బ్లాక్ ప్యాంథర్

2018 లో విడుదల అయిన ఇంగ్లీష్ చిత్రం

బ్లాక్ పాంథర్ 2018లో విడుదల అయిన ఇంగ్లీష్ చిత్రం. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్ పై కెవిన్ ఫీగే[1] నిర్మించిన ఈ చిత్రానికి ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించాడు[2]. ఈ చిత్రంలో చాడ్విక్ బోస్‌మన్,[3] మైఖేల్ బి. జోర్డాన్, లుపిటా న్యోంగో, డానై గురిరా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 16, 2018యుఎస్ఎ లో విడుదల అయింది.

బ్లాక్ ప్యాంథర్
దర్శకత్వంర్యాన్ కూగ్లర్
రచన
  • ర్యాన్ కూగ్లర్
  • జో రాబర్ట్ కోల్
దీనిపై ఆధారితంబ్లాక్ పాంథర్ (కామిక్స్)
నిర్మాతకెవిన్ ఫీగే
తారాగణం
  • చాడ్విక్ బోస్మాన్
  • మైఖేల్ బి. జోర్డాన్
  • లుపిటా న్యోంగో
  • డానై గురిరా
  • మార్టిన్ ఫ్రీమాన్
  • డేనియల్ కలుయుయా
  • లెటిషియా రైట్
  • విన్‌స్టన్ డ్యూక్
  • ఏంజెలా బాసెట్
  • ఫారెస్ట్ విటేకర్
  • ఆండీ సెర్కిస్
ఛాయాగ్రహణంరాచెల్ మారిసన్
కూర్పు
  • మైఖేల్ పి. షావర్
  • డెబ్బీ బెర్మన్
సంగీతంలుడ్విగ్ గోరాన్సన్
నిర్మాణ
సంస్థ
మార్వెల్ స్టూడియోస్
పంపిణీదార్లువాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్
మోషన్ పిక్చర్స్
విడుదల తేదీs
2018 జనవరి 29 (2018-01-29)(డాల్బీ థియేటర్)
ఫిబ్రవరి 16, 2018 (యుఎస్ )
సినిమా నిడివి
134 నిముషాలు
దేశంయుఎస్
భాషఇంగ్లీష్
బడ్జెట్$200 మిలియన్
బాక్సాఫీసు$1.348 బిలియన్

కథ మార్చు

కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఐదు ఆఫ్రికన్ తెగలు వైబ్రేనియం కలిగిన ఉల్కపై పోరాడుతారు. వారిలో ఒక అతను లోహ-ప్రభావితమైన "గుండె ఆకారపు మూలిక"ని తిని, మానవాతీత సామర్థ్యాలను పొంది, మొదటి "బ్లాక్ పాంథర్" అవుతాడు[4]. జబారి తెగ తప్ప, మిగతా తెగలందరూ ఏకమై, అతన్ని కొత్తగా సృష్టించిన వకాండా దేశానికి రాజుగా ఎన్నుకుంటారు. వకాండా ప్రజలు వైబ్రేనియం ఉపయోగించి అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేస్తారు, ప్రపంచం నుండి తమను తాము వేరుచేసుకొని మూడవ ప్రపంచంలో బ్రతుకుతారు. 1992లో, వకాండా రాజు టి'చాకా కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో ఉన్న అతని సోదరుడు అయిన ఎన్'జోబును కలుస్తాడు. ఎన్'జోబు వకాండా నుండి వైబ్రేనియం దొంగిలించి, ఆయుధ వ్యాపారి అయిన యులిసెస్ క్లాకు సహాయం చేసాడని ఎన్'జోబును చంపేస్తారు. వకాండాలో టి'చాకా మరణం తరువాత, అతని కుమారుడు టి'చల్లా వకాండకి నాయకుడు అవుతాడు. ఎన్’జోబు కుమారుడు పెద్దపెరిగి వకాండకి వస్తాడు. అతను వచ్చిన తరువాత పరిస్థితులు ఎలా మారతాయి, టి’చల్లా తన సింహాసనాన్ని, రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

  • చాడ్విక్ బోస్‌మన్ (టి'చల్లా)
  • లుపిటా న్యోంగో (నకియా)
  • డానై గురిరా (ఓకోయ్‌)
  • మార్టిన్ ఫ్రీమాన్ (ఎవరెట్ కె.రాస్‌)
  • డేనియల్ కలుయుయా (డబ్ల్యు'కబీ)
  • లెటిటియా రైట్ (షురి)
  • విన్‌స్టన్ డ్యూక్ (ఎంబాకు)
  • ఫారెస్ట్ విటేకర్ (జూరి)
  • ఆండీ సెర్కిస్ (యులిసెస్ క్లావ్‌)

మూలాలు మార్చు

  1. Lussier, Germain (2015-04-12). "Kevin Feige Phase 3 Updates: 'Thor: Ragnarok,' 'Black Panther,' 'Inhumans' And 'Captain Marvel'". SlashFilm.com. Retrieved 2022-04-08.
  2. Ford, Borys Kit,Rebecca; Kit, Borys; Ford, Rebecca (2015-12-04). "'Creed' Director Ryan Coogler in Talks to Direct Marvel's 'Black Panther'". The Hollywood Reporter. Retrieved 2022-04-08.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  3. "Black Panther: The 'weird signs' that led Chadwick Boseman to Wakanda". BBC News. 2020-09-04. Retrieved 2022-04-08.
  4. Topel, Fred (2016-08-10). "Exclusive: 'Black Panther' Screenwriter On Wakanda's Rise Within The Marvel Universe [TCA 2016]". SlashFilm.com. Retrieved 2022-04-08.