసి ఇషాక్  జాదీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అర్జున్.[7] ఆ తరువాత ఔరంగ్ జేబ్ (2013) సినిమాలో నటించారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు. 

సినిమాలు

మార్చు

నటునిగా

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్
2012 ఇషాక్ జాదే పర్మా చౌహాన్
2013 ఔరంగజేబ్ అజయ్/విశాల్
2014 గుండే బాల భట్టాచార్య
2014 2 స్టేట్స్ క్రిష్ మల్హోత్రా
2014 ఫైండింగ్ ఫానీ సావియో డిగామా ఆంగ్ల భాషా చిత్రం
2015 తెవర్ ఘనశ్యామ్ "పింటూ" శుక్ల
2016 కి & కా కబీర్ బన్సాల్
2017 హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మాధవ్ ఝా 2017[8]
2022 ఏక్ విలన్: రిటర్న్స్
2023 కుత్తే

ఇతర టెక్నీషియన్ గా...

మార్చు
సంవత్సరం సినిమా రోల్
2003 కల్ హో నా హో సహాయ దర్శకుడు
2005 నో ఎంట్రి సహాయ నిర్మాత
2007 సలీమ్-ఇ-ఇష్క్:ఎ ట్రిబ్యూట్ టూ లవ్ సహాయ దర్శకుడు
2009 వాంటెడ్ సహాయ నిర్మాత

టెలివిజన్

మార్చు
సంవత్సరం టైటిల్ రోల్ నోట్స్
2015 16వ ఐఫా అవార్డులు వ్యాఖ్యాత టివి స్పెషల్
2016 ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ వ్యాఖ్యాత గేమ్ షో

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం చిత్రం పురస్కారం క్యాటగిరి ఫలితం
2012 ఇషాక్ జాదే దైనిక్ భాస్కర్ బాలీవుడ్ అవార్డ్స్ ఫ్రెష్ ఎంట్రీ ఆఫ్ ది ఇయర్ నామినేషన్[9]
పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ ఇండియా ఫేవరెట్ డెబ్యూ యాక్టర్ నామినేషన్[10]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ డెబ్యూ – మేల్ గెలిచారు[11]
2013 ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్[12]
ఇటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ మోస్ట్ ప్రావిటబుల్ డెబ్యూ నామినేషన్[13]
స్క్రీన్ అవార్డులు స్క్రీన్ అవార్డ్ ఫర్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ – మేల్ నామినేషన్[14]
జీ సినీ అవార్డులు జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డెబ్యూ గెలిచారు[15]
స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో-మేల్ గెలిచారు[16]
అప్సరా ఫిలిం & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు అప్సరా అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్[17]
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డులు బెస్ట్ డెబ్యూ-మేల్ నామినేషన్[18]
అంతర్జాతీయ భారత ఫిలిం అకాడమీ అవార్డులు (ఐఫా అవార్డులు) బెస్ట్ డెబ్యూ-మేల్ నామినేషన్
2014 2 స్టేట్స్ స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ నామినేషన్[19]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ – మేల్ నామినేషన్[20]
గుండే స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ నామినేషన్[19]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ – మేల్ గెలిచారు[21]
2015 2 స్టేట్స్ స్టార్ గిల్డ్ అవార్డులు స్టార్ గిల్డ్ ఉత్తమ నటుడు పురస్కారం నామినేషన్[22]
స్క్రీన్ అవార్డులు స్క్రీన్ అవార్డ్ ఉత్తమ నటుడు నామినేషన్[23]
ఐఫా అవార్డులు ఐఫా అవార్డ్ ఉత్తమ నటుడు పురస్కారం నామినేషన్[24]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Gupta, Priya (9 April 2014). "Last call my mother made was to Salman bhai: Arjun Kapoor". The Times of India. Retrieved 11 April 2014.
  2. "Arjun Kapoor turns 28". 26 June 2013.
  3. "In pics: The Boney-Anil-Sanjay Kapoor Family Tree". CNN. 7 February 2012. Archived from the original on 17 ఫిబ్రవరి 2015. Retrieved 15 June 2014.
  4. "Arjun Kapoor reveals his fat pictures for the first time ever!". India Today. 13 May 2013. Retrieved 15 June 2014.
  5. "Five things you should know about Arjun Kapoor". India Today. 8 May 2014. Retrieved 15 June 2014.
  6. "I am fortunate to work with Habib Faisal for Ishaqzaade: Arjun Kapoor – Entertainment". Daily News and Analysis. 11 May 2012. Retrieved 28 August 2012.
  7. "Rowdy Rathore Bumper Opening in Single Screens Good at Multiplexes". Box Office India. 26 May 2012. Archived from the original on 5 నవంబరు 2013. Retrieved 1 February 2013.
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; half girlfriend అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. "Newcomers Nominations: Fresh Entry of the Year". Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 26 January 2012.
  10. Kumar, Ravi. "People's Choice Awards 2012 Nominees". Archived from the original on 30 నవంబరు 2012. Retrieved 27 January 2012.
  11. "3rd Annual BIG Star Entertainment Awards Nominations". Archived from the original on 2018-09-15. Retrieved 2016-07-24.
  12. "Filmfare Awards 2013 Winners" Archived 2013-02-20 at the Wayback Machine. Retrieved 26 January 2013
  13. "ETC Bollywood Business Awards 2012 / 2013 – Nominations". Archived from the original on 6 జనవరి 2013. Retrieved 26 January 2012.
  14. "Nominations for 19th Annual Colors Screen Awards". Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 22 January 2012.
  15. "Zee Cine Awards 2013: Team 'Barfi!', Vidya Balan, Salman Khan bag big honours" Archived 2014-10-23 at the Wayback Machine. Retrieved 26 January 2013
  16. "Stardust Awards 2013 Winners". Archived from the original on 28 జనవరి 2013. Retrieved 27 January 2012.
  17. Trivedi, Dhiren. "8th Star Guild Apsara Awards Nominations: Shahrukh Khan or Ranbir Kapoor, Vidya Balan or Priyanka Chopra – who will win?".
  18. "TOIFA Awards 2013 Nominations". Archived from the original on 2013-05-31. Retrieved 2016-07-24.
  19. 19.0 19.1 "Nominations for Stardust Awards 2014". Bollywood Hungama. 8 December 2014. Retrieved 8 December 2014.
  20. "Big Star Entertainment Awards Nominations List 2014". Reliance Broadcast Network. Archived from the original on 21 డిసెంబరు 2014. Retrieved 24 December 2014.
  21. "Bollywood's youth brigade rock the Big Star Entertainment Awards". Daily Mail. 19 December 2014. Retrieved 31 December 2014.
  22. "Nominations for 10th Renault Star Guild Awards". Bollywood Hungama. 8 January 2015. Retrieved 8 January 2015.
  23. "Crowd Favourites". The Indian Express. 3 January 2015. Retrieved 5 January 2015.
  24. "'2 States', 'Haider' lead IIFA 2015 nominations, Aamir and SRK pitted for best actor". Daily News and Analysis. 14 April 2015. Retrieved 15 April 2015.