విజయనగరరాజులకు సామంతరాజులుగా బోయరాజులు (బోయ పాలెగర్లు) ఉండేవారు. శ్రీ కృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యం గజెటర్ ప్రకారం రాయదుర్గం, చిత్రదుర్గం, కళ్యాణదుర్గం ఈ మూడు ముఖ్యమైన కోటలతో పాటు మరికొన్ని ప్రాంతలను బోయలు పాలించారు.  వీటిని ఒకప్పుడు బోయ పాలెగర్ పాలించాడు. కళ్యాణదుర్గం అనే పేరు 16 వ శతాబ్దంలో పాలేగర్ బోయ కల్యాణప్ప నుండి వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. వీరు ఆంధ్రదేశంలో కోటలకు అధిపతులై విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా చేశారు. బోయలు విజయనగరసామ్రాజ్యంలో సైన్యాధక్షులుగా పనిచేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. 10 - 18 శతాబ్దాల మధ్య కర్నాటకలో చిత్రదుర్గ కోట నిర్మాణంలో రాష్ట్రకుటులు, హోయసాలు, చాళుక్యులతోపాటూ బోయ పాలెగార్లు కూడా పాలుపంచుకొన్నారు.

విజయనగర రాజులకు సమంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచి, ఆ తరువాత స్వతంత్రులుగా ఒక్కొక్కరు రెండు శతాబ్దాల వరకు పరిపాలించారు.

  1893 డిసెంబరులో బ్రిటిష్ పాలకులు అప్పటి మద్రాసు ప్రెసెడెన్సీలోని ధర్మవరం, రాయదుర్గ్ (బళ్లారి) తాలూకాల నుండి చీల్చి కల్యాణదుర్గ్ తాలూకాను ఏర్పాటు చేశారు. 2012 మార్చిలో కళ్యాణదుర్గం పురపాలక సంఘంగా ఏర్పడింది.