భారతీయ మతాలు

భారతదేశం లోని ప్రధాన మతాలు
(భారతీయ మతములు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశములో ప్రధాన మతాలు  : మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాధ్యం కాదు. సృష్టిలో సహజ సిద్ధముగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్ధతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.

మతం అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది దేవుడు.గుడి - గోపురం, పూజ - పూజారి, పవిత్ర గ్రంథం.ప్రార్థనా స్థలాలు, కొన్ని కట్టు బాట్లు మొదలగునవి.. మరి ఇవన్నీ గూడ అన్ని మతాలకు ఒక్కలాగే లేకుండా భిన్నంగా వుంటాయి.అలాగే వివిధ మతాలకు వాటి వాటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు మానవునిలో ఎంత బలంగా నాటుకున్నాయంటే...... మత సిద్ధాంతాలను ఎదిరిస్తే సమాజం రక్త సిక్తం అవుతుంది. అందుకే వాటి జోలికెవరూ దురుసుగా వెళ్ళరు. మత రహిత మని చెప్పుకునే సమాజంలో మతము లేదని కాదు. ఎవరి మతాలను వారు గౌరవించు కోవచ్చుననేది మూల సూత్రం. ఒక మతం గొప్పది.... మరొక మతం తక్కువ అనే పోలిక వుండదు. ఎవరి మతం వారికి గొప్ప. అయినా కొందరు మత ప్రబోధకులు తమ మతమే గొప్పదని ప్రచారం చేస్తూ తమ మతంలో చేరండంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు..... కొంతవరకు వారు సఫలీ కృతులౌతున్నారు కూడా. గతంలో బలవంతపు మత మార్పిడులు జరిగిన దాఖలాలు లేక పోలేదు. నయానో, భయానో, వ్వక్తిగత అభిరుచి తోనో ఒక మతం నుండి మరో మతంలోనికి సులభంగా మారిపోగలిగితే ఈ భారతదేశము ఏనాడో హిందూయేతర మత ప్రాధాన్యత గల దేశంగా మారి పోయి వుండేది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మతం ఎంతో అభివృద్ధి సాంధించినట్లు మనకు ఆధారాలున్నా ఒకప్పుడు బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. అదే ఒరవడి కొనసాగించి వుంటే ఈ నాడు ప్రపంచ మంతా బౌద్ధమత మయమై వుండేది. కాని అలా కాలేదే?

వైవిధ్యభరితమైన దేశంగా, ఉపఖండంగా పేరొందిన భారతదేశంలో హిందూమతం, ఇస్లాం, క్రైస్తవ, సిక్కుమతం, బౌద్ధమతం, జైనమతం వంటివి భారతదేశంలోని ప్రధాన మతాలు.

ప్రధానమతాలు

మార్చు

హిందూమతం

మార్చు

హిందూమతం ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న శక్తివంతమైన మతం. బహుదేవతారాధన, విగ్రహారాధన ఈ మతంలోని ప్రధానలక్షణాలు. అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులతో కూడి మానవజీవన మనుగడకు సహకరిస్తూ, జీవిత పరమార్ధాన్నీ తెలియచేస్తూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే మతం, అనేక నాగరికతలకు పుట్టినిల్లు హిందూమతం.

ఇస్లాం మతం

మార్చు

భారతదేశంలో మరొక మతం ఇస్లాం. మధ్యప్రాచ్యంలో సా.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ఈ మతం ముస్లింరాజుల దండయాత్రలు, ఆక్రమణల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టింది. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు.

క్రైస్తవ మతం

మార్చు

మధ్యప్రాచ్యంలో జన్మించి ఐరోపా ప్రాంతానికి అటుపై ఇతర ప్రపంచానికి విస్తరించిన క్రిస్టియానిటీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం కాగా భారతదేశంలోని మతాలలో ఒకటి. క్రిస్టియానిటీ సా.శ..ఒకటో శతాబ్దంలోనే దేశంలో అడుగుపెట్టినట్టుగా, తొలి చర్చిని కట్టినట్టుగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అటుపై మధ్యయుగాల్లో భారతదేశంలో అడుగుపెట్టిన పలువురు క్రైస్తవ మతబోధకుల ద్వారా ఈ మతం విస్తరించింది. దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో చర్చిలు నిర్మించి ఆరాధనలు చేస్తున్నారు.

సిక్కు మతం

మార్చు

పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా, ఇతర ప్రాంతాలలో తక్కువగా సిక్కు మతస్తులు నివసిస్తున్నారు. సిక్కుమతం భారతదేశంలోనే జన్మించిన మతం. అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుమతస్తులకు ప్రధాన పుణ్యక్షేత్రం. 17 శతాబ్దిలో ఆత్మగౌరవ ప్రకటనగా ఈ మతం ఏర్పడింది. కత్తి, తలపాగా, గడ్డం వంటి మతచిహ్నాలతో సిక్కుమతస్తులు విలక్షణంగా కనిపిస్తారు. వారి పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సిక్కులు మతగురువుగా భావించి గౌరవిస్తారు.

బౌద్ధ మతం

మార్చు

సాశ.పూర్వం భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన మతం బౌద్ధమతం. గౌతమ బుద్ధుడనే రాజవంశీకుడు అహింస, సమానత్వం ప్రాతిపదికన ఈ మతాన్ని ప్రవచించాడు. త్రిపిఠకాలు ఈ మతానికి పవిత్రగ్రంథాలు.

భారతదేశంలో ప్రధాన మతాలు
మతం Percent
హిందువులు
  
82.64%
ముస్లింలు
  
11.35%
క్రిస్టియన్లు
  
2.43%
సిక్కులు
  
1.96%
బౌద్ధులు
  
0.71%
జైనులు
  
0.48%
ఇతర మతాలు
  
0.42%
భారతదేశంలో ప్రధాన మతాలు

భారతదేశంలో ఎన్ని ప్రధాన మతాలున్నాయి. ఆయా మతాల జనాభా ఎంత, మొత్తం జనాభాలో అయా మతస్తుల శాతం ఎంత.... అని పరిశీలిస్తే..... (ఇక్కడ ఇచ్చిన అంకెలు.... 2001 నాటి జనాభా లెక్కలు)

మతం పేరు................ జనాభా.............. జనాభాలో శాతం
  1. హిందువులు.................. 54,97,79,481....... 82.64
  2. ముస్లింలు...................... 7,55,12,439....... 11.35
  3. క్రిస్టియన్లు....................... 1,61,65,447....... 2.43
  4. బౌద్ధులు.......................... 47,19,769 ...... 0.71
  5. సిక్కులు....................... 1,30,78,146....... 1.96
  6. జైనమతస్తులు................ . 32,06,038...... 0.48
  7. ఇతర మతాలు................ 27,66,285 .... . 0.42

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు