షియా ఇస్లాం (ఆంగ్లం : Shia Islam) (అరబ్బీ شيعة షి‘యాహ్), కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. ఇస్లాం మతములో సున్నీ ఇస్లాం తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. ఇరాన్ దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు.[1], అజర్‌బైజాన్ [2], బహ్రయిన్[1], ఇరాక్, లెబనాన్[1] కువైట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్[3], భారతదేశంలలో వీరిని మైనారిటీలుగా పరిగణిస్తారు.

ఇమామ్ అలీ మస్జిద్ - నజఫ్, ఇరాక్, షియా ఇమామ్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఖనన ప్రదేశం.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
వ్యాసాల క్రమం
షియా ఇస్లాం

విశ్వాసాలు & సాంప్రదాయాలు

అలీ వారసులు
కుటుంబంలో ఇమామ్ లు
మొహర్రంలో మాతమ్
అక్స్ జ్యోతి · ఇస్మాహ్
తవస్సుల్ · ముల్లాలు
అవతరింపులు

అభిప్రాయాలు * దృష్టికోణాలు

ఖురాన్ · సహాబా
ముఆవియా I · అబూబక్ర్ · ఉమర్

పవిత్ర దినాలు

ఆషూరా · అర్‌బయీన్ · మౌలీద్
ఈదుల్ ఫిత్ర్ · ఈదుల్ అజ్ హా
ఈద్ అల్-గదీర్ · ఈద్ అల్ ముబాహిలా

చరిత్ర

అస్నాయె అషరీ · ఇస్మాయిలీ · జైదీ
పరిశుద్ధ కలాం
ముబాహలా · రెండు విషయాలు
ఖుమ్మ్ · ఫాతిమా ఇల్లు
మొదటి ఫిత్నా · రెండవ ఫిత్నా
కర్బలా యుద్దం
Persecution

అహ్ల్ అల్-కిసా

ముహమ్మద్ · అలీ · ఫాతిమా
హసన్ · హుసేన్

నలుగురు సహాబాలు

సల్మాన్ ఫార్సీ
మిక్‌దాద్ ఇబ్న్ అస్వద్
అబూ జర్ గఫ్ఫారీ
అమ్మార్ ఇబ్న్ యాసిర్

వ్యుత్పత్తి , అర్థం

మార్చు

షియాహ్ బహువచనం, షియ్ ఏకవచనం,[2] అర్థం అనుయాయుడు, అనుంగుడు, సహచరుడు లేదా విభాగం. ఖురాన్ లోనూ ఈ పదము ఉపయోగించబడినది (షియా ఇస్లాం గురించి కాదు) ఈ పద ఉపయోగ సమయంలో స్ఫురించే భావన "అనుయాయుడు", ఋణాత్మక, ధనాత్మక దృష్టికోణంతోనూ ఈ పదాన్ని వినియోగించబడింది. "షియా" అను పదము, షియా‘తు ‘అలీ (అరబ్బీ : شيعة علي ) నకు సంక్షిప్తరూపం, అర్థం, "అలీ అనుయాయుడు" లేదా "అలీ విభాగానికి చెందినవాడు".[2]

విశ్వాసాలు

మార్చు

అలీ వారసత్వం

మార్చు

షియా ముస్లింలు, ఏవిధంగా ఐతే అల్లాహ్ తన పవక్తను ఎంచుకుంటాడో అదేవిధంగా, ప్రవక్త తన వారసుడిని తానే స్వయంగా ప్రకటిస్తాడు. వీరి విశ్వాసం ప్రకారం అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ని, అల్లాహ్ స్వయంగా, ముహమ్మద్ వారసుడిగా ఎన్నుకున్నాడు.

అహ్లె బైత్ - ఇమామ్ లు

మార్చు
 
ముహమ్మద్ సమాధి గల మస్జిద్ ఎ నబవి మదీనా, సౌదీ అరేబియా.

ప్రారంభపు షియా సమూహం, జైదీయులు, సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, ఖలీఫా పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన ఖురైషీయుల వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు (అహ్లె బైత్) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది.[4]

జ్ఞాన దీపిక

మార్చు

ఇస్లాంలో `అక్ల్ అనే పదము ఎక్కువగా, ప్రారంభకాలపు షియా పండితులు ఉపయోగించారు. అరబ్బీ పదజాలమైన హిల్మ్ (అరబ్బీ حلم ) లేదా 'జ్ఞానం' అర్థం "సంపూర్ణ న్యాయం, స్వీయ సహనం , హుందాతనం" లకు ఉపయోగింపబడేది. దీని వ్యతిరేకార్థ పదము జహ్ల్ లేదా 'అజ్ఞానం', మూర్ఖత్వానికి సఫాహ్ అనే పదజాలం ఉపయోగించేవారు.[5]

అక్ల్ కలిగినవాడిని అల్-ఆఖిల్ అనీ (బహువచనం : అల్-ఉక్ఖాల్ ) ఈతడు భగవంతునితో సాన్నిహిత్యం కలిగివుంటాడనీ సిద్ధాంతం. ఇమామ్ జాఫరె సాదిఖ్ ఈవిధంగా సెలవిస్తారు "ఈ అక్ల్, ఓ అవగాహన, అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారి కొరకు కలిగే అవగాహన, అల్లాహ్ సత్యము, ఈ సత్యము గురిచించి తెలిపే 'ఇల్మ్' లేదా దివ్యజ్ఞానము ద్వారా మానవాళికి సేవలందించవచ్చును".

ఈతని కుమారుడు, ఇమామ్ మూసా అల్ కాజిమ్ (d. 799), ఈ సిద్ధాంతాన్ని ఇంకనూ విశాలపరుస్తూ విశ్లేషిస్తూ, ఈ విధంగా సెలవిచ్చారు; "అక్ల్ అనునది, ఓ దివ్యమైన అవగాహన, మనసులోని తేజస్సు, ఈ తేజస్సే అల్లాహ్ యొక్క సంజ్ఞలను పొందగలదు".[5] ఇంకనూ; "ఇమామ్ లందరూ హుజ్జతుల్ జాహిరా బహిరంగంగా కనిపించే అల్లాహ్ సాక్షులు, 'అక్ల్' అనునది హుజ్జతుల్ బాతినా అంతర్గత సాక్షి.[5]

అదేవిధంగా అక్ల్ కు వ్యతిరేకం జహ్ల్ ఓ తమస్సు, ఓ గాఢాందకారం, ఈ గాఢాందకారంలో 'సఫా' లేదా మూర్ఖత్వం ఉద్భవిస్తుంది, ఈ మూర్ఖత్వం జ్ఞానాన్ని హరిస్తుంది, జునూన్ లేదా స్పర్శాలేమి మానవుడిని అల్లాహ్ ను పొందేమార్గం నుండి వేరుచేస్తుంది. 'అక్ల్' అల్లాహ్ ను అవగాహన చేసుకునే ఓ మూల హేతువు.[5]

ఇస్మాహ్

మార్చు

ఇస్లాంలో ఇస్మాహ్' అనునది, చెడునుండి స్వేచ్ఛ పొందే దివ్యమార్గం.[6] ముస్లింల విశ్వాసాల ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త , ఇతర ఇస్లామీయ ప్రవక్తలు ఈ 'ఇస్మాహ్' దివ్యత్వాన్ని కలిగి వుండేవారు. షియాముస్లిం సమూహములైన "ఇస్నాయె అషరి" ('బారా ఇమామ్'), ఇస్మాయిలీ లు, ఈ ఇస్మాహ్ ఇమామ్‌లకు, ఫాతిమా జహ్రాలకూ వుండేదని విశ్వసిస్తారు, కానీ జైదీలు మాత్రం ఈ ఇస్మాహ్ ఇమామ్‌లకు వుండేదికాదని విశ్వసిస్తారు.

ఆధ్యాత్మిక విశ్వాసాలు

మార్చు

ముల్లాలు

మార్చు

విశ్వాసము

మార్చు

షియా ఇస్లాం విశ్వాసాల ప్రకారం, పండ్రెండవ ఇమామ్ అయిన మహది, ఒకానొకప్పుడు అదృశ్యుడయ్యాడు, తరువాత ఏదో ఒక రోజు మరలా సాక్షాత్కరిస్తాడు, ప్రపంచంలో న్యాయాన్ని తిరిగీ స్థాపిస్తాడు. కొన్ని షియా వర్గాలు, ఉదాహరణకు జైదీ, నిజారీ, ఇస్మాయిలీలు దీనిని విశ్వసించరు.

చరిత్ర

మార్చు

పుట్టు పూర్వోత్తరాలు

మార్చు

షియా ఇస్లాం సమూహం ఆవిర్భావానికి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు కానవస్తాయి. 1. ముహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత అతని అల్లుడైన అలీని ఖలీఫా చేయాలని మొదటి ఉద్యమం, ఇది మొదటి ఫిత్నా కాలంలో జరిగింది.[7] ఈ సిద్ధాంతం ప్రకారం, రాజకీయ విభాగం (అలీ పార్టీ) బయలు దేరి, అలీని ఖలీఫాగా ఎన్నిక చేయాలని వీరి వారసులనే ఖలీఫాలుగా ఎన్నుకోవాలని ఉద్యమించింది. 2. క్రమేపీ ఇదే ఉద్యమం ధార్మిక విభాగంగాను ధార్మిక ఉద్యమంగానూ మారినది.[4]

సమూహము

మార్చు

జనగణన

మార్చు
 
Islam by country     Sunni     Shias   Ibadi
 
Distribution of Sunni and Shia branches of Islam
మధ్య ప్రాచ్యం, దక్షిణాసియాలో షియా ముస్లింల జనాభా
దేశం మొత్తం జనాభా షియా జనాభా షియా జనాభా శాతము
ఇరాన్ 68,700,000 61,800,000 90
పాకిస్తాన్ 165,800,800 33,200,000 20
ఇరాక్ 26,000,000 17,400,000 65
భారతదేశం 1,009,000,000 11,000,000 1
అజర్‌బైజాన్ 9,000,000 7,650,000 85
ఆప్ఘనిస్తాన్ 31,000,000 5,900,000 19
సౌదీ అరేబియా 27,000,000 4,000,000 15
లెబనాన్ 3,900,000 1,700,000 45
కువైట్ 2,400,000 730,000 30
బహ్రయిన్ 700,000 520,000 75
సిరియా 18,900,000 190,000 1
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2,600,000 160,000 6
కతర్ 890,000 140,000 16
ఒమన్ 3,100,000 31,000 1
Source: మధ్యప్రాచ్యం, పశ్చిమదేశాలు, , ప్రభుత్వ-ప్రభుత్వేర సంస్థల మూలాలద్వారా తీయబడిన జనగణన. Archived 2009-06-27 at the Wayback Machine
 
Amount of Shia Muslim adherents per continents displayed on a pie diagram:
       America 0.56 %
       Europe 4.42 %
       Africa 0.78 %
       Asia 94.23 %

పవిత్ర నగరాలు

మార్చు

షియా ముస్లింల పవిత్ర నగరాలు:

శాఖలు

మార్చు

షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్‌ల గురించి విభేదాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయింది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ అస్నాయె అషరి, పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు, జైదీయులు.

పండ్రెండు ఇమామ్‌లు

మార్చు

బారా ఇమామ్ లు (పండ్రెండు ఇమామ్ లు) (అరబ్బీ اثنا عشرية ఇస్నా అషరియా) షియా ఇస్లాంలోని ఒక పెద్ద సమూహం (డినామినేషన్). ఒక సంపూర్ణ షియా ముస్లిం తనకు తాను ఈ సమూహపు అవలంబీకుడిగా ప్రకటించుకుంటాడు. ఈ బారా ఇమామ్ లు, ధార్మిక పరంగా, పరిశుద్ధిలైన, సరైన మార్గదర్శకత్వాన్నిచ్చే ఇమామ్ (ప్రతినిధు)లు.

బారా (పండ్రెండు) ఇమామ్‌లు

మార్చు

ముహమ్మద్ ప్రవక్త వంశస్థులే (అహ్లె బైత్) ఈ బారా ఇమామ్ లు, వీరినే షియా ముస్లింలు, ముహమ్మద్ ప్రవక్త తరువాత, తమ ఆత్మపరమైన ప్రతినిథులుగా పరిగణిస్తారు.[4]

 1. అలీ (600–661), ఇతనినే, అమీరుల్ మూమినీన్ అని, ఇమామ్ అలీ అని, షాహె మర్దాన్ (ప్రజల రారాజు) అనీ సంభోదిస్తారు.
 2. హసన్ : (625–669), ఇతనికి అల్ హసన్ అల్ ముజ్తబా అనీ అంటారు.
 3. హుసైన్ : (626–680), అల్ హుసేన్ అష్-షహీద్ అనీ అంటారు.
 4. జైనుల్ ఆబెదీన్ లేదా అలీ ఇబ్న్ హుసైన్ : (658–713),
 5. ముహమ్మద్ అల్ బాకర్ (676–743),
 6. జాఫర్ ఎ సాదిక్ (703–765),
 7. మూసా అల్ కాజిమ్ (745–799),
 8. అలీ ఇబ్న్ మూసా (765–818), (అలీ అర్-రజా)
 9. ముహమ్మద్ అత్ తఖీ (810–835), (ముహమ్మద్ అల్-జవాద్)
 10. అలీ ఇబ్న్ ముహమ్మద్ (827–868), (అలీ అన్-నఖీ)
 11. హసన్ ఇబ్న్ అలీ (846–874), (హసన్ అల్ అస్కరీ)
 12. ముహమ్మద్ ఇబ్న్ హసన్ (868–?), (మహది లేదా ఇమాముల్ అస్ర్)

బారా ఇమాం షియా సమూహాల ప్రకారం షియా ఇస్లాంలోని ఐదు ప్రధాన విశ్వాసాలు:

 • తౌహీద్ (ఏకేశ్వరవాదం): ఏకేశ్వర ఉపాసన
 • 'అదాలత్ (న్యాయం): అల్లాహ్ న్యాయం
 • ప్రవక్త పీఠం : అల్లాహ్ మానవాళి మార్గదర్శకత్వానికి, సహేతుకంగా ప్రవక్తలను అవతరింపజేశాడు. ప్రవక్తలు అల్లాహ్ వాక్కుల వార్తాహరులు. సకల మానవాళికి శాంతిమార్గం చూపుటకు అవతరింపబడ్డారు. ఇలాంటి ప్రవక్తల క్రమంలో ముహమ్మద్ ప్రవక్త ఆఖరివారు.
 • ఇమామా (నాయకత్వం): అల్లాహ్, మానవాళి మార్గదర్శకత్వానికి, ప్రవక్తల ప్రవచనాలను సరిగా అమలు పరచడానికి, అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్తల ప్రవచనాలను ప్రజవద్దకు తీసుకెళ్ళడానికి, సరైన నాయకులనూ ఎన్నుకుంటాడు. ఈ నాయకులు ప్రవక్త వంశస్థులు, వీరినే అహ్లె బైత్ అని వ్యవహరిస్తారు.
 • యౌమల్ ఖియామ (ప్రళయ దినం): ప్రపంచం అంతమైన తరువాత, మానవాళినంతటినీ తిరిగీ జీవాన్నిచ్చి, తుదితీర్పు నిస్తాడు.
 
బహ్రయిన్ లోని షియా ముస్లింలు, ముహర్రం నెలలో "మాతం" (శోకం) ప్రకటించే సన్నివేశం.

అస్నా అషరి (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు (ఇస్లాం ఐదు మూల స్తంభాలు) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది జిహాద్, సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది న్యాయ పోరాటం (అరబ్బీ : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది చెడును వ్యతిరేకించడం (అరబ్బీ النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది, ప్రోత్సహిస్తుంది.[12][13] బారా ఇమామ్ లను అవలంబించేవారి ఐదు సూత్రాలు అఖీదాహ్ అని పిలువబడుతుంది.[14]

 1. సలాహ్ (ప్రార్థన) – ప్రతిరోజూ ఐదు పూటలు ప్రార్థనలు ఆచరించడం.
 2. సౌమ్ (ఉపవాసాలు) రంజాన్ నెలలో ఉపవాసాలు.
 3. హజ్ (పుణ్యయాత్ర) – జీవితంలో కనీసం ఒక్కసారి, మక్కా నగరంలోని కాబా గృహాన్ని సందర్శించి, హజ్ ను ఆచరించడం.
 4. జకాత్ (పేదలకు దాన ధర్మాలు) – పన్నుల రూపంలో పేదలకు దానధర్మాలను ఇవ్వడం (2.5% ఆదాయం, ఆస్తిలో 2.5% భాగాన్ని ప్రతి సంవత్సరం దాన ధర్మాలు చేయడం.)
 5. ఖుమ్ (ఐదవ వంతు పొదుపులు) – ఇమామ్ కు పన్ను రూపేణా చెల్లించడం. (سهم امام), పేద లేదా హక్కుదారులైన అహ్లె బైత్ వారసులకు చెల్లించడం.
 6. జిహాద్ (సంఘర్షణ) – అల్లాహ్ కొరకు సంఘర్షణ పడడం. జిహాద్ లు రెండు రకాలు 1. జిహాద్-ఎ-కుబ్రా : అంతర్-సంఘర్షణ, మానవుని అంతర్లీనంలో వుండే మంచి (సత్యం), చెడు (అసత్యం) ల మధ్య జరిగే సంఘర్షణ. 2. జిహాద్-ఎ-సొగ్రా : బాహ్యపర-సంఘర్షణ, మానవుని జీవితంలో నిత్యమూ తన పరిసరాలలో జరిగే చెడును నివారించే కార్యక్రమం. నవీన దృక్ఫదంలో భావింపబడుతున్న జిహాద్ ఏకోణంలోనూ జిహాద్ కాదు ఇదో ఫిత్నా, ఫిత్నా చేపట్టేవారిని మరణశిక్ష విధించమని ఇస్లాం బోధిస్తుంది.
 7. న్యాయాన్నే ప్రకటించడం.
 8. చెడును త్రుంచివేయడం.
 9. తవల్లా – అహ్లె బైత్ వారసులను, వారి అనుయాయులను ప్రేమించడం, గౌరవించడం.
 10. తబర్రా' – అహ్లె బైత్ లతో శత్రుత్వం వుంచేవారికి దూరంగా వుండడం.

జాఫరీ చట్టాలు

మార్చు

జాఫరీ చట్టాలు లేదా జాఫరీ ఫిఖహ్, బారాఇమామ్ షియాముస్లింల చట్టాలు, వీటిని 6వ షియాఇమామ్ అయిన ఇమామ్ జాఫర్ అల్ సాదిఖ్ రూపొందించారు.

ముహమ్మద్ ప్రవక్త షరియాను సున్నహ్ను షియాలు కేవలం నోటివాక్కులుగా పరిగణిస్తారు. ముహమ్మద్ అల్లుడు అలీ, కుమార్తె ఫాతిమా (అలీ భార్య) వీరూ పండితులే, వీరిద్వారా ప్రజలవద్దకు చేరిన జీవన విధానాలనే తమ జీవనమార్గాలుగా షియాలు ఎన్నుకున్నారు. జాఫరీ చట్టాలలో మూడు పాఠశాలలు గలవు, అవి : ఉసూలి (సిద్ధాంతాలు), అఖ్బారీ,, షేఖి. ఉసూలీ పాఠశాల అన్నిటికన్నా పెద్దది. ఈ పాఠశాలను పాటించని బారాఇమామ్ షియాముస్లిం సమూహాలు అలావీ, అలేవీ, బెక్తాషీ,, అహలె హక్.

ఇస్మాయీలీ

మార్చు

ఇస్మాయీలీ : (అరబ్బీ : الإسماعيليون అల్ ఇస్మాయిలియ్యూన్; ఉర్దూ: إسماعیلی ఇస్మాయీలి, పర్షియన్ :إسماعیلیان ఇస్మాయీలియాన్) ఇస్లాం లోని ఒక శాఖ, షియా ఇస్లాంలోని అస్నా అషరీ తరువాత అతి పెద్ద శాఖ. ఇస్మాయీలీలకు ఆ పేరు ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్ ఆధ్యాత్మిక గురువుగా, (ఇమామ్) జాఫర్ సాదిఖ్ ద్వారా వారసత్వ పరంపరను పొందిన వారిగా, ఇతని పేరున వచ్చింది.

జైదీలకు ఆ పేరు షియా ఇమామ్ ఐన జైద్ ఇబ్న్ అలీ పేరున వచ్చింది.

ఇవీ చూడండి

మార్చు

పాదపీఠికలు

మార్చు
 1. 1.0 1.1 1.2 "Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN 978-0195157130. p 45.
 2. 2.0 2.1 2.2 The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.
 3. "Islam: An Introduction," by Annemarie Schimmel, State University of New York Press, 1992, ISBN 978-0791413272, p 94
 4. 4.0 4.1 4.2 "Shi'ite". Encyclopedia Britannica Online. 2007. Retrieved 2007-11-06.
 5. 5.0 5.1 5.2 5.3 Moezzi, Mohammad Ali Amir (1994), The Divine Guide in Early Shiʻism: The Sources of Esotericism in Islam, Albany: State University of New York Press, p. 6, ISBN 079142121X
 6. Dabashi, Theology of Discontent, p.463
 7. See:
  • Lapidus p. 47
  • Holt p. 72
 8. "The Revenge of the Shia". Archived from the original on 2009-01-03. Retrieved 2009-01-25.
 9. "Religious Minorities in the Muslim World". Archived from the original on 2008-03-06. Retrieved 2009-01-25.
 10. "A History of Islam from a Baha'i Perspective". Archived from the original on 2010-01-05. Retrieved 2009-01-25.
 11. "International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005" (PDF). Archived from the original (PDF) on 17 డిసెంబరు 2008. Retrieved 25 జనవరి 2009.
 12. Momen (1987), p.180
 13. Momem (1987), p.178
 14. Momem (1987), p.176

మూలాలు

మార్చు

ఇతర పఠనాలు

మార్చు

బయటి లింకులు

మార్చు