భమిడిపాటి రాధాకృష్ణ
నాటక, సినీ రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు.
భమిడిపాటి రాధాకృష్ణ (నవంబరు 24, 1929 - సెప్టెంబరు 4, 2007) నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత,
భమిడిపాటి రాధాకృష్ణ | |
---|---|
భమిడిపాటి రాధాకృష్ణ | |
జననం | నవంబరు 24, 1929 రాజమండ్రి |
మరణం | సెప్టెంబరు 4, 2007 [1] రాజమండ్రి |
మరణ కారణం | ఆస్తమా, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధులు |
ప్రసిద్ధి | నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు |
భార్య / భర్త | సుశీల |
పిల్లలు | ఒక కుమార్తె, ఐదుగురు కుమారులు |
తండ్రి | భమిడిపాటి కామేశ్వరరావు |
జీవిత విశేషాలు సవరించు
"హాస్య బ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు వీరి తండ్రి.
రచనా ప్రస్థానం సవరించు
భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు 'కీర్తిశేషులు' లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాడు.
- నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురాని కథ, విచిత్ర కుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.
- తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.
- ఆయన 79 సంవత్సరాల వయస్సులో రాజమండ్రిలో మరణించారు . ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
సాహిత్య రచనలు సవరించు
- భజంత్రీలు (నాటకం)
- దంత వేదాంతం (నాటకం)
- కీర్తిశేషులు (నాటకం)[2]
- మనస్థత్వాలు (నాటకం)
- తరం-అంతరం (నాటకం)
సినిమా రంగం సవరించు
- ఆత్మ గౌరవం (1965) (డైలాగ్స్ రచయిత)
- మరపురాని కథ (1967)
- కథానాయకుడు (1969)
- అల్లుడే మేనల్లుడు(1970)
- ఆడజన్మ (1970)
- బొమ్మా బొరుసా (1971)
- రామరాజ్యం (1973)
- ఆడపిల్లల తండ్రి (1974)
- అల్లుడొచ్చాడు (1976)
- పొగరుబోతు (1976)
- మనిషి రోడ్డున పడ్డాడు (1976)
- సాహసవంతుడు (1978)
- షోకిల్లా రాయుడు (1979)
- నారి నారి నడుమ మురారి
అవార్డులు సవరించు
- జంద్యాల మెమోరియల్ అవార్డ్. [1] Archived 2006-01-12 at the Wayback Machine తీసుకుంటున్న తనికెళ్ళ భరణి గురించి ది హిందూ దిన పత్రిక 1.8.2006 న సందర్భము.
సూచనలు సవరించు
బయటి లింకులు సవరించు
మూలాలు సవరించు
- ↑ "Bhamidipati no more". ది హిందూ. ది హిందూ. సెప్టెంబరు 5, 2007. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 13 January 2015.
- ↑ ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.