బోరిస్ బెకర్ (జ. 1967 నవంబరు 22) జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు. 17 సంవత్సరాల వయసులోనే 6 మేజర్ టైటిళ్ళు సాధించాడు. అతను సాధించిన టైటిల్స్ లో వింబుల్డన్ ఛాంపియన్‌షిప్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్లు, ఒక యూఎస్ ఓపెన్ ఉన్నాయి. 1989 లో ATP, ITF లు అతన్ను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించాయి.

తొలినాళ్ళలోనే అతను అందుకున్న విజయాలు, కీర్తి వల్ల అతని జీవితం కొంత ఒడిదుడుకులకు లోనయింది. అతను ఆటకు విరామం ప్రకటించాక చాలా కార్యకలాపాల్లో పాలు పంచుకున్నాడు. మరో ప్రముఖ ఆటగాడైన నోవాక్ జోకోవిచ్ కి మూడేళ్ళ పాటు శిక్షణ ఇచ్చాడు. ప్రొఫెషనల్ పోకర్ ఆటలో పాల్గొనడమే కాక ఒక ఆన్‌లైన్ పోకర్ కంపెనీలో కూడా పనిచేశాడు.[1] 2017 లో అతను దివాలా తీసిన కేసులో కొన్ని ఆస్తులు దాచిపెట్టాడని 2022 ఏప్రిల్ లో అతని రెండున్నరేళ్ళ కారాగార శిక్ష పడింది.

జీవితం

మార్చు

బోరిస్ జర్మనీ లోని లీమెన్ అనే ప్రాంతంలో ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు.[2][3] వృత్తి రీత్యా ఆర్కిటెక్టు అయిన అతని తండ్రి కార్ల్ హీంజ్, లీమెన్ లో ఒక టెన్నిస్ సెంటర్ ని స్థాపించాడు. బోరిస్ అక్కడే టెన్నిస్ లో ఓనమాలు దిద్దుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. "Former tennis star Boris Becker battles against bankruptcy". Retrieved 23 August 2018.
  2. Mills, Eleanor (5 December 1999). "Becker not quite ready to retire". New Straits Times. Retrieved 14 June 2009.[permanent dead link]
  3. Green, Nick (6 November 2005). "Boris Becker: 'When I heard they wanted to send me to prison, I thought only of my children. I went home and prayed to God'". The Observer. London. Retrieved 14 June 2009.