కళ్యాణదుర్గం

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండల పట్టణం

కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలానికి చెందిన పట్టణం, మండల, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనుకు కేంద్రం. ఇది పురపాలకసంఘం హోదా కలిగి ఉంది.[1] ఇది అనంతపురం లోకసభ నియోజకవర్గంలోని, కళ్యాణ దుర్గం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

కళ్యాణ దుర్గం
—  పట్టణం  —
కళ్యాణదుర్గం కొండలు
కళ్యాణదుర్గం కొండలు
కళ్యాణ దుర్గం is located in Andhra Pradesh
కళ్యాణ దుర్గం
కళ్యాణ దుర్గం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళ్యాణదుర్గం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E / 14.5500; 77.1000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం కళ్యాణదుర్గం
వైశాల్యము
 - మొత్తం 34.92 km² (13.5 sq mi)
ఎత్తు 656 m (2,152 ft)
జనాభా (2011)
 - మొత్తం 32,328
 - పురుషుల సంఖ్య 16,036
 - స్త్రీల సంఖ్య 16,292
 - గృహాల సంఖ్య 7,220
పిన్ కోడ్ 515761
ఎస్.టి.డి కోడ్ 08497

చరిత్రసవరించు

శ్రీ కృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉంది. రాజలు పరిపాలించిన కాలంనాటి గజెటర్ ప్రకారం రాయదుర్గ్, చిత్రదుర్గ, కళ్యాణదుర్గ్ ఈ మూడు ముఖ్యమైన కోటలుగా ఉండేవని తెలుస్తుంది. వీటిని ఒకప్పుడు బోయ పాలెగర్ పాలించాడు. కల్యాణదుర్గ అనే పేరు 16 వ శతాబ్దంలో పాలేగర్ బోయ కల్యాణప్ప నుండి వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1893 డిసెంబరులో బ్రిటిష్ పాలకులు అప్పటి మద్రాసు ప్రెసెడెన్సీలోని ధర్మవరం, రాయదుర్గ్ (బళ్లారి) తాలూకాల నుండి చీల్చి కల్యాణదుర్గ్ తాలూకాను ఏర్పాటు చేశారు. 2012 మార్చిలో కళ్యాణదుర్గం పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికంసవరించు

జిల్లా కేంద్రమైన అనంతపూరు కు పశ్చిమంగా 60 కి.మీ. దూరంలో వుంది.

జనగణన గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో మొత్తం జనాభా 32,328 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,036 కాగా, మహిళలు 16,292 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1016 మంది మహిళలుగా ఉంది. పట్టణంలో పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలు 3,404 మంది ఉన్నారు.ఇది కళ్యాణదుర్గం పట్టణ జనాభాలో 10.53% గా ఉంది. పట్టణంలో లింగ నిష్పత్తి 1016. ఇది రాష్ట్ర సగటు 993 కంటే మెరుగు. పురుషుల అక్షరాస్యత 80.93% కాగా, మహిళా అక్షరాస్యత 67.51% గా ఉంది.[2]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ పరిధిలో మొత్తం 7,220 గృహాలున్నాయి.[2]

పరిపాలనసవరించు

కళ్యాణదుర్గం పురపాలకసంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

పర్యాటక ఆకర్షణలుసవరించు

  • అక్కమాంబ ఆలయం: గ్రామ దేవత. ఈ ఆలయంలో సప్తమాతలకు ప్రతీకగా శ్రీ అక్కమాంబాదేవి సజీవ జీవకళ ఉట్టిపడే రీతిలో భాసిల్లుతోంది.
  • శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం: పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం 16 వ శతాబ్దంలో నిర్మించబడింది.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-26.
  2. 2.0 2.1 "Kalyandurg Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-26.

వెలుపలి లంకెలుసవరించు