భారతీ పార్ధి (జననం 4 జనవరి 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాలాఘాట్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

భారతీ పార్ధి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు ధల్ సింగ్ బిసెన్
నియోజకవర్గం బాలాఘాట్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-02-23) 1968 ఫిబ్రవరి 23 (వయసు 56)
బాలాఘాట్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
తల్లిదండ్రులు డా. డి.ఎస్. బిసెన్, లీలా దేవి
జీవిత భాగస్వామి ఖిర్సాగర్ పార్ధి
సంతానం 1 కుమారుడు
నివాసం వార్డు నెం. 22, మడికేరి గాలి, బాలాఘాట్, మధ్యప్రదేశ్

రాజకీయ జీవితం

మార్చు

భారతీ పార్ధి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లోపని చేసి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో లాల్బర్రా నుండి తొలిసారి గెలిచింది. ఆమె ఆ తరువాత బాలాఘాట్ మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికై 2023లో మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో టిక్కెట్ కోసం ప్రయత్నించింది, కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. భారతీ పార్ధి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాలాఘాట్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్‌పై 174512 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]

మూలాలు

మార్చు
  1. TimelineDaily (29 March 2024). "Dr Bharti Pardhi: BJP's New Face To Muster Balaghat's Panwar Community Votes" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "पार्षद से सीधे सांसद बनीं बीजेपी की भारती पारधी, जानें कैसे बालाघाट में खिला कमल". Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Rediff (26 June 2024). "These Lady MPs Will Grace 18th Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.