భావన గవాలీ

మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యురాలు.

భావన గవాలీ, ( 1974 మే 23) యావత్మాల్-వశీం లోక్‌సభకు (ఐదుసార్లు) ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు.[1] 1999 నుండి ఈ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా పనిచేస్తున్నది. 25 సంవత్సరాలుగా పదవిలోవున్న భావన, ప్రస్తుతం మహారాష్ట్ర నుండి అత్యంత సీనియర్ పార్లమెంటు సభ్యురాలు.[2][3][4] ఆమె 13 వ లోక్‌సభ, 14 వ లోక్‌సభ, 15 వ లోక్‌సభ, 16వ లోక్‌సభ, 17 వ సభ్యురాలుగా ఎన్నికయింది. శివసేన పార్టీ సభ్యురాలు.

భావన గవాలీ

ముందు సుధాకరరావు నాయక్
నియోజకవర్గం వశీం
పదవీ కాలం
(1999-2004), (2004 – 2009)

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
(2009-2014),(2014-2019), (2019-
నియోజకవర్గం యావత్మాల్-వాషిం

వ్యక్తిగత వివరాలు

జననం (1974-05-23) 1974 మే 23 (వయసు 50)
వశీం జిల్లా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ శివసేన
నివాసం ముంబై

2021 ఆగస్టు 30న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గవాలీకి సంబంధించిన అనేక ప్రాంతాలపై సోదాలు చేసింది.[5][6][7]

భావన 1974 మే 23న మహారాష్ట్రలోని వశీం జిల్లాలో జన్మించింది.

పదవులు

మార్చు
  • 1999: 13వ లోక్‌సభకు ఎన్నిక (మొదటిసారి)
  • 1999–2000: వాణిజ్య కమిటీ సభ్యురాలు
  • 2000–2001: మహిళా సాధికారతపై కమిటీ సభ్యురాలు
  • 2004: 14వ లోక్‌సభకు ఎన్నిక (2వసారి)
  • 2007–09: ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలు
  • 2009: 15వ లోక్‌సభకు ఎన్నిక (3వసారి)
  • 2009: సభ్యుడు, రవాణా, పర్యాటకం, సంస్కృతిపై కమిటీ సభ్యురాలు
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నిక (4వసారి)
  • 2014 సెప్టెంబరు నుండి మహిళా సాధికారత, మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలు
  • 2019: 17వ లోక్‌సభకు ఎన్నిక (5వసారి) [8]

మూలాలు

మార్చు
  1. "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. Archived from the original on 25 మే 2019. Retrieved 19 మార్చి 2022.
  2. "yavatmal washim election results". Archived from the original on 2022-03-08. Retrieved 2022-03-19.
  3. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 87. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 2022-03-19.
  4. "Maharashtra – Yavatmal-Washim". Election Commission of India. Archived from the original on 28 June 2014. Retrieved 2022-03-19.
  5. "ED raids multiple locations linked to Shiv Sena MP in money laundering case". Firstpost. 2021-08-30. Retrieved 2022-03-19.
  6. "Money laundering case: ED raids 7 places linked to Shiv Sena MP Bhavana Gawali". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-08-31. Retrieved 2022-03-19.
  7. "ED raids Sena MP's premises in money laundering case". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-08-31. Retrieved 2022-03-19.
  8. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

బాహ్య లింకులు

మార్చు