బ్రజేశ్ మిశ్రా
బ్రజేశ్ మిశ్రా (సెప్టెంబర్ 29, 1928 - సెప్టెంబర్ 28, 2012) ఈయన భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[1]
తొలినాళ్ళ జీవితం
మార్చుఈయన 1928 సెప్టెంబర్ 29 న జన్మించాడు. ఈయన తండ్రి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ద్వారక ప్రసాద్ మిశ్రా.[2] ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా, ఇందిరా గాంధీకి సన్నిహితుడు.[3]
దౌత్య వృత్తి
మార్చుఈయన 1951 లో భారత విదేశాంగ సేవలో చేరారు. 1962 చైనా - ఇండియన్ యుద్ధం తరువాత బీజింగ్‌లో ఛార్జ్ డి అఫైర్ గా, ఇండోనేషియాలో భారత రాయబారిగా, జెనీవాలో రాయబారి, భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. ఈయన చివరి పోస్టింగ్ 1979 జూన్ నుండి 1981 ఏప్రిల్ వరకు ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. ఈయన శాశ్వత ప్రతినిధిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యొక్క ఆరవ అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పై సోవియట్ దండయాత్రపై భారతదేశం తరపున స్వరం వినిపించాడు.[4]
మరిన్ని విశేషాలు
మార్చుఈయన 1991 ఏప్రిల్ లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఈయన ఆనాటి భారత ప్రధానమంత్రికి 9వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో, 1998 మార్చిలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు. ఈయన 1998 నవంబరు నుండి 2004 మే 23 వరకు మొదట జాతీయ భద్రతా సలహాదారుగా, జాతీయ భద్రతా నిర్వహణ కోసం సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈయన పోఖ్రాన్ -2 నుండి కాశ్మీర్ వరకు వాజ్‌పేయి పాకిస్థాన్ పర్యటన నుండి అమెరికాను వ్యూహాత్మక సంభాషణలో నిమగ్నం చేయడం వరకు అన్నింటిలోనూ భారత విదేశాంగ విధానం, భద్రతా విన్యాసాల వెనుక ఉన్నాడు.
పురస్కారాలు
మార్చుఈయనకు 2011 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
మరణం
మార్చుఈయన 2012 సెప్టెంబర్ 28 న న్యూ ఢిల్లీ లోని వసంత్ కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో మరణించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "The Name Is Mishra, Brajesh Mishra". www.outlookindia.com. 4 September 2000. Retrieved 21 December 2019.
- ↑ "Former Foreign Minister Natwar Singh pays tribute to Brajesh Mishra". India Today. 30 September 2012. Retrieved 21 December 2019.
- ↑ "Devil's Advocate: Brajesh Mishra on Atal vs Advani – Politics News – IBNLive". Ibnlive.in.com. 3 February 2010. Archived from the original on 13 నవంబరు 2014. Retrieved 21 December 2019.
- ↑ Srinivasan, T P. "Brajesh Mishra: Steely determination and a kind heart". Retrieved 21 December 2019.
- ↑ "India's first National Security Advisor Brajesh Mishra passes away". The Hindu. Archived from the original on 9 డిసెంబరు 2012. Retrieved 21 December 2019.