బ్రహ్మర్షి హుస్సేన్ షా

హుస్సేన్ షా (సెప్టెంబరు 9, 1905 – సెప్టెబరు 24, 1981) పిఠాపురం లోని శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠానికి ఏడవ పీఠాధిపతి. ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని పిఠాపురం లో జన్మించాడు. ఆయన తండ్రి కవిశేఖర డా. ఉమర్ అలీషా సద్గురు తరువాత పీఠాధిపతి. ఆయన పిఠాపురంలో ప్రాథమిక విద్యను అభ్యసించి మచిలీపట్నం లోని నేషనల్ కాలేజీలో ఫైనల్ ఆర్ట్స్ పూర్తిచేసాడు. ఆయన తెలుగు, అరబిక్, ఉర్ధూ, పర్షియన్, సంస్కృత భాషలలో పండితుడు.[1]

బ్రహ్మర్షి హుస్సేస్ షా
జననం(1905-09-09)1905 సెప్టెంబరు 9
మరణం1981 సెప్టెంబరు 24
సమాధి స్థలంశ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క పూర్వ ఆశ్రమం
17°6′25″N 82°15′16″E / 17.10694°N 82.25444°E / 17.10694; 82.25444
జాతీయతభారతీయుడు
విద్యప్రాథమిక విద్య, పిఠాపురం, ఎఫ్.ఎ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు కవిత్వం
బిరుదుబ్రహ్మర్షి
అంతకు ముందు వారుకవిశేఖర డా. ఉమర్ అలీషా
తరువాతివారుమొహిద్దీన్ బాద్‌షా II
జీవిత భాగస్వామిఅజీమునిసా బేగం
తల్లిదండ్రులుకవిశేఖర డా. ఉమర్ అలీషా, అక్బర్ బీబీ
వెబ్‌సైటుwww.sriviswaviznanspiritual.org

షా, ఆయన భార్య అజీమున్నీసా బేగం లకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆయన పీఠాధిపతి కావడానికి పూర్వం వ్యవసాయం చేసేవాడు. జ్ఞానాన్ని సముపార్జించిన తరువాత ఆయన మూలికా ఔషథం "దేవదారు" ను కనుగొన్నాడు.

హుస్సేన్ షా ఫిబ్రవరి 10, 1945 నుండి పీఠం యొక్క తత్వాన్ని ప్రచారం ప్రారంభించాడు. ఆయన అనేక ఆధ్యాత్మిక సందేశాలను అనేక గ్రామలలోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోని పట్టణాలలోనూ ప్రచారంచేసి భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని అందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో మరణించాడు.

ఆయన ప్రముఖ తాత్వికుడు. ఆయన తత్వాన్ని "షా తత్వం" గా అభివర్ణిస్తారు.

గ్రంథములు

మార్చు
  • షా తత్వం [2]
  • షా తత్వం మొదటి భాగం (షా తత్వానికి ఆంగ్ల అనువాదం)

మూలాలు

మార్చు
  1. పోధనుడు.. హుస్సేన్‌షా 09-09-2014[permanent dead link]
  2. "Sha Philosophy". Archived from the original on 2014-09-20. Retrieved 2016-11-17.