భాయ్ గురుదాస్

భాయ్ గురుదాస్ (1551 – 25 ఆగస్టు 1636) ప్రభావవంతులైన సిక్కు మత ప్రముఖుడు, రచయిత, చరిత్రకారుడు, సిక్కు మత బోధకుడు. సిక్కులకు ఉన్న 10 గురువులలో నలుగురు గురువులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి భాయ్ గురుదాస్. గురువుల బోధనలను గురు గ్రంథ్ సాహిబ్ లో చాలా భాగం వరకు పొందుపరచారు గురు దాస్.[1]

తొలినాళ్ళ జీవితంసవరించు

1551లో పంజాబ్ లోని గోయింద్వాల్ అనే చిన్న పల్లెటూరులో  జన్మించారు గురుదాస్. ఆయన తండ్రి భాయ్ ఇషార్ దాస్, 3వ సిక్కు  గురువు అయిన గురు అమర్ దాస్ కు మొదటి కజిన్. ఆయన తల్లి  జీవని, గురుదాస్ కు మూడేళ్ళ వయసులో 1554లో మరణించారు  ఆమె.[2][3]

ఆయన 12 ఏళ్ళ వయసులో తండ్రి కూడా మరణించారు. అలా అనాథగా ఉన్న గురుదాస్ ను గురు అమర్ దాస్ దత్తత తీసుకున్నారు. గురు దాస్ సంస్కృతం, బ్రజ్ భాష, పర్షియన్, పంజాబీ (గురుముఖీ) భాషలు  నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన మత బోధనలు చేసేవారు. మొదట్లో ఆయన ఎక్కువగా గోయింద్వాల్, సుల్తాన్ పూర్ లోధీలలో నివసిస్తూ ఉండేవారు. గోయింద్వాల్ లో ఢిల్లీ-లాహోర్ రోడ్డులో ప్రయాణించే  స్వామీజీలు, ఫకీరుల ప్రవచనాలు వినేవారు. ఆ తరువాత  వారణాసి కి మకాం మార్చి, అక్కడ సంస్కృతం, హిందు మతానికి  చెందిన గ్రంథాలను అధ్యయనం చేశారు. గురు అమర్ దాస్ మరణించాకా, గురు రామ్ దాస్ ఈయనను ఆగ్రాలో మత బోధకునిగా  నియమించారు.

తరువాతి జీవితంసవరించు

1577లో హర్మందిర్ సాహిబ్ వద్ద కొలను తవ్వినప్పుడు గురుదాస్  కూడా పాల్గొన్నారు. కర్తర్పూర్ కు యాత్ర వెళ్ళినప్పుడు మొఘల్  చక్రవర్తి అక్బర్ కు ప్రాచీన శ్లోకాలను వినిపించారు గురు దాస్. నిజానికి ఆ సమయంలో సిక్కులందరూ ముస్లిములకు వ్యతిరేకంగా ఉన్నారు. గురువుల కుటుంబంలోని అంతః కలహాలతో సిక్కు మతానికి కొంత నష్టం వాటిల్లిన సమయం కూడా అది. గురుదాస్ చేసిన ఈ పని వల్ల     అక్బ ర్  సిక్కులు ముస్లిం మతానికి వ్యతిరేకంగా లేరని అర్ధం  చేసుకున్నారు.

గురు రామ్ దాస్ మరణించాకా, తరువాతి సిక్కు గురువు గురు అర్జున్ కు గురు దాస్ చాలా మంచి సన్నిహితుడు. గురు అర్జున్ కు ఆయనంటే చాలా గౌరవం. ఆయనను తన మేనమామ అని పిలిచేవారు గురు అర్జున్. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ సిక్కు మత ప్రాభవంపై అసూయ పెంచుకున్నారు. గురుదాస్ కాబూల్, కాశ్మీర్, రాజస్థాన్, శ్రీలంక ప్రాంతాలకు వెళ్ళి సిక్కు మత ప్రచారం చేశారు.

సాహిత్య రచనలుసవరించు

19 సంవత్సరాలు కృషి చేసి 1604లో ఆది గ్రంథ్ను పూర్తి చేశారు. ఆది గ్రంథ్ ను గురు అర్జున్ చెప్తూండగా రాశారు గురుదాస్. ఇదే కాక గురు అర్జున్ రాసిన భాయ్ హైరా, భాయ్ సంత్ దాస్, భాయ్ సుఖా, భాయ్ మనసా రామ్ వంటి గ్రంథాలను కూడా పర్యవేక్షించారు. ఆయన స్వంతంగా పంజాబీ భాషలో రాసిన అన్ని రకాల సాహిత్యాన్నీ కలిపి వరన్ భాయ్ గురుదాస్ అని పిలుస్తారు.[2]

అకాల్ తక్త్ కు మొదటి జతేదార్సవరించు

15 జూన్ 1606న గురు హరగోబింద్ అకాల్ తక్త్ ప్రకటించారు. ఆయనే దానికి శంకుస్థాపన కూడా చేశారు. దాని నిర్మాణ బాధ్యతలను ప్రముఖ  సిక్కు సేవకుడు బాబా బుద్ధ, భాయ్ గురుదాస్ లకు అప్పగించారు. దీని నిర్మాణంలో ఇంకో వ్యక్తికి అనుమతిలేదు. వహేగురు తక్త్ ను భద్రపరచవలసిన బాధ్యత కూడా గురు హరగోబింద్ దే. అది నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో గురు హరగోబింద్ ను గ్వాలియర్ కోటలో జైలులో ఉన్నప్పుడు బాబా బుద్ధను హర్మందిర్ సాహిబ్ లో జరగవలసిన సేవల బాధ్యతను, అకాల్ తక్త్ బాధ్యతలను గురుదాస్ కు అప్పగించారు ఆయన. అలా అకాల్ తక్త్ కు మొదటి జతేదార్ అయ్యారు భాయ్ గురుదాస్.

ఆయన రాసిన సాహిత్యంసవరించు

  • సంస్కృతంలో 6 పంక్తులతో ఉండే 8 పద్యాలు రాశారు గురుదాస్.
  • బ్రజ్ భాషలో 672 కవితలు, 3 స్వయ్యాలు.
  • పంజాబీ భాషలో 912 పౌరిలు ఉన్న 40 వార్లు రాశారు.

మరణంసవరించు

25 ఆగస్టు 1636లో గోయింద్వాల్ లో మరణించారు భాయ్ గురుదాస్.[3] గురు హరగోబింద్ స్వయంగా ఆయన అంత్యక్రియలు చేశారు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Saints - Sikhs.org
  2. 2.0 2.1 GURDĀS, BHĀĪ (1551-1636). Punjabi University Punjabi.
  3. 3.0 3.1 Bhai GURDAS (1551-1636) Archived 2019-02-05 at the Wayback Machine - SikhHistory.com