భారతీ శతకం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
భారతీ శతకం కొటికెలపూడి కోదండరామకవి భారతి అనగా సరస్వతీ దేవిని స్తుతిస్తూ రచించిన శతకం. ఈ కవి బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి.
ఈ శతకంలో కవి భారతీదేవిని స్తోత్రం చేయడంతో పాటు వివిధ శాస్త్రాలలోను, రాజనీతి వంటి పరిపాలనా విషయాలలోను తనకు గల గాఢ పరిచయాన్ని తెలిపాడు. బొబ్బిలి రాజవంశంవారు విశిష్టాద్వైతాన్ని అనుసరించేవారు కనుక విశిష్టాద్వైత వేదాంత విషయాలను ఇందులో తెలుపడం విశేషం.
కొన్ని పద్యాలు
మార్చుఇందులో కవి భారతీదేవిని సకల రూప శర్వాణిగా ఇలా వర్ణించాడు:
పరమ బ్రహ్మము చెంగటన్ ప్రకృతివై పద్మాక్షు పాలన రమా
తరుణీ రత్నమవై విభాకరుని చంతం చాయవై బమ్మ దే
వర యొద్దం తగ వాణివై శివు సమీపం బందు శర్వాణివై
కరమొప్పా రెడి నీకు జేశెద నమస్కారంబులో భారతి. (ప.12)
తా: పరంబ్రహ్మకు నీవు ప్రవృత్తివి. విష్ణువునకు రమాదేవివి, సూర్యునకు ఛాయవు. బ్రహ్మకు వాణివి. శివునికి పార్వతివి. సకల రూప స్వరూపిణిగా భారతీదేవిని భావించి కొలిచాడు.