ఎస్.డి.లాల్ (1931 మే 8 - 1993 ఫిబ్రవరి 2) తెలుగు చలనచిత్ర దర్శకుడు. నిర్మాత. అతని పెరు సయ్యద్ లాల్. అతను Sd.లాల్ గా సంతకం చేసేవారు. కానీ సినిమాలలో అతని పేరును ఎస్.డి.లాల్ గా ప్రచురిస్తారు. అతని తమ్ముడు సయ్యద్ సాహిద్ లాల్ కూడా అసిస్టెంట్ కెమేరామన్ గా పనిచేసేవాడు.[1] అతని మాతృ భాష ఉర్దూ అయినా తెలుగు, ఆంగ్ల భాషలలో పండితుడు. అతను తెలుగు, ఆంగ్ల భాషలలో అనేక నవలలు, గ్రంథాలను అధ్యయనం చేసాడు.

జీవిత విశేషాలు మార్చు

అతను 1931 మే 8న జన్మించాడు. 1949లో చిత్రపరిశ్రమలోకి ప్రవేశించాడు. దర్శకుడికి కావలసిన అన్నిరంగాలలోను శిక్షణ పొంది పరిణితి చెంది 1958లో అపూర్వ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సినిమాకు దర్శకునిగా మొదటి చిత్రంతో ప్రారంభించాడు. అతను విఠలాచార్యతో సహదర్శకునిగా 9 చిత్రాలలో పనిచేసాడు.

అతని మొదటి చిత్రం 1960లో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి . తరువాత అతను అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వాటిలో ఎక్కువ భాగం ఎన్.టి. రామారావు నటించిన చిత్రాలు. చెన్నై ఫిల్మ్‌ టౌన్, కోడంబాక్కంలో దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఒక కాలనీని నిర్మించడంలో ఆయన చేసిన కృషిని పరిశ్రమల వర్గాలు అతనిని ఎక్కువగా గుర్తుంచుకుంటారు. మోడరన్ థియేటర్స్‌తో పనిచేసిన సమయంలో అతను కంపెనీ భాగస్వాములలో ఒకరైన రాజారాంతో సంప్రదింపులు జరిపాడు. రాజారాం తరువాత అప్పటి డి ఎం కె ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. లాల్ అతనిని కలుసుకున్నాడు. దర్శకులకు హౌసింగ్ కాలనీ అవసరమని అతనికి వివరించాడు. ఫలితంగా ప్రస్తుత రాజారామ్ డైరెక్టర్స్ కాలనీలో ఇప్పటికీ చాలా మంది చలనచిత్ర దర్శకులు ఉన్నారు.

అతను దర్శకత్వం వహించిన చిత్రాలు అనేకమైన వాటికి సి.నారాయణరెడ్డి పాటల రచయితగా ఉన్నాడు. ఎన్నెన్నో ఖవ్వాలీలకు సినారె తో పాటు లాల్ సరికొత్త రూపకల్పన చేసాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

ఎస్.డి. లాల్ కుమారుడు ఎస్.డి. మీర్ సినిమాటోగ్రాఫర్. టెలివిజన్ సీరియల్స్ కు దర్శకుడు. మీర్ పూర్వ నటులు నాగభూషణం, రక్తకన్నీరు సీత దంపతుల కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారి పెద్ద కుమారుడు అబిద్ భూషణ్ ఒక నటుడు, క్రైమ్ సీరియల్, రియల్ డిటెక్టివ్స్‌లో నాచికేత్ పాత్ర పోషిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు ఆసిఫ్ భూషణ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు.

లాల్ చిన్న కుమారుడు ఎస్. డి. జాన్ ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అతను నటి హేమ ను వివాహం చేసుకున్నాడు. [1]

సినిమాల జాబితా మార్చు

తెలుగు మార్చు

  1. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  2. భీమాంజనేయ యుద్ధం (1966)
  3. మొనగాళ్ళకు మొనగాడు (1966)
  4. హంతకులొస్తున్నారు జాగర్త (1966)
  5. నిండు మనసులు (1967)
  6. నేనే మొనగాణ్ణి (1968)
  7. భలే మాష్టారు (1969)
  8. నిప్పులాంటి మనిషి (1974)
  9. అన్నదమ్ముల అనుబంధం (1975)
  10. నా పేరే భగవాన్ (1976)
  11. నేరం నాదికాదు – ఆకలిది (1976)
  12. మగాడు (1976)
  13. నిండు మనిషి (1978)
  14. ముగ్గురూ ముగ్గురే (1978)
  15. రాజపుత్ర రహస్యము (1978)
  16. లాయర్ విశ్వనాథ్ (1978)
  17. అందడు ఆగడు (1979)
  18. నకిలీ మనిషి (1980)
  19. పటాలం పాండు (1981)

తమిళం మార్చు

  1. అంతఃపుర మర్మం (1981)

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Narasimham, M. L. (2016-02-25). "Sahasra Siracheda Apoorva Chintamani (1960)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-23.

బయటి లంకెలు మార్చు