రాయదుర్గం

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండల పట్టణం

రాయదుర్గం, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలానికి చెందిన పురపాలకసంఘ హోదా కలిగి పట్టణం.రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుండి 7 కి.మీ. దూరంలో ఉంది. కర్ణాటక లోని బళ్ళారికి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు (కర్ణాటక) అనబడే పట్టణం, ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి.

రాయదుర్గం
రాయదుర్గం పట్టణం లోని దేవాలయం
రాయదుర్గం పట్టణం లోని దేవాలయం
రాయదుర్గం is located in Andhra Pradesh
రాయదుర్గం
రాయదుర్గం
భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ పటంలో రాయదుర్గం స్థానం
Coordinates: 14°42′00″N 76°52′00″E / 14.7000°N 76.8667°E / 14.7000; 76.8667
దేశంభారతదేశం
రాష్టంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం
Government
 • Typeస్థానిక స్వపరిపాలన పట్టణ సంస్థ
 • Bodyరాయదుర్గం పురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total49.73 కి.మీ2 (19.20 చ. మై)
Elevation
543 మీ (1,781 అ.)
జనాభా
 (2011)[2]
 • Total61,749
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
భాషలు
 •  అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
515 865
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91 8495

ఇది విజయనగర రాజుల 3వ రాజధాని. ఇక్కడ 15వ శతాబ్ద వైభవం ఈ పట్టణంలో కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి.

రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడి జనాభాలో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు, కన్నడ రెండు భాషలూ మాట్లడగలరు.

ప్రముఖులు

మార్చు
 
జానమద్ది హనుమచ్ఛాస్త్రి :తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత

తహసీల్దారు కార్యాలయం

మార్చు

రాయదుర్గం తహసీల్దార్‌ కార్యాలయానికి 150 ఏళ్లు నిండాయి. ఇది ప్రభుత్వ శాఖల్లో ముఖ్యమైంది. తహసీల్దార్‌ భవనం నిర్మించి 150 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ భవనం పదిలంగా ఉండటం హర్షనీయం. 1859వ సంవత్సరంలో అప్పటి బళ్లారి జిల్లా కలెక్టర్‌ అరర్‌ హథావే ఎద్దులబండ్లను అద్దెకు తీసుకొని సైన్యానికి అవసరమైన వస్తువుల రవాణా కోసం వాటిని వినియోగించుకొనేవారు. అనంతరం రాయదుర్గం ఎద్దుల బండ్లు టెండర్ల ద్వారా తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో 1865లో కరువు ఏర్పడటంతో పాటు, కలరా లాంటి వ్యాధులతో వందలమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో 1265 ఫసలీకి సంబంధించిన భూమి శిస్తును రద్దు చేశారు. అనంతరం రాయదుర్గంలో రెవెన్యూ వ్యవహారాల కోసం తహసీల్దార్‌గా వెంకట్రావును నియమించారు. అప్పటి ఆంగ్లేయులులో రాయదుర్గం నుంచి పాలనా పరమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయాన్ని నిర్మించతలపెట్టారు. దీంతో 1865 లో భవనాన్ని నిర్మించారు. భవన నిర్మానానికి కావాల్సిన పెంకులను కర్ణాటకలోని మంగళూరు నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పెంకులపై ఉన్న 1865 సంవత్సరాన్ని చూడవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యకలపాలను కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 1910లో కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాను కూడా కలిపి పాలన సాగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాయదుర్గం తహసీల్దార్‌ కార్యాలయ భవనం నేడు నిర్మించబడుతున్న భవనాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  3. పరిణతవాణి. Vol. 6 (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 132.

వెలులి లంకెలు

మార్చు