లడఖ్, భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి. బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు. లేహ్ ఇక్కడి ప్రధాన పట్టణం. లడఖ్ లో బౌద్ధ మతస్తులు ఎక్కువమంది విస్తరించి ఉన్నారు. ఇది 2019 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉండేది. 2019 ఆగష్టులో భారత పార్లమెంటు 2019 అక్టోబరు 31 నుండి లడఖ్ ను జమ్మూ కాశ్మీరు నుండి విడగొట్టి ప్రత్యేక కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించింది.[6]

లడఖ్
కేంద్రపాలిత ప్రాంతం
లడఖ్
లడఖ్ పటం- భారత పరిపాలనలోనిది లేత పసుపు, చైనా/పాకిస్తాన్ పరిపాలనలో ముదురు పసుపు
Coordinates: 34°10′12″N 77°34′48″E / 34.17000°N 77.58000°E / 34.17000; 77.58000
దేశంభారతదేశం
కేంద్రపాలిత ప్రాంతం2019 అక్టోబరు 31[1]
రాజధానిలేహ్[2] కార్గిల్[3]
జిల్లాలు2
Government
 • Bodyజమ్మూ కాశ్మీర్ హైకోర్టు పరిపాలన
 • లెఫ్టినెంట్ గవర్నర్రాధాకృష్ణ మాథుర్
 • లోక్‌సభ సభ్యులుజమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ (బిజెపి)
 • హైకోర్టుజమ్మూ కాశ్మీర్ హైకోర్టు
విస్తీర్ణం
=
 • Total59,146 కి.మీ2 (22,836 చ. మై)
Highest elevation
(సాల్టోరో కాంగ్రి[4])
7,742 మీ (25,400 అ.)
Lowest elevation2,550 మీ (8,370 అ.)
జనాభా
 (2011)
 • Total2,74,289
 • జనసాంద్రత4.6/కి.మీ2 (12/చ. మై.)
Demonymలడఖ్
భాషలు
 • మాట్లాడే భాషలుటిబిటియన్, లడఖీ
 • పరిపాలనఉర్దూ, ఇంగ్లీషు
Vehicle registration[5]
Websitehttp://ladakh.nic.in/

భౌగోళిక స్థితి

మార్చు

సముద్ర మట్టానికి 3 నుండి 6 అడుగుల ఎత్తులో లడఖ్ ఉంది, కాశ్మీర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. శ్రీనగర్ నుండి లడఖ్ వరకు రహదారిని నిర్మించారు. ఈ మార్గం సంవత్సరానికి ఆరు నెలలు హిమపాతం కప్పబడి ఉంటుంది. జన్స్కార్ ఈ ప్రాంతంలోని ప్రధాన నది. ఈ నదికి ఉపనదులున్నాయి.ఉష్ణోగ్రత పరిధులు వేసవిలో 3 నుండి 35 °C వరకు ఉంటాయి. అలాగే శీతాకాలంలో కనిష్టాలు -20 నుండి -35 °C వరకు ఉంటాయి.

రవాణా

మార్చు
 

లడఖ్‌లో సుమారు 1,800 కి.మీ. (1,100 మైళ్ళు) రోడ్లు ఉన్నాయి, వీటిలో 800 కి.మీ. (500 మైళ్ళు).[7] లడఖ్‌లోని మెజారిటీ రహదారులను బోర్డర్ రోడ్స్ సంస్థ చూసుకుంటుంది. లేహ్ లో కుషోక్ బకులా రింపోచీ అనే విమానాశ్రయం ఉంది, దీని నుండి ఢిల్లీకి ప్రతిరోజు విమానాలు నడుస్తాయి. అలాగే శ్రీనగర్, జమ్మూలకు వారానికి ఒకటి చొప్పున విమానాలు ఉన్నాయి

జనాభా

మార్చు
జనాభా వివరాలు
జనాభా శాతం 1000

మంది మగవారికి ఆడ వారు సంఖ్య

జనాభా శాతం 1000

మంది మగవారికి ఆడ వారు సంఖ్య

1951 40,484 1011 41,856 970
1961 43,587 0.74 1010 45,064 0.74 935
1971 51,891 1.76 1002 53,400 1.71 949
1981 68,380 2.80 886 65,992 2.14 853
2001 117,637 2.75 805 115,287 2.83 901

జిల్లాలు

మార్చు

భారతదేశంలోని లడఖ్ కేంద్ర భూభాగం ప్రాంతం. లడఖ్ లో రెండు జిల్లాలు ఉన్నాయి. 2019 అక్టోబరు 31 వరకు, ఈ జిల్లాలు జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉండేవి.

 
లడఖ్ జిల్లాలు
జిల్లాలు వైశాల్యం జనాభా

2011 లెక్కల ప్రకారం

కార్గిల్ జిల్లా 14,086 1,43,388
లేహ్ జిల్లా 45,110 1,47,104
మొత్తం 59,146 2,90,492

అక్షరాస్యత

మార్చు

2001 జనాభా లెక్కల ప్రకారం, లేహ్ జిల్లాలో మొత్తం అక్షరాస్యత 62% (మగవారికి 72%, ఆడవారికి 50%), కార్గిల్ జిల్లాలో 58% (మగవారికి 74% , ఆడవారికి 41%).

రాజకీయాలు

మార్చు

లడఖ్ రాజకీయాలు భారత-పరిపాలన కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ప్రజాస్వామ్య సెటప్‌లో అమలు చేయబడతాయి. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్[8] లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, కార్గిల్[9] లడఖ్ లోక్‌సభ నియోజకవర్గంతోపాటు ఉన్నాయి.[10] భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.[11] లడఖ్ బౌద్ధ సంఘం, ఇమామ్ ఖోమేని మెమోరియల్ ట్రస్ట్, అంజుమాన్-ఎ-జమియాత్-ఉల్-ఉలమా అస్నా అషారియా వంటి లడఖీ మతపరమైన సంస్థలు కూడా ప్రధాన ప్రభావాలను కలిగి ఉన్నాయి.[12][13][14]

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-08-09. Retrieved 2020-01-22.
  2. "Ladakh Gets Civil Secretariat". 22 January 2020.
  3. Excelsior, Daily (12 November 2019). "LG, UT Hqrs, Head of Police to have Sectts at both Leh, Kargil: Mathur". Retrieved 22 January 2020.
  4. "Saltoro Kangri, India/Pakistan". peakbagger.com. Retrieved 22 January 2020.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-11-30. Retrieved 2020-01-22.
  6. "Article 370 revoked Updates: Jammu & Kashmir is now a Union Territory, Lok Sabha passes bifurcation bill". www.businesstoday.in. Retrieved 2020-11-10.
  7. "Transportation" (PDF). archive. Archived from the original on 2012-11-30. Retrieved 2020-04-17.{{cite journal}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Upadhyay, Tarun (2015-10-23). "With 17 seats, Saffron bloom in Leh hill development council". Hindustan Times. Retrieved 2020-09-28.
  9. "Kargil LAHDC polls - Results give a jolt to BJP and PDP". The Statesman. 2018-09-01. Retrieved 2020-09-28.
  10. "Ladakh Lok Sabha candidates try to reach maximum voters as campaigning for Phase 5 ends today". India Today. 2019-05-04. Retrieved 2020-09-28.
  11. "AAP, BJP, Congress Unite In Ladakh". Outlook India. 2020-09-22. Retrieved 2020-09-28.
  12. Irfan, Shams (2009-08-01). "FAULTLINE LADAKH". Kashmir Life. Retrieved 2020-09-28.
  13. "The Monasteries Of Ladakh". Outlook India. Retrieved 2020-09-28.
  14. Chakravarty, Ipsita (2019-05-05). "Saffron shadows: Has the covert presence of Hindutva groups helped the BJP in Ladakh?". Scroll.in. Retrieved 2020-09-28.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=లడఖ్&oldid=4315581" నుండి వెలికితీశారు