భల్లటుడు సంస్కృత కవి. అతను వ్రాసిన ఒక కూర్పు మాత్రమే అందుబాటులో ఉంది, దీని పేరు ' భల్లాట శతకము '. ఇది ఒక వ్యంగ్య శతకము. ఇందులో కవి అవంతివర్మ కాలాన్ని పొగుడుతూ అటుపై వచ్చిన శంకరవర్మ కాలాన్ని పలుమార్లు చీకటి రాజ్యపాలనగా వ్యంగ్యంగా విమర్సించాడు. ఇది కావ్యమాల ప్రకాశలో 'కావ్యగుచ్ఛ' పుస్తకములో ప్రచురించబడింది. ఈ పద్యాల సంకలనంలో అనేక ఉపమానాలు ఉన్నాయి. ఇది ఒక నీతి శతకము.ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు, క్షేమేంద్రుడు, మమ్మాటుడు మొదలైన అలంకార శాస్త్ర ప్రముఖులు పదే పదే అతని పద్యాలను అద్భుతమైన కవిత్వానికి ఉదాహరణలుగా అందించారు. సంస్కృత సాహిత్యంలో తమ రచనల ద్వారా ప్రపంచాన్ని ఆహ్లాదపరిచిన అలరించిన ప్రధాన కవులలో ఇతన్ని లెక్కించి, ఇతన్ని శ్రుతిముకుటధరుడు అని పిలుస్తారు.

భల్లటుడు కాశ్మీర్ నివాసి. ఇతను గురువు, పూర్వీకుల వంశము, రాజ్య పోషణ మొదలైన వాటి గురించి ఏదైనా సమాచారం అందుబాటులో లేదు. కాశ్మీర రాజు అవంతివర్మ కాలం అంటే తొమ్మిదవ శతాబ్దపు మధ్య భాగమని భావించే భల్లటుడు గురించి ప్రస్తావించిన వారిలో ఆనందవర్ధనాచార్య అత్యంత ప్రాచీనుడు. కాబట్టి, ఈ ప్రాతిపదికను బట్టి, భల్లాటుడు కాలం ఎనిమిదవ శతాబ్దం చివరి సగంగా పరిగణించబడుతుంది.

మూలములు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భల్లటుడు&oldid=4026071" నుండి వెలికితీశారు