పంజాబీ హిందువులు

పంజాబీ హిందువులు అన్నది హిందూ మతం అనుసరిస్తూ, భారత ఉపఖండంలోని పంజాబీ ప్రాంతంలో తమ మూలాలు కానీ, నేపథ్యం కానీ ఉన్న జనసమూహం. భారతదేశంలో పంజాబీ హిందువులు ప్రధానంగా పంజాబ్, హర్యానా, జమ్ము, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నారు. పంజాబీ హిందువులు అమెరికా, కెనడా, యుకె, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దుబాయ్ వంటి ప్రాంతాలకు నిరంతరంగా వలసలు కొనసాగుతూ వచ్చాయి.

పంజాబీ హిందువులు
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
భాషలు
పంజాబీ, హిందీ, ఆంగ్లం
మతం
Om.svg హిందూ మతం
సంబంధిత జాతి సమూహాలు
పంజాబీ ప్రజలు, ఉత్తర భారత ప్రజలు

పంజాబ్ ప్రాంతంలో చారిత్రికంగా ఎప్పటినుంచో హిందూ మతం ప్రాచుర్యంలో ఉంది. హిందూ మతం పంజాబ్ లో విలసిల్లిన కాలానికి ఆ ప్రాంతానికి ఇస్లాం ఆగమనం కానీ, ఆ మట్టిపై సిక్ఖు మతం జననం కానీ జరగలేదు. సిక్ఖు మతపు తొలి గురువు గురు నానక్ సహా బందా సింగ్ బహదూర్, భాయ్ మతీ దాస్ వంటి ప్రముఖ సిక్ఖు నాయకులు, గురువులు అందరూ పంజాబ్ ప్రాంతానికి చెందిన హిందూ కుటుంబాలకు చెందినవారే. పలువురు పంజాబీ హిందువులు అనంతర కాలంలో సిక్ఖుమతంలో చేరారు. నిజానికి పంజాబీ హిందువులు తమ మూలాలను వేదకాలం నుంచి అన్వేషించవచ్చు.

ఆధునిక భారత పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ మహానగరాలకు అత్యంత ప్రాచీనమైన హిందూ మత సంబంధ నామాలు ఉన్నాయి. అలాంటివే లాహోర్, జలంధర్, చండీగఢ్, మొదలైన నగరాల పేర్లు. భారత ప్రధానులు ఐ.కె.గుజ్రాల్, గుల్జారీ లాల్ నందా, భారత జట్టు పూర్వ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రముఖ శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా తదితరులు పంజాబీ హిందువులే.

సుప్రసిద్ధులైన పంజాబీ హిందువులుసవరించు

రాతియుగంనాటి పంజాబ్ హిందూరాజ్యాలుసవరించు

 
రాతి యుగంలోని వేదభూమి నాటి పంజాబ్ పటం.సామ్రాజ్యాలను నలుపు రంగులో, నదులను నీలం రంగులో,థార్ ఏడారి కాషాయ రంగులో, పరాయి దేశ జాతులను పచ్చ రంగులో చూపటమైనది.

పంజాబి హిందూవులు అనగా ఏవరైతే పంజాబ్లో ఆవిర్భవించి హిందూ మత ధర్మాన్ని పాటిస్తున్నారో వారు.పంజాబి హిందూవులు భారతదేశంలోని ఛండిగర్,హర్యానా,జమ్ము, డిల్లీ ప్రాంతాలలో అధికంగా నివసిస్తున్నారు, కోంతమంది ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,కెనడా, అమెరికా లాంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్లారు.

నిజమైన పంజాబ్ భూభాగాన్ని మెుత్తం 7 భాగాలుగా విడదియబడ్డాయి. అవి

 1. పశ్చిమ పంజాబ్ (నేటి పాకిస్థాన్)లోని గందార ప్రాంతం.
 2. పంజాబ్
 3. హర్యానా
 4. చండీగర్
 5. హిమాచల్ ప్రదేశ్
 6. ఆజాద్ కాశ్మిర్
 7. జమ్ము

రుగ్వేదంలో పంజాబ్ ను సప్తసిందూ (7 నదుల భూభాగం) గా వర్ణించబడింది.

 1. సరస్వతి నది (గాగ్రా),
 2. శతాద్రు నది (సుత్లెజ్),
 3. విపాసా నది (బియాస్),
 4. చంద్రబగా నది (చినాబ్),
 5. ఐరావతి నది (రావి),
 6. విటాస్త నది (జిలమ్),
 7. సిందూ నది.[3]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు