భారతీయ భూస్వామ్యవాదం
భారతీయ భూస్వామ్యవాదం 1500 లలో మొఘలు రాజవంశం వరకు భారతదేశ సామాజిక నిర్మాణాన్ని రూపొందించిన భూస్వామ్య సమాజాన్ని సూచిస్తుంది. భారతదేశంలో భూస్వామ్యవాదాన్ని పరిచయం చేయడంలో, ఆచరణలో పెట్టడంలో గుప్తులు, కుషాన్లు ప్రధాన పాత్ర పోషించారు. భూస్వామ్యం కారణంగా సామ్రాజ్యం క్షీణత సంభవించడానికి వీరు ఉదాహరణలుగా ఉన్నారు.
పేరు వెనుక చరిత్ర
మార్చుమధ్యయుగ ఐరోపా ఉపయోగించిన ఫ్యూడలిజం అనే పదం తరువాత భారతదేశంలో ఉపయోగించబడిందని పరిశోధకులు భావిస్తున్నారు. భూస్వాములు రాజులకు, చక్రవర్తులకు శిక్షితులైన సైనికులను అందించి బదులుగా పాలకుల నుండి అదనంగా భూములను అందుకుంటారు. సామంత ప్రభువుల భూములలో కౌలుదారులైన రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుమతి పొందుతూ బదులుగా సైనిక రక్షణబాధ్యత వహిస్తూ నివాళిగా ప్రభువులకు ఉత్పత్తులలో కొంత భాగాన్ని కూడా ఇచ్చేలా ఏర్పాటు చేసుకునేవారు. మధ్య ఆసియా నుండి వచ్చిన కుషాను రాజవంశం భారతదేశం మీద దాడి చేసి, సరికొత్తగా వారి స్వంత విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా భూస్వామ్యవాదం భారతదేశంలో ప్రవేశపెట్టబడిందని భావిస్తున్నారు. భారతీయ భూస్వాములను తాలూక్దారు, జమీందారు, జాగీర్దారు, సర్దారు, మంకారి, దేశ్ముఖు, చౌదరి వంటి పదాలతో పిలిచారు. భారతదేశంలోని మిగిలిన ఉపఖండం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ వ్యవస్థలు చాలావరకు రద్దు చేయబడ్డాయి. డి. డి. కొసాంబి, ఆర్. ఎస్. శర్మ, డేనియలు థోర్నరు కలిసి మొదటిసారి భారతీయ చరిత్ర అధ్యయనంలోకి రౌతులను తీసుకువచ్చారు.[1]
నిర్మాణం
మార్చుగుప్తుల కాలం నుండి చక్రవర్తులు మంజూరు చేసిన భూమికి అధిపతులైన భూస్వాములకు, చక్రవర్తిచేత అణచివేయవడిన భూస్వామ్య పాలకులకు " సామంతులు " అనే పదం వర్తింపజేయబడింది. జయించిన ప్రాంతాల మీద అధికారాన్ని అమలు చేయడంలో అలసత్వం ఏర్పడిన తరుణంలో సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించడానికి ఇది దారితీసింది. కొన్ని ఉన్నత పరిపాలనా స్థానాలు వంశపారంపర్యంగా మారాయి.[2] భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ నిజమైన అర్హత సాధించిందా అనే అంశం గురించి చరిత్రకారులలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాజు, సామంతరాజు, దాసుడు మధ్య ఆర్థిక ఒప్పందం లేనట్లు స్పష్టంగా ఉంది. ఇతర చరిత్రకారులు దీనిని భూస్వామ్యవాదం అని వర్ణించేంత సారూప్యతలు ఉన్నాయని వాదించారు. ఇది అధికార వికేంద్రీకరణ విధానంలో భాగమని భావిస్తున్నారు. సామంతులు అందించే సేవలకు బదులుగా భూములను మంజూరు చేసిన తరువాత వారు ఆ ప్రాంత యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకుని తమను తాము ఆప్రాంతానికి పాలకుడిగా పేర్కొంటూ పాలన కొనసాగించారు. ఇందుకు బదులుగా వారు ఆదాయంలో కొంత భాగాన్ని చక్రవర్తికి చెల్లించవలసి ఉంటుంది. అలాగే సామంతులు అధిపతి కోసం దళాలను అందించాలి. ఈ ప్రభువులు తరచూ వారి రాజ అధిపతులకు చిన్న రాజభవనాలను నిర్మించి ఇవ్వడం ద్వారా వారిని సేవించే వారు.[3] ఈ విధానం అధికారం విచ్ఛిన్నతను ప్రోత్సహించింది. ముస్లిం ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటన బలహీనపడడానికి ప్రాంతీయవాదం అభివృద్ధి చెందడానికి ఇది ఒక ప్రధాన కారణమని భావించబడింది.[4]
బీహారు
మార్చుభూస్వామ్యవాదానికి భారతదేశంలోని బీహారు ప్రాంతం (ఇప్పుడు ఒక రాష్ట్రం) కేంద్రంగా ఉంది. కుషాన్లు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు, గుప్తసామ్రాజ్యం ఉత్తర భారతదేశాన్ని పాలిస్తూ వర్ధిల్లుతున్నప్పుడు మొదటిసారిగా భూస్వామ్యవాదం ప్రారంభమైంది. భూస్వామ్య ప్రభువులు ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా పరిపాలించారు; ఇప్పటికీ పాక్షిక భూస్వామ్య పరిస్థితులు ఉన్నాయి. పర్యవసానంగా స్థూల జాతీయోత్పత్తిలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆధునిక బీహారు ఆర్ధికస్థితి అభివృద్ధిలో ఉన్నప్పటికీ ఆర్ధిక ప్రయోజనాలు బడుగు, బలహీన వర్గాలకు అందనికారణంగా ఈ ప్రాంతంలో పిల్లలలో పోషకాహార లోపం అధికంగా ఉంది.[5]
తెలంగాణా
మార్చుడోరాలు దేశ్ముఖులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే వరకు ఈ ప్రాంతాన్ని భూస్వామ్యవాదులు పరిపాలించారు. వారు భూమి మొత్తాన్ని తమ కమతాలుగా ఉంచారు. భూములలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ తమ ఉత్పత్తులను యజమానులకు ఇచ్చేవారు. బదులుగా వారికి జీవనోపాధికి సరిపోయే ఆహారం మాత్రమే ఇవ్వబడింది. 1946 నుండి 1951 వరకు తెలంగాణ తిరుగుబాటు అని పిలువబడింది. ఈ విధానం తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి అని పిలువబడింది. భూస్వామ్య ప్రభువుల మీద రౌతులు చేసిన తిరుగుబాటు ఈ ప్రాంతంలోని భూస్వామ్య సమాజ విధానాన్ని వివరిస్తుంది. [6] భూస్వామ్య ప్రభువులు గాడి అని పిలువబడే ఎత్తైన కోటలో నివసించేవారు.[7] దానిలోకి ప్రవేశించినందుకు వారు తమ పాదరక్షలను గాడి ప్రవేశద్వారం వద్ద వదిలివేస్తారు. మాదిగలు, ఇతర వెనుకబడిన తరగతులు గాడి లేదా డోరా ముందు వెళుతుంటే వారి పాదరక్షలను చేతుల్లోకి తీసుకెళ్లవలసి ఉంది.
అణచివేతకు గురైనవారు పునరావృతంగా పలికే ప్రసిద్ధ పంక్తి “బాంచెను దొరా నీ కల్మోక్త (దొరా నీ పాదాలకు మొక్కే బానిసను).[8] ఒక ప్రధాన తెలుగు ఫిల్మ్ బ్లాకు బస్టరు, మా భూమి, భూస్వామ్య ప్రభువుల క్రింద సమాజం అనుభవించిన స్థితిగతులను చూపించింది.
ఈ ప్రాంతంలో భూమి పండించేవారికి ఇంకా తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ మీద శ్రీకృష్ణ కమిటీ నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. ఇతర ప్రాంతాలవారి కంటే తెలంగాణ భూస్వాములు రైతులపట్ల శత్రుభావంతో వ్యవహరించే వారని చెప్పారు.[9]
కేరళ
మార్చుమధ్య యుగాలలో కేరళలో చేర రాజవంశం ముగింపు, బ్రిటిషు పాలన మద్య భూస్వామ్యవాద రాజ్యాలు ఉద్భవించాయి. కేరళలో భుస్వామ్యవాదం ప్రాధాన్యత వహించిన సమయంలో నాయర్లు భూస్వామ్యవాదులుగా, యోధులుగా ప్రముఖ్యత వహించారు. ఈ భూమి నాయరు సొంతం అయినప్పటికీ వెనుకబడిన వర్గాలచేత వ్యవసాయం చేయబడుతుంది. బదులుగా నాయర్లు రైతుల నిర్వహణ, రక్షణ బాధ్యత వహిస్తారు.[ఆధారం చూపాలి]
మద్రాసు ప్రెసిడెంసీ
మార్చు1799 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో (ప్రస్తుత తమిళనాడు, పరిసర ప్రాంతాలు) అనేక జమీందారీలు స్థాపించబడ్డాయి. వీటిలో ఆరణి, రామనాడు, గణపూరు, శివగంగ సంస్థానాలు అతిపెద్దవిగా ఉన్నాయి. ఈ జమీందారీ స్థావరాలు బెంగాలులో స్థాపించబడిన ఇలాంటి స్థావరం ఆధారంగా రూపొందించబడింది. మద్రాసులోని జమీందారీ స్థావరాలు చాలావరకు విజయవంతం కాలేదు 1852 లో అన్యాకాంతం అయింది. అయినప్పటికీ కొంతమంది జమీందారీలు 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు ఉన్నారు.
ఉత్తర ఆర్కాటు
మార్చుభారత స్వాతంత్ర్యం వరకు ఉత్తర ఆర్కాటు ప్రాంతం జాగీర్దార్ల ఆధ్వర్యంలో ఉంది. ఆరణి అతిపెద్ద జమ్నిందారీ దేశస్థరాజ కుటుంబంగా ప్రసిద్ధిచెందింది. ఆరణి జమిందారీ సాందూరు రాచరిక రాష్ట్రం కంటే పెద్దది.
ఉత్తర ఆంధ్రా
మార్చుభారత స్వాతంత్ర్యం వరకు ఉత్తర ఆంధ్ర ప్రాంతం దొరల ఆధ్వర్యంలో ఉంది. పూసాపతి క్షత్రియ కుటుంబంలో విజయనగరం అతిపెద్ద జమిందారీగా ఉండేది. ఇది ఉదారవాదానికి, జ్ఞానోదయానికి ప్రతీకగా ఉండేది.
రాయలసీమ
మార్చురాయలసీమ ప్రాంతం స్వాతంత్య్రం వచ్చేవరకు అయ్యంగారు ఆధ్వర్యంలో ఉండేది. అతిపెద్ద జమిందారీ పన్యం; ఇది విశ్వామిత్ర గోత్రానికి చెందిన దేశస్థ రాజకుటుంబం చేత పాలించబడింది. ఉదారవాద, జ్ఞానోదయానికి ప్రతీకగా ఉంది.
విదర్భా
మార్చువిదర్భప్రాంతంలో భూస్వామ్యవాదులు వారి అణిచివేత పాలనతో అపకీర్తి సంపాదించారు.
సాహిత్యంలో
మార్చు- భారతీయ భూస్వామ్యవాదం రచయిత రాం చరణ్ శర్మ
- సరస్వతీచంద్ర రచయిత గోవర్ధంరాం మాధవరం త్రిపాఠీ,తరువాత చలనచిత్రంగా చిత్రీకరించబడింది అదే పేరుతో చలనచిత్రం 1968 లో[10]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Habib, Irfan (2007). Essays in Indian History. Tulika. p. 381 (at p 109). ISBN 978-81-85229-00-3.
- ↑ [1], Encyclopædia Britannica
- ↑ [2], Encyclopædia Britannica
- ↑ [3], Encyclopædia Britannica
- ↑ B Vijay Murty (2010-12-16). "Food that's not fit for humans". Hindustan Times. Archived from the original on 2011-01-19. Retrieved 2020-01-11.
- ↑ I Thirumali. Dora and. Gadi: Manifestation of Landlord. Domination in Telangana.
- ↑ "Spat over portfolio". The Hindu. Archived from the original on 13 ఆగస్టు 2004. Retrieved 6 February 2012.
- ↑ "KCR's comments on Nizam's rule raise hackles NEWS ANALYSIS". The Hindu. Archived from the original on 8 డిసెంబరు 2007. Retrieved 6 February 2012.
- ↑ Panel finds no data to prove T backwardness, Deccan Chronicle Archived డిసెంబరు 18, 2010 at the Wayback Machine
- ↑ "Saraswatichandra (1968)". January 21, 2010. Archived from the original on 2018-12-25. Retrieved Feb 8, 2013.
గ్రంధసూచిక
మార్చు- R.S. Sharma, Perspectives in Social and Economic History of Early India, paperback edn., (Munshiram Manoharlal, Delhi, 2003). Translated into Hindi, Russian and Bengali. Gujarati, Kannada, Malayalam, Marathi, Tamil and Telugu translations projected.
- R.S. Sharma, Material Culture and Social Formations in Ancient India, (Macmillan Publishers, Delhi, 1985). Translated into Hindi, Russian and Bengali. Gujarati, Kannada, Malayalam, Marathi, Tamil and Telugu translations projected.
- R.S. Sharma, Urban Decay in India (c.300-1000), (Munshiram Manoharlal, Delhi, 1987). Translated into Hindi and Bengali
- R.S. Sharma, Early Medieval Indian Society: A Study in Feudalisation (Orient Longman Publishers Pvt. Ltd., Delhi, 2003)
- R.S. Sharma, India's Ancient Past, (Oxford University Press, 2005, ISBN 978-0-19-568785-9)
- R.S. Sharma, Indian Feudalism (Macmillan Publishers India Ltd., 3rd Revised Edition, Delhi, 2005)
- R.S. Sharma, The State and Varna Formations in the Mid-Ganga Plains: An Ethnoarchaeological View (New Delhi, Manohar, 1996)
- R.S. Sharma, Origin of the State in India (Dept. of History, University of Bombay, 1989)
- R.S. Sharma, Land Revenue in India: Historical Studies, Motilal Banarsidass, Delhi, 1971
- Historiography of Indian Feudalism Towards a Model of Early Medieval Indian Economy, C. A.D. 600-1000, by Vijay Kumar Thakur. Commonwealth Publishers, 1989. ISBN 81-7169-032-7.
- Dora and. Gadi: Manifestation of Landlord Domination in Telangana, I Thirumali, 1992
- Against Dora and Nizam : People's Movement in Telangana 1939-1948, I Thirumali
- "Chillarollu's Defiances in Telangana, 1900-1944" Indian Historical Review, XXII, 1995-1996
- Origin and Growth of Feudalism in Early India: From the Mauryas to AD 650, by Gian Chand Chauhan. Munshiram Manoharlal Publishers, 2004. ISBN 81-215-1028-7.