భలే మాష్టారు ఎస్.డి.లాల్ దర్శకత్వంలో 1969లో సి.ఎస్.రాజు నిర్మించిన తెలుగు చిత్రం. షమ్మీ కపూర్, కల్పన నటించి 1962లో విడుదలైన హిందీ చిత్రం ‘ప్రొఫెసర్’ ఆధారంగా దీన్ని రూపొందించారు.

భలే మాష్టారు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంచన.
అంజలీదేవి
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ విజయగిరిధ్వజ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు
  • మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • కళ: తోట
  • కూర్పు: బి.గోపాలరావు
  • సంగీతం: టి.వి.రాజు
  • నృత్యం: తంగప్ప, పసుమర్తి కృష్ణమూర్తి, చిన్ని, సంపత్
  • ఫొటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్
  • స్టంట్స్: సాంబశివరావు
  • నిర్మాత: సి.ఎస్.రాజు
  • దర్శకత్వం: ఎస్.డి.లాల్

నటీనటులు

మార్చు
  • నందమూరి తారకరామారావు - మధుసూధనరావు
  • శాంతకుమారి
  • అంజలీదేవి - జమీందారిణి సీతాదేవి
  • కాంచన - విజయ
  • శీల రవిచంద్రన్ - విమల
  • రాజబాబు - బుచ్చిబాబు
  • కృష్ణంరాజు - గిరి
  • అల్లు రామలింగయ్య - జోగులు
  • రమాప్రభ - కాసులు
  • మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి- డాక్టరు
  • విజయశ్రీ - నర్తకి

మధుసూధనరావు (యన్‌టి రామారావు) డిగ్రీ చదివిన నిరుద్యోగి. కాలేజి క్రీడలు, నాటకాల్లో పతకాలు సాధిస్తాడు. అతని తల్లి (శాంతకుమారి)కి టీబీ వ్యాధి ముదరటంతో శానిటోరియంలో చేర్చటానికి డబ్బు కావాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రకటనలో 50ఏళ్ల వయసున్న ట్యూటర్ కావాలన్న షరతు చూసి, వేషం మార్చుకొని జమీందారిణి సీతాదేవి (అంజలిదేవి) ఎస్టేటుకు వెళ్తాడు. అక్కడ ఆమె తమ్ముని పిల్లలు విజయ (కాంచన), విమల (షీలా), బుచ్చిబాబు (రాజ్‌బాబు), మరో ఇద్దరు చిన్నవారికి ట్యూటర్‌గా కుదురుకుంటాడు. తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించటంతో.. అవివాహిత, ఎస్టేటు యజమానురాలిగావున్న మేనత్తవద్దకు చేరిన పిల్లలు, ట్యూషన్ మాస్టారులను ఏదోక వంకతో పంపించేస్తుంటారు. కాని మధు తెలివిగా వారిని దారిలో పెడతాడు. ఆక్రమంలో విజయతో, మాస్టారి మేనల్లుడిగా మధు పేరిట పరిచయం పెంచుకుంటాడు. అదే సమయంలో సీతాదేవి మాస్టారును అభిమానిస్తుంటుంది. షీలా, గిరి (కృష్ణంరాజు) అనే వంచకుడివల్ల మోసపోవటం, నౌకరు జోగులు (అల్లు రామలింగయ్య) చెల్లెలు కాసులు (రమాప్రభ)ను బుచ్చిబాబు ఇష్టపడడం, చివరకు ఈ సంగతులన్నీ విజయ, మధుల ద్వారా సీతాదేవికి తెలుస్తాయి. మధు, గిరికి బుద్ధిచెప్పి తీసుకొచ్చి షీలాను రక్షించటంతో మధు నిజాయితీ రుజువై కథ సుఖాంతమవుతుంది. మూడు జంటలను సీతాదేవి, శాంతకుమారి ఆశీర్వదించటంతో చిత్రం ముగుస్తుంది[1]..

పాటలు

మార్చు
  • రింగ్ మాస్టార్/ వయసులో ఏముంది - గానం: ఘంటసాల, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం; రచన: కొసరాజు
  • ఏదారి గోదారి - రచన: కొసరాజు, గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి.
  • ఒన్ టూ త్రీ టిస్ట్ డాన్స్‌లే - రచన: దాశరథి, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం
  • నాలోన ఏమాయే ఏమాయనే - గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పి.సుశీల, రచన: సినారె.
  • బుగ్గల్లో గులాబిరంగు నాదే నాదే - గానం: ఘంటసాల, రచన: దాశరథి
  • నీవునేనై నేను నీవే - గానం: పి సుశీల, ఘంటసాల, రచన: ఆరుద్ర
  • ఉండనీ ఉండనీ నీతోనే..గానం:పి సుశీల రచన:సినారె

విశేషాలు

మార్చు
  • ఈ చిత్రం తమిళభాషలో 1990లో నాడేగన్’ పేరుతో రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై సత్యరాజ్, కుష్బూ, మనోరమ, గౌండముని, ప్రతాప్‌చంద్రన్, రాము నటించగా ఎం రామనాథన్ నిర్మాతగా విడుదలయ్యింది.
  • 1991లో శ్రీ అన్నపూర్ణా సినీ చిత్ర బ్యానర్‌పై సుమన్, నగ్మా, వాణిశ్రీ కాంబినేషన్‌తో శరత్ దర్శకత్వంలో పెద్దింటి అల్లుడుగా పునర్మించబడింది.
  • ఇదే చిత్రం 1992లో కన్నడంలో ‘గోపీకృష్ణ’ పేరుతో వి.రవిచంద్రన్ దర్శకత్వంలో వి.రవిచంద్రన్,రూపిణి, సుమిత్ర, లోకేష్ నటులుగా విడుదలయ్యింది.

మూలాలు

మార్చు
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (16 March 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 మార్చి 2019. Retrieved 12 April 2019.