భరత్ భాయ్ సుతారియా
భరత్ భాయ్ మనుభాయ్ సుతారియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రేలి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
భరతభాయ్ మనుభాయ్ సుతారియా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | నారన్‌భాయ్ కచాడియా | ||
---|---|---|---|
నియోజకవర్గం | అమ్రేలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 సెప్టెంబరు 17 జారఖియా, అమ్రేలి , గుజరాత్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | మనుభాయ్, సవితాబెన్ | ||
జీవిత భాగస్వామి | భానుబెన్ | ||
సంతానం | 1 |
జననం
మార్చుభరత్ సుతారియా 1971 సెప్టెంబరు 17న అమ్రేలి జిల్లాలోని లాథిలోని జార్కియా గ్రామంలో మనుభాయ్, సవితాబెన్ దంపతులకు జన్మించాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుభరత్ సుతారియా 1990లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 నుండి 2011 వరకు లాఠీ తాలూకా బీజేపీ జనరల్ సెక్రెటరీగా, లాఠీ 2010 నుంచి 2015 వరకు తాలూకా పంచాయతీ బీజేపీ అధ్యక్షుడిగా, 2019 నుంచి బాబ్రా మున్సిపాలిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఆ తరువాత 15 సెప్టెంబర్ 2023 నుండి 06 జూన్ 2024 వరకు అమ్రేలి జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రేలి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జెన్నీ తుమ్మర్ పై 321068 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Amreli". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ TV9 Gujarati (25 March 2024). "અમરેલીથી ભાજપે તદ્દન નવા ચહેરા પર ઉતારી પસંદગી, જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુતરીયાને આપી ટિકિટ". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TimelineDaily (23 May 2024). "Bharatbhai Manubhai Sutariya, BJP's New Face In Amreli Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.