భారతదేశంలో మతం

(భారతీయ మతాలు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలో మతం లేదా భారతదేశంలో మతాలు: భారతదేశపు జనాభాలో హిందూ మతం అవలంబించువారు 80% ఉన్నారు. భారత్ లో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం (13.43%) జనాభాతో ఉంది.ఇతర భారతీయ మతాలు బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతంను అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ ఉన్నారు.భారత్ లోని 2% జనాభా క్రైస్తవ మతం అవలంబిస్తున్నారు.

హిందూ మతానికి సంబందించిన పద్మనాభ స్వామి ఆలయం
కొచ్చిన్ లోని మలబార్ కేథడ్రాల్

జనగణన

మార్చు

భారతదేశంలో మత ప్రాతిపదికపైన జనాభా విభజన:

భారతదేశంలో మతాలు[α][β]
మతము వ్యక్తులు శాతము
మొత్తం మతాలు 1,028,610,328 100.00%
హిందువులు 827,578,868 80.456%
ముస్లింలు 138,188,240 13.434%
క్రైస్తవులు 24,080,016 2.341%
సిక్కులు 19,215,730 1.868%
బౌద్ధులు 7,955,207 0.773%
జైనులు 4,225,053 0.41%
ఇతరులు 6,639,626 0.645%
లెక్కించని మతాలు 727,588 0.07%
వనరు: భారత జనాభా గణాంకాలు, 2001[1]
పట్టిక 2: 2001 భారత జనాభా గణాంకాల విషయాలు[α][β]
విషయము హిందువులు[2] ముస్లింలు[3] క్రైస్తవులు[4] సిక్కులు[5] బౌద్ధులు[6] జైనులు[7] ఇతరులు[8]
2001 మొత్తం జనాభాలో% 80.46 13.43 2.34 1.87 0.77 0.41 0.65
10-సం.లలో పెరుగుదల% (est '91–'01) [9][β] 20.3 36.0 22.6 18.2 24.5 26 103.1
లింగ నిష్పత్తి* (సగటు 933) 931 936 1009 893 953 940 992
అక్షరాస్యతా శాతం (సగటు 64.8) 65.1 59.1 80.3 69.4 72.7 94.1 47.0
పని నిమగ్నతా శాతం 40.4 31.3 39.7 37.7 40.6 32.9 48.4
గ్రామీణ లింగ నిష్పత్తి[9] 944 953 1001 895 958 937 995
పట్టణ లింగ నిష్పత్తి[9] 894 907 1026 886 944 941 966
శిశు లింగ నిష్పత్తి (0–6 సం.లు) 925 950 964 786 942 870 976

వనరులు: మతములపై మొదటి రిపోర్టు: 2001 భారత జనాభా గణాంకాలు[10]

     α.   ^ మావో-మరామ్, పావోమాటా, మణిపూర్కు చెందిన 'సేనాపతి జిల్లా' కు చెందిన పురుల్ ఉప-విభజనలను లెక్కలోకి తీరుకోలేదు.      β.   ^ 1991 లో అస్సాం, జమ్ము కాశ్మీర్లో జనగణన జరుగలేదు. ఈ సమాచారంలో కూర్చబడలేదు.

భారత ఉపఖండం

మార్చు
 
ఢిల్లీలోని ఇస్లామిక్ గ్రంథాలయం

భారత ఉపఖండంలో మతాల సమాచారాలు:

  • భారతదేశం: 80% హిందువులు, 13% ముస్లిం, 2% క్రైస్తవులు, 2% సిక్కులు (1,100 M)
  • పాకిస్తాన్: 97% ముస్లిములు, 2% హిందువులు, 1% క్రైస్తవులు (165 M)
  • బంగ్లాదేశ్: 83% ముస్లిములు, 16% హిందువులు (150 M)
  • మయన్మార్: 89% బౌద్ధులు, 4% ముస్లిం, 4% క్రైస్తవులు (43 M)
  • శ్రీలంక: 70% బౌద్ధులు, 15% హిందువులు, 7% ముస్లిం, 7% క్రైస్తవులు (20 M)

వీటి మొత్తంలో: 63% హిందువులు, 29% ముస్లిం, 5% బౌద్ధులు, 2% క్రైస్తవులు, 1% సిక్కులు.

మతాలు, విభాగాలు

మార్చు

హిందూ మతం

మార్చు

హిందూమతం ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న శక్తివంతమైన మతం. భారతదేశ జనాభాలో 80% కన్నా ఎక్కువ జనాభా గల మతము. బహుదేవతారాధన, విగ్రహారాధన ఈ మతంలోని ప్రధానలక్షణాలు. అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులతో కూడి మానవజీవన మనుగడకు సహకరిస్తూ, జీవిత పరమార్ధాన్నీ తెలియచేస్తూ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే మతం, అనేక నాగరికతలకు పుట్టినిల్లు హిందూమతం. ప్రపంచంలో గల హిందూ మతస్థులలో 90% కన్నా ఎక్కువగా భారత్ లోనే నివసిస్తున్నారు.

అయ్యావళి

మార్చు

దక్షిణ భారత దేశంలో ఈ సమూహం ఉంది. వీరు హిందూ మతానికి అంతర్భాగంగానే ఉన్నారు. వీరెక్కువగా తమిళనాడు, కేరళలో గలరు.

ఇస్లాం

మార్చు

భారతదేశంలో మరొక మతం ఇస్లాం. మధ్యప్రాచ్యంలో సా.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ఈ మతం ముస్లింరాజుల దండయాత్రలు, ఆక్రమణల ద్వారా భారతదేశంలో అడుగుపెట్టింది. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు. దీనిలో సున్నీ ఇస్లాం, షియా ఇస్లాం అను రెండు పెద్ద వర్గాలున్నాయి.

అహ్మదీయ

మార్చు

అహ్మదీయ అనునది ఒక చిన్న ఉద్యమం. దీనిని మిర్జా గులాం అహ్మద్ ప్రారంభించాడు. ఇతనిని అనుసరించేవారి సంఖ్య భారత్ లో కొద్దిగా గలదు. వీరు ముస్లింల సమూహములోనే ఒక అంతర్భాగమని భావిస్తారు గాని, ఇస్లాంకు ఈ ఉద్యమానికి ఏలాంటి సంబంధం లేదని, ఇదొక ఫిత్నా అని ముస్లింలు భావిస్తారు.

జైన మతం

మార్చు

భారతదేశంలో జైన మతస్థులు దాదాపు భారత జనాభాలో 0.4% గలరు.

బౌద్ధ మతం

మార్చు

సాశ.పూర్వం భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన మతం బౌద్ధమతం. గౌతమ బుద్ధుడనే రాజవంశీకుడు అహింస, సమానత్వం ప్రాతిపదికన ఈ మతాన్ని ప్రవచించాడు. త్రిపిఠకాలు ఈ మతానికి పవిత్రగ్రంథాలు. భారతదేశంలో బౌద్ధ మతస్థులు దాదాపు 90 లక్షలు గలరు. వీరెక్కువగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లఢఖ్ లలో ఉన్నారు.

సిక్కు మతం

మార్చు

పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా, ఇతర ప్రాంతాలలో తక్కువగా సిక్కు మతస్తులు నివసిస్తున్నారు. సిక్కుమతం భారతదేశంలోనే జన్మించిన మతం. అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుమతస్తులకు ప్రధాన పుణ్యక్షేత్రం. 17 శతాబ్దిలో ఆత్మగౌరవ ప్రకటనగా ఈ మతం ఏర్పడింది. కత్తి, తలపాగా, గడ్డం వంటి మతచిహ్నాలతో సిక్కుమతస్తులు విలక్షణంగా కనిపిస్తారు. వారి పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సిక్కులు మతగురువుగా భావించి గౌరవిస్తారు. భారతదేశంలో సిక్కు మతస్థులు 1.93 కోట్లు గలరు. వీరెక్కువగా పంజాబు రాష్ట్రం, ఢిల్లీ, హర్యానాలో గలరు. భారతదేశంలోని పలు నగరాలలోనూ వీరి జనాభా కానవస్తుంది.

క్రైస్తవ మతం

మార్చు

మధ్యప్రాచ్యంలో జన్మించి ఐరోపా ప్రాంతానికి అటుపై ఇతర ప్రపంచానికి విస్తరించిన క్రిస్టియానిటీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం కాగా భారతదేశంలోని మతాలలో ఒకటి. క్రిస్టియానిటీ సా.శ..ఒకటో శతాబ్దంలోనే దేశంలో అడుగుపెట్టినట్టుగా, తొలి చర్చిని కట్టినట్టుగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అటుపై మధ్యయుగాల్లో భారతదేశంలో అడుగుపెట్టిన పలువురు క్రైస్తవ మతబోధకుల ద్వారా ఈ మతం విస్తరించింది. దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో చర్చిలు నిర్మించి ఆరాధనలు చేస్తున్నారు. భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 2.9% గలరు. భారతదేశమంతటా వ్యాపించియున్నారు.

యూద మతం

మార్చు

ఈ మతస్తులు భారత్ లో 1991 జనగణన ప్రకారం 5271 మంది గలరు. వీరెక్కువగా మహారాష్ట్ర, కేరళలో గలరు.

జొరాస్ట్రియన్ మతం

మార్చు

జొరాస్ట్రియన్లు లేదా పారసీ మతస్తులు భారతదేశ జనాభాలో 0.06% గలరు. వీరెక్కువగా ముంబాయిలో గలరు.

బహాయి విశ్వాసం

మార్చు

ఈ మతస్తులు భారత్ లో దాదా పు 22 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని బహాయి విశ్వాసులలోని ఎక్కువమంది భారతదేశంలో ఉన్నారు.

పాదపీఠికలు, మూలాలు

మార్చు
  1. "Tables: Profiles by main religions. DATA FILE (in Spreadsheet format)". Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original on 2007-08-12. Retrieved 2007-04-17. Please download the file (which is compressed by winzip) to see the data in spreadsheet.
  2. "Tables: Profiles by main religions: Hindus" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2005-04-06. Retrieved 2007-04-17.
  3. "Tables: Profiles by main religions: Muslims" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2006-05-23. Retrieved 2007-04-17.
  4. "Tables: Profiles by main religions: Christians" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
  5. "Tables: Profiles by main religions: Sikhs" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
  6. "Tables: Profiles by main religions: Buddhists" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
  7. "Tables: Profiles by main religions: Jains" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-04-17.
  8. "Tables: Profiles by main religions: Other religions" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2007-06-06. Retrieved 2007-04-17.
  9. 9.0 9.1 9.2 "A snapshot of population size, distribution, growth and socio economic characteristics of religious communities from Census 2001" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. pp. 1–9. Archived from the original (PDF) on 2005-12-16. Retrieved 2007-04-20.
  10. "Tables: Profiles by main religions". Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original on 2007-08-12. Retrieved 2007-04-17.

వెలుపలి లంకెలు

మార్చు