భారతదేశంలోని విద్యా బోర్డులు

భారతదేశంలో 10, 12 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు విద్యాబోర్డులు ఉన్నాయి. విద్యాబోర్డులు రెండు రకాలుగా విభజించబడ్డాయి. జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించే విద్యాబోర్డులను జాతీయ విద్యాబోర్డులు అని, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించే విద్యాబోర్డులను రాష్ట్ర విద్యాబోర్డులు అని అంటారు. భారతదేశంలో SSC, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే మూడు జాతీయ విద్యా బోర్డులు, ఇతర రాష్ట్ర విద్యా బోర్డులు ఉన్నాయి.

ఇంటర్మీటియట్ విద్యా బోర్డు, రాజ్‌షాహి

భారతదేశంలో పాఠశాల విద్యను వివిధ అకాడెమిక్ బోర్డులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సిఐసిసిఇ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అనే మూడు జాతీయ బోర్డులు మన దేశంలో ఉన్నాయి. ఇవి 10, 12 తరగతులలో చదువుతున్న విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తాయి.

భారత ప్రభుత్వంచే గుర్తించబడిన కొన్ని విద్యా బోర్డులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

  1. ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
  2. ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
  3. బోర్డు ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఢిల్లీ
  4. అస్సాం బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
  5. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు
  6. బోర్డు ఆఫ్ యూత్ ఎడ్యుకేషన్ ఇండియా
  7. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మధ్యప్రదేశ్
  8. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, రాజస్థాన్
  9. ఛత్తీస్గఢ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
  10. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

మూలాలు మార్చు

[1]