భానుమతి, అద్దంకి శ్రీరామమూర్తి ముఖ్య పాత్రలు పోషించిన 'భక్తిమాల' చిత్రాన్ని భాస్కర్‌ పతాకాన హరిబాయి దేశాయ్‌ దర్శకత్వంలో మద్రాసులో నిర్మించారు. వెంపటి పెద సత్యనారాయణ ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. భక్తిమాల చిత్రంలో మీరాబాయి లాంటి కథానాయిక పాత్ర భానుమతిది. "పాడిన పాటలకు చిత్రంతో పేరొచ్చింది గాని, డ్యాన్సులకు ఏమాత్రం పేరు రాలేదు. పత్రికల్లో నృత్య భంగిమతో నా ఫొటోవేస్తూ 'కీళ్ల నొప్పుల భంగిమల తార భానుమతి' అని కూడా రాశారు అని భానుమతి పేర్కొన్నారు. బి.ఆర్‌.పంతులు, ముదిగొండ లింగమూర్తి ఈ ప్రొడక్షన్‌ నిర్వహించారు.[1] ఎం.ఎ.రహ్మాన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించాడు.

భక్తిమాల
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం హరిబాయి దేశాయ్‌
నిర్మాణం బి.ఆర్‌.పంతులు,
ముదిగొండ లింగమూర్తి
తారాగణం భానుమతి,
అద్దంకి శ్రీరామమూర్తి
సంగీతం కొప్పరపు సుబ్బారావు
నేపథ్య గానం భానుమతి
నిర్మాణ సంస్థ ‌భాస్కర్ పిక్చర్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భక్తిమాల&oldid=3704186" నుండి వెలికితీశారు